Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    మహిళలకు 12 రోజుల పీరియడ్ సెలవులు...

    గుజరాత్‌లో ఓ చిన్న కంపెనీ మహిళలకు 12 పీరియడ్ సెలవులను ప్రకటించింది.

    news18-telugu
    Updated: August 14, 2020, 10:09 PM IST
    మహిళలకు 12 రోజుల పీరియడ్ సెలవులు...
    ప్రతీకాత్మక చిత్రం
    • Share this:
    పీరియడ్స్ విషయంలో మహిళలు ఇంకా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే మహిళలకు ఇది మరింత సమస్యగా మారింది. ప్రతి నెలా పీరియడ్స్ సమయంలో బ్యాగ్, పర్స్ లేదా కవర్ తీసుకుని వారు వాష్ రూమ్‌కి వెళ్లాల్సిన సందర్భాలు ఉంటాయి. ఇలాంటి వాటి నుంచి వారికి కొంచెమైనా విముక్తి కల్పించడానికి గుజరాత్‌లో ఓ చిన్న కంపెనీ మహిళలకు 12 పీరియడ్ సెలవులను ప్రకటించింది. గతంలో ఫుడ్ డెలివరీ యాప్ ఇలాంటి సెలవులు తీసుకురాగా, ఇప్పుడు సూరత్‌కు చెందిన iVIPANAN ఆ దిశగా అడుగులు వేసింది. ఈ కంపెనీ వ్యవస్థాపకుడు భౌతిక్ సేత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఇది చిన్న కంపెనీనే. ఇదో ఆన్ లైన్ మార్కెటింగ్ సంస్థ. ఈ సంస్థలో కేవలం 9 మంది మాత్రమే ఉద్యోగాలు ఉన్నరు. వారిలో 8 మంది మహిళలే ఉన్నారు. 2014లో ఈ సంస్థను స్థాపించిన భౌతిక్ సేథ్ తన కంపెనీలో పనిచేసే మహిళా ఉద్యోగుల సమస్య గురించి తెలుసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని చెప్పారు. కంపెనీ ప్రకారం ఇచ్చే సెలవులకు అదనంగా ఈ 12 సెలవులు ఉంటాయన్నారు.
    Published by: Ashok Kumar Bonepalli
    First published: August 14, 2020, 10:09 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading