Health Tips : కొబ్బరినూనెని ఇలా వాడితే ఖచ్చితంగా బరువు తగ్గుతారు..

కొబ్బరినూనె తాగమని కొందరు, తాగకూడదని కొందరు చెబుతున్నారు. అయితే, ఏదీ కూడా అధికంగా తీసుకుంటేనే అనర్థాలు.. కాబట్టి కొబ్బరినూనెని తగిన మోతాదులో తీసుకుంటే ఎన్నో సమస్యలు తగ్గుతాయి.

Amala Ravula | news18-telugu
Updated: June 14, 2019, 10:26 AM IST
Health Tips : కొబ్బరినూనెని ఇలా వాడితే ఖచ్చితంగా బరువు తగ్గుతారు..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: June 14, 2019, 10:26 AM IST
కొబ్బరినూనెని ఆహారంలో భాగంచేసుకోవడం మనకిప్పుడు కొత్త కానీ, మలయాళీలు ఎప్పట్నుంచో ఈ నూనెని వాడుతున్నారు. దీన్ని తీసుకోవడం వల్ల ఎన్నో జబ్బులు తగ్గిపోతాయి. దాదాపు 1500పైగా చేసిన అధ్యయనాలు కొబ్బరి నూనె వాడమనే చెబుతున్నాయి. దీనికి తీసుకోవడం వల్ల అధికబరువు తగ్గుతుంది. డయాబెటీస్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది, థైరాయిడ్ కూడా ఇబ్బందిపెట్టదు.

అయితే, వాడమన్నాం కదా అని ఎంత పడితే అంత.. ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోవద్దు.. మన బరువుని దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. 40 నుంచి 60 కిలోలు ఉన్నవారు. ఒక్కో స్పూన్ చొప్పున బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసే ముందు డైరెక్ట్ గా తీసుకోవాలి.


అదే 60 ఏళ్లు దాటి 80 కిలోల మధ్య ఉన్నవారు.. రోజుకి 4 స్పూన్స్ మోతాదులో తీసుకోవాలి. 80ఏళ్లు దాటిన వారు 5 అలా పెంచుకుంటూ పోవాలి. అయితే, పరిమాణం తక్కువ తీసుకున్నా పర్లేదు కానీ ఎక్కువ కానివ్వకూడదు. ఇలా చేస్తే అసలుకే మోసం.

అంతేకాదు.. కొబ్బరి నూనె అంటే మార్కెట్స్‌లో దొరికే వాటిలో ఎక్ట్స్‌ట్రా వర్జిన్ మాత్రమే వాడాలి. వీటిని నేరుగా తీసుకోవడం వీలుకాపోతే.. సలాడ్స్, పండ్ల రసాలు, హెర్బల్ టీలల్లో కలిపి తీసుకోవాలి.



మొదట్లో వీటిని తీసుకోవడం వల్ల వాంతులు రావడం, విరేచనాలు వంటి సమస్యలు ఎదురవుతాయి. సమస్య మరీ ఎక్కువైతే అది మీకు పడడం లేదని అర్థం చేసుకుని వాడకపోవడం మంచిది.

ఈ వీడియో కూడా చూడండి..

First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...