హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

WomensDay 2020 | ఎన్నిసార్లు కుళ్లబొడిస్తే అంత పెద్ద అవార్డు: సునీతా కృష్ణన్

WomensDay 2020 | ఎన్నిసార్లు కుళ్లబొడిస్తే అంత పెద్ద అవార్డు: సునీతా కృష్ణన్

సునీతా కృష్ణన్ (File)

సునీతా కృష్ణన్ (File)

International Womens Day | ‘మ‌హిళ అనేది పురుషుడికి ఆనందానిచ్చే వ‌స్తువు కాదు. పురుషుడుతో స‌మానంగా స్త్రీని గుర్తించే స‌మాజం రావాలి.’ అనేదే సునీతా కృష్ణన్ నినాదం.

  ఆమె ధైర్యం ఏ మ‌హిళ‌కు లేనంత ఎక్కువ‌. మ‌హిళ‌లు భ‌య‌ప‌డే ఛాలెంజ్ ను ఆమె స్వ‌ీక‌రించారు. ఆ ఛాలెంజ్ ఈ రోజు ఎంద‌రో అభాగ్య మ‌హిళ‌ల‌కు బాస‌టగా నిలుస్తోంది. ఆమెది పైకి క‌నిపిస్తోన్నంత పూల బాట కాదు. అడుగ‌డుగునా గాయాల‌బాటే. నిత్యం ప్ర‌మాదాల‌తో స‌య్యాటే. త‌న ప‌దిహేనో ఏట‌నే అత్యంత దారుణంగా అత్యాచారానికి గురైన ఆమె సునీతా కృష్ణన్ ప్ర‌జ్వ‌ల అనే సంస్థ ఏర్పాటు చేసి చీక‌టి కూపంలో కుమిలిపోతున్న ఎంద‌రో మ‌హిళ‌లకు బాస‌టగా నిలుస్తోన్నారామె. ఈ ప్ర‌యాణంలో చీక‌టి మాఫియాల నుంచి ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నారు. అయినా మ‌నోధైర్యం చెక్కు చెద‌ర‌డం లేదు. చిన్న‌ప్ప‌టి నుంచే స‌మాజం ప‌ట్ల త‌న‌కుంటూ ఒక బాధ్య‌త ఉంద‌ని న‌మ్మారు సునీతా కృష్ణన్. అదే బాధ్య‌తతోనే మ‌హిళ‌లు, బాలిక‌ల అక్ర‌మ ర‌వాణా, లైంగిక దోపిడుల‌పై ఒక సుదీర్ఘ ఉద్య‌మం చేస్తోన్నారు. స్వ‌స్థ‌లం కేర‌ళ అయిన‌ప్ప‌టికి బెంగ‌ళూరులో పుట్టి పెరిగారు. త‌రువాత హైద‌రాబాద్ వ‌చ్చిన ఆమె ఇక్క‌డ ప్ర‌జ్వ‌ల పేరుతో ఒక స్వ‌చ్ఛంధ సంస్థ‌ను ఏర్పాటుచేసి మ‌హిళ‌ల అక్ర‌మ ర‌వాణాపై ఉద్య‌మాన్ని చేస్తున్నారు.

  సునీతా కృష్ణన్

  ఈ చీక‌టి కూపంలో అన్యాయంగా, అక్ర‌మంగా జీవితాలు కోల్పోతున్న‌వారికి సునీత కృష్ణ‌న్ బాస‌టగా నిలుస్తున్నారు. ఆ బాధితులు, వారి పిల్ల‌ల కోసం న‌డుపుతున్న సంస్థ ప్ర‌జ్వ‌ల. వివిధ ప్రాంతాల్లో అనుకోని ప‌రిస్థితుల దృష్ట్యా వ్య‌భిచార కూపంలో ఇరుక్కొన్న వారిని రక్షించి త‌న స్వ‌చ్ఛంద సంస్థ‌కు తీసుకొచ్చి ఆశ్ర‌యం క‌ల్పించి వారి పిల్ల‌ల‌కు చ‌దువు బాధ్య‌త‌ను కూడా చూసుకుంటారామె. ఈ ప్ర‌యాణంలో ప్రాణాల‌ను సైతం ప‌ణంగా పెట్టి పోరాడిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి. ఈ ప్రయాణంలో దాదాపు 20 సార్లు తీవ్ర‌మైన దాడుల‌కు గురయ్యారు. చుట్టూ ఉన్న మ‌నుషులు, స‌మాజం, కుంటుంబ సభ్యులు ఎన్నో సార్లు ఈ దారి వ‌ద్ద‌ని వారించిన ఆమె తను న‌మ్మిన సిద్దాంతాన్నే న‌మ్మారు. ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 10 వేల మంది పిల్ల‌లు, యువ‌తులను ర‌క్షించి త‌న స్వ‌చ్ఛంద సంస్థ‌కు తీసుకొచ్చి కొత్త ప్ర‌పంచాన్ని సృష్టించారు.

  సునీతా కృష్ణన్

  “ఈ ప్ర‌యాణంలో నేనెప్పుడు భ‌య‌ప‌డ‌లేదు. కొన ఊపిరితో బ్ర‌తికిన సంద‌ర్భాలు చాలా ఉన్నాయి. అవ‌న్నీ ల‌క్ష్య‌ాన్ని దెబ్బ‌తీయ‌లేవు. ఒక మ‌హిళ ఇంత‌టి సాహ‌సం చేయొచ్చంటే నేను మ‌హిళగా బావించా. నేను ఒక మ‌నిషినే అని న‌మ్మ‌తా. మ‌హిళ‌, పురుష భేదాలు ఉండ‌ని సమాజాన్ని నేను చూడాలి. ఇప్పటి వ‌ర‌కు నాకు ఎన్ని అవార్డులు వ‌చ్చ‌ాయ‌నేది నేను చూడను. ఎన్ని సార్లు నా శ‌రీరాన్ని కుళ్ల‌ బొడిచారు అనేది నాకు ముఖ్యం. అదే నాకు పెద్ద అవార్డు. ఎన్ని సార్లు దాడులు జ‌రిగితే అంత‌లా నాలో సంక‌ల్పం పెరుగుతుంది.” అన్నారు సునీతా కృష్ణన్.

  సునీతా కృష్ణన్

  “త‌ర‌త‌రాలుగా స్త్రీ ని ఒక వినోద‌పు వ‌స్తువుగానే చూస్తోన్నారు. మ‌హిళ అనేది పురుషుడికి ఆనందానిచ్చే వ‌స్తువు కాదు. పురుషుడుతో స‌మానంగా స్త్రీని గుర్తించే స‌మాజం రావాలి.’ అనేదే ఆమె నినాదం. అందులో భాగంగా ఆమె తీసిన బంగారుత‌ల్లి సినిమా, మ‌హిళ ప‌ట్ల మ‌న బాధ్య‌త‌ల‌ను ఘాటుగా గుర్తు చేస్తుంది. చీక‌టి కూప‌ంలో మ‌గ్గిపోతున్న మ‌హిళ‌లు చిన్న‌త‌నంలోనే హెచ్ ఐవీతో బాధ‌పడుతున్న పిల్ల‌లు, మ‌హిళ‌ల అక్ర‌మ ర‌వాణాలో జీవితాలు కోల్పొయిన పిల్ల‌లే సునీతా కృష్ణ‌న్ ప్ర‌పంచం. ఒక మ‌హిళ‌గా త‌ను స్త్రీ ప్రపంచానికి చేస్తోన్న సేవల‌కు ఎన్నో అవార్డుల రివార్డులు కూడా వ‌రించాయి.

  (ఎం. బాలకృష్ణ, సీనియర్ కరస్పాండెంట్, న్యూస్‌18)

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Womens Day 2020

  ఉత్తమ కథలు