సూర్యుని కిరణాల్లో (Sun Rays) ఎంతో శక్తి దాగుంది. అవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. జీవసంబంధమైన పనితీరును మెరుగ్గా ఉంచడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. తాగే నీటిని సూర్యకాంతిలో గంటల తరబడి ఉంచి.. ఆ తర్వాత తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇలా చేయడం వల్ల సూర్యరశ్మి ద్వారా నీళ్లు చార్జ్ అవుతాయి. అనేక విద్యుత్ ఆవశ్యకాలు అందులోకి వస్తాయి. ఈ నీటినే సన్ చార్జ్డ్ (Sun Charged Water)వాటర్ అని అంటారు. సన్ ఛార్జ్డ్ వాటర్ ఉపయోగించడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. సన్ ఛార్జ్డ్ నీటిని నేరుగా తాగవచ్చు. కళ్లు కడుక్కోవడానికి, పుక్కిలించడానికి, గాయాలను శుభ్రం చేసేందుకు, మసాజ్ చేసేందుకు కూడా ఉపయోగించవచ్చు.
వెల్లుల్లి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?
సన్ చార్జ్డ్ వాటర్‌ని ఎలా తయారు చేయాలి?
సన్ ఛార్జ్డ్ వాటర్‌ని తయారు చేయడానికి కుళాయి నీళ్లు లేదా బోరు నీళ్లను తీసుకొని గాజు పాత్రలో పోయాలి. RO నీటిని ఉపయోగించకూడదు. ఎందుకంటే RO నీటిలో మినరల్స్ ఉండవు. అంతేకాదు అది ధనాత్మకంగా ఛార్జ్ అవుతుంది. ఈ కారణంగా సన్ చార్జ్డ్ నీటి కోసం ఆర్వో నీటిని వాడకూడదు. బోరు నీటిని గాజు పాత్రలో పోసి సూర్యుడి కిరణాలు పడేలా ఉంచాలి. పైన మూత పెట్టకుంటే దుమ్ముదూళి పడే అవకాశముంది. అందుకే పైభాగాన్ని వస్త్రం లేదా మూతతో కప్పి ఉంచాలి. ఈ గాజు పాత్రను పగలంతా ఎండలో ఉంచాలి. అందులోనూ నేలపైనే ఉంచాలని గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు పై అంతస్తుల్లో ఉన్నట్లయితే.. సిమెంట్, ఇసుక, రాయిపైనా పెట్టుకోవచ్చు. దాదాపు ఆరు గంటల పాటు ఎండలో ఉంచితే అప్పుడది సన్ చార్జ్డ్ వాటర్ అవుతుంది. ఐదారు గంటల తర్వాత దానిని తాగేందుకు ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ ఆ నీటిని నిల్వ చేస్తే.. 24 గంటల తర్వాత మళ్లీ 5 నుంచి 6 గంటల పాటు ఎండలో ఉంచాలి. ఆ తర్వాత మళ్లీ తాగేందుకు ఉపయోగించాలి.
Health: అమ్మాయిల్లో అబ్బాయిలు లక్షణాలు కనిపిస్తున్నాయా..? కారణం ఇదే!
సన్ చార్జ్డ్ వాటర్‌తో ప్రయోజనాలు:
సూర్యకాంతిలో చార్జ్ అయిన వాటర్‌లో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఈ నీళ్లు చర్మం, కళ్ళకు చాలా మంచిది. సన్ చార్జ్డ్ వాటర్‌తో కళ్ళు, చర్మాన్ని కడగితే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
సన్ ఛార్జ్డ్ వాటర్ తాగితే జీర్ణవ్యవస్థను బలోపేతం అవుతుంది. ఈ నీటిని నిత్యం తాగితే ఎసిడిటీ, పొట్టలో పుండ్లు, పొట్టలోని నులిపురుగులు వంటి అనేక ఉదర సంబంధ సమస్యలు దూరమవుతాయి.
చర్మ అలెర్జీలు, దద్దుర్లను నయం చేయడానికి కూడా సన్ చార్జ్డ్ వాటర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
శరీరంలోని సెల్యులార్ లెవెల్ డ్యామేజ్‌ని తొలగించడానికి సన్ చార్జ్డ్ వాటర్ బాగా పనికొస్తుంది.
కొందరు పిల్లలు బెడ్‌పై మూత్ర విసర్జన చేస్తుంటారు. సన్ ఛార్జ్డ్ వాటర్ వాడకం వల్ల ఈ సమస్య తగ్గుతుంది.
(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. వీటిని అమలుచేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health Tips, Life Style