#Valentine'sDay2019: వాలెంటైన్స్ వీక్‌.. ఈ వారంలో ఏ రోజు ఏ ప్రత్యేకమో తెలుసా..

ప్రేమికుల రోజంటే యూత్‌కి యమా క్రేజ్. అయితే, కేవలం ఫిబ్రవరి 14న ఒక్కరోజే కాదు.. ఆ రోజుకి ముందు వారం నుంచే అంటే 7వ తేదీ నుంచి ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది అవేంటంటే..

Amala Ravula | news18-telugu
Updated: February 7, 2019, 8:45 PM IST
#Valentine'sDay2019: వాలెంటైన్స్ వీక్‌.. ఈ వారంలో ఏ రోజు ఏ ప్రత్యేకమో తెలుసా..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: February 7, 2019, 8:45 PM IST
ఫిబ్రవరి 7.. రోజ్ డే గా పిలిచే ఈ రోజున తమ మనసు దోచినవారికి గులాబీలు ఇస్తారు. ఇందులోనూ లాజిక్ ఉంది.. రెడ్ రోజ్ ఇస్తే లవ్‌, రోమాన్స్‌కి సింబాలిక్‌గా, ఎల్లో రోజ్ ఇస్తే ఫ్రెండ్షిప్ అని అంటారు.
ఫిబ్రవరి 8: ప్రపోజ్ డేగా పిలిచే ఈ రోజున ఇష్టమైనవారికి ప్రపోజ్ చేస్తారు. ఎదుటివారి నుంచి ఎలాంటి న్యూస్ వచ్చినా.. ప్రపోజ్ చేయాలనుకుంటారు.
ఫిబ్రవరి 9: చాక్లెట్ డేగా పిలిచే ఈ రోజున ఇష్టమైన వారికి చాక్లెట్స్ ఇస్తారు. ప్రేమ ఎంతో మధురంగా ఉంటుందో తామిచ్చే చాక్లెట్స్ ద్వారా తెలియజేయాలనుకుంటారు.

ఫిబ్రవరి 10: టెడ్డీ డే గా పిలిచే ఈ రోజున ఇష్టపడేవారికి టెడ్డీ బేర్స్ ఇస్తారు తమ గుర్తుగా..
ఫిబ్రవరి 11: ప్రామిస్ డే.. పెళ్లి ప్రమాణాలు ఉన్నట్లుగానే ఈ రోజున ప్రేమప్రమాణాలు ఉంటాయి. కష్టమైనా.. సుఖమైనా ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ ముందుకు సాగుతారు.
ఫిబ్రవరి 12: హగ్ డే.. కొన్ని సందర్భాల్లో మనం చెప్పలేని ఎన్నో భావాలను ఒక్క కౌగిలింత ద్వారా చెప్పొచ్చు. అంతటి మహత్తు ఈ కౌగిలింతలకి ఉంటుంది. అందుకే.. ఈ రోజున తమ ఫీలింగ్స్‌ని హగ్ ఇస్తూ తెలియజేస్తారు.


ఫిబ్రవరి 13: కిస్ డే.. ముద్దు.. ఎంతోమంది కవులు దీనిపై ఎన్నో కవిత్వాలు కూడా రాశారు. ప్రేమకి గుర్తుగా.. జంటలు ముద్దులోని తియ్యదనాన్ని ఆస్వాదిస్తారు.
Loading...
ఫిబ్రవరి 14: వాలెంటైన్స్ డే: ఈ వారంలో చేసిన ప్రేమ తాలుకూ ప్రతిఫలమే వాలెంటైన్స్ డే .. సో.. ప్రతీ రోజుని ఆస్వాదించండి.. ప్రేమించండి..
First published: February 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...