సమ్మర్‌లో ఆ పని తగ్గిస్తే మేలు... పడకగదిపై వేసవి ఎఫెక్ట్... శృంగార సమయంలో మంట వస్తే...

బెడ్‌రూమ్‌పై సమ్మర్ హీట్ ప్రభావం... వారానికి రెండు సార్లు మాత్రమే సెక్స్ చాలా బెటర్ ఆప్షన్... అంతకు మించితే అసలుకే మోసం...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 30, 2019, 11:02 PM IST
సమ్మర్‌లో ఆ పని తగ్గిస్తే మేలు... పడకగదిపై వేసవి ఎఫెక్ట్... శృంగార సమయంలో మంట వస్తే...
బెడ్‌రూమ్‌పై సమ్మర్ హీట్ ప్రభావం... వారానికి రెండు సార్లు మాత్రమే సెక్స్ చాలా బెటర్ ఆప్షన్... అంతకు మించితే అసలుకే మోసం...
  • Share this:
సమ్మర్ వచ్చిందంటే ఉక్కపోత మొదలవుతుంది. కరెంట్ పోయినా, కొద్దిసేపు ఎండకి వెళ్లినా ఎండవేడిమి తట్టుకోలేక విలవిలలాడిపోతాం. ఆ ప్రభావం పడకగదిపై ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రతల కారణంగా బాడీలో ఉండే నీటి శాతం చాలా తగ్గిపోతుంది. ఈ కారణంగా మగాళ్ల ఆ సామర్థ్యంపై పడుతుంది. ముఖ్యంగా మిగిలిన కాలాలతో పోలిస్తే వేసవి సమయంలో పురుషులు త్వరగా అలసిపోతారు. అది కూడా పనుల నిమిత్తం ఎండలో ఎక్కువగా తిరిగివారు బెడ్‌రూమ్‌లో బలహీనులుగా మారిపోతారని హెచ్చరిస్తున్నారు వైద్యులు. వీరితో పోలిస్తే నీడలో ఎక్కువ సేపు ఉండేవాళ్లు, ఏసీ గదుల్లో పనిచేసేవారు బాగా పని కానిస్తారట. అందుకే ఈ కాలంలో సాధ్యమైనంత తక్కువగా శృంగారంలో పాల్గొనాలని చెబుతున్నారు వైద్యులు.

వారానికి రెండు సార్లు పడకగదిలో పాల్గొనడం చాలా శ్రేయస్కరమని చెబుతున్నారు. అంతకు మించి ముందుకు వెళితే... అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అదీ కాకుండా సమ్మర్ హీట్ కారణంగా శృంగార సమయంలో నొప్పి ఉండడం సహజమేనని చెబుతున్నారు. ఇంటిపట్టున ఉండే ఆడవారిపై ఈ ప్రభావం అంతగా ఉండకపోవచ్చు. కానీ ఉద్యోగ నిమిత్తం ఆఫీసులకు వెళ్లే ఆడవారిపై కూడా ఈ ప్రభావం భారీగానే ఉంటుంది. ఇలాంటి సమస్యల నుంచి తగ్గించుకోవాలంటే ఎక్కువగా నీరు తాగడం, నీరు ఎక్కువగా పండ్లు, కూరగాయలు డైట్‌లో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ సమయంలో టైట్ జీన్స్, టీషర్ట్స్ వేసుకోవడం మానేయాలి. రాత్రి సమయాల్లో అయితే సాధ్యమైనంత లూజుగా ఉండే దుస్తులు మాత్రమే ధరించాలి. పడక గది వాతావరణం చాలా చల్లగా ఉండేలా చూసుకోవాలి. గదికి వెళ్లగానే గాబరాగా పనిలో దిగకుండా... చల్లని వాతావరణాన్ని శరీరం అలవాటు పడిన తర్వాతే శృంగారం మొదలుపెట్టాలి. అసలు కంటే కొసరి కొసరి తింటేనే ఫలితాలు, ఎంజాయ్‌మెంట్ ఎక్కువగా దొరుకుతుందని సూచిస్తున్నారు వైద్యనిపుణులు.
First published: April 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>