Health Tips : ఉదయాన్నే అల్లం టీ తాగితే ఎన్ని లాభాలో..

అల్లంటీని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలను ఈ టీ దూరం చేస్తుంది

Amala Ravula | news18-telugu
Updated: September 21, 2019, 5:26 AM IST
Health Tips : ఉదయాన్నే అల్లం టీ తాగితే ఎన్ని లాభాలో..
అల్లం టీతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
Amala Ravula | news18-telugu
Updated: September 21, 2019, 5:26 AM IST
అల్లం ఆరోగ్యానికి చాలా మంచిదని ఎప్పట్నుంచో చెబుతున్నారు. అల్లంని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. విటమిన్ సి, మెగ్నిషియం, ఎన్నో మినరల్స్ కలిగిన అల్లం శరీరానికి మేలు చేస్తుంది. అయితే.. ఆ అల్లంతోనే టీ చేసుకుని తాగడం వల్ల 8 అద్భుత ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా ఉదయాన్నే తాగడం వల్ల రక్తప్రసరణ మెరుగ్గా మారుతుంది.

వాంతులు రాకుండా..
దూర ప్రయాణాల్లో చాలామంది వాంతులు చేసుకుంటుంటారు.. అలాంటి సమయాల్లో అల్లం టీ ముందుజాగ్రత్తగా తీసుకోవచ్చు.

జీర్ణవ్యవస్థ మెరుగు..
అజీర్తితో బాధపడేవాళ్లు రెగ్యులర్‌గా ఈ టీ తీసుకోవడంతో సమస్య బాధించదు.


నొప్పులకు మందుగా..
చాలామంది కీళ్ల నొప్పులు, ఇతర నొప్పులతో బాధపడుతుంటారు. అలాంటివారికి ఈ టీ ఉపశమనం కలిగిస్తుంది.
Loading...
వాతావరణం మారినప్పుడు..
సీజన్‌ మారుతున్న సమయంలో చాలామంది అనారోగ్యానికి గురవుతారు. అలాంటి సమయాల్లో ఈ టీ అద్భుతంగా పనిచేస్తుంది.
మెరుగ్గా రక్తప్రసరణ..
అల్లం టీని రెగ్యులర్‌గా తీసుకోవడంతో రక్త ప్రసరణ సరిగ్గా ఉంటుంది.
నెలసరి సమయంలో..
మహిళలకు పీరియడ్స్ రెగ్యులర్‌గా వచ్చేలా చేస్తుంది. అంతేకాకుండా ఆ సమయంలో వచ్చే నొప్పిని అరికడుతుంది.
రోగ నిరోధక శక్తి పెంపు..
బాడీలో ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
మానసిక ప్రశాంతత..
ఈ టీని తాగడం వల్ల ఒత్తిడి దూరమవ్వడమే కాక తలనొప్పిని తగ్గిస్తుంది.

అంతేకాదు.. అధికబరువుని తగ్గించి, చెడుకొలెస్ట్రాల్‌ని దూరం చేసి, గుండె సమస్యలు రాకుండా చూస్తుంది.

అయితే అన్నింటికి మంచి కదా అని ఎక్కువగా తాగడం వల్ల అనర్థాలు తప్పవు. అల్లం ఎక్కువగా తీసుకుంటే కడుపులో మంటగా ఉండి.. చికాకు కలిగిస్తుంది. రక్తపోటు కూడా బాగా తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. అందుకే.. రోజుకి తక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు.
First published: September 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...