Health Tips : ఒంట్లో వేడిని తగ్గించే మజ్జిగ.. ఇలా చేయండి..

ప్రతీకాత్మక చిత్రం

ఎండలు ఎక్కువయ్యాయి. ఈ సమయంలో బయటికి వెళ్ళినప్పుడు త్వరగా అలసిపోయినట్లుగా ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే కొన్ని ప్రత్యేక లిక్విడ్స్ తీసుకోవాలి. అందులో ఇప్పుడు చెప్పే మజ్జిగ అగ్రస్థానంలో ఉంటుంది. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

  • Share this:

మజ్జిగ ఆరోగ్యానికి ఎప్పుడూ కూడా మంచిదే. ముఖ్యంగా ఈ ఎండల్లో ఎంత తాగితే అంత మంచిది. అయితే, ఈ మజ్జిగను మరింత ఆరోగ్యంగా చేయాలంటే దానికి మిల్లేట్స్‌ని చేర్చాల్సిందే. మిల్లేట్స్‌ని పిండిపట్టించాలి. లేకపోతే అందులో మీకు ఏది ఇష్టమో ఆ పిండిని మాత్రమే తీసుకోండి. సజ్జ, రాగి ఇలా ఏదైనా సరే తీసుకుని వాటితో ఈ మజ్జిగను తయారు చేయొచ్చు. ముందుగా ఓ గిన్నెల పిండిని వేయించాలి. తర్వాత అందులో ఓ గ్లాసు నీరు పోసి మరిగించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి బాగా కలిపిన మజ్జిగను అందులో కలపాలి. ఇప్పుడు ఎవరి టేస్టుకి అందులో ఉప్పు, కొత్తిమీర, అల్లం ముక్కలు వంటివి యాడ్ చేసుకోవచ్చు.
ఈ డ్రింక్‌ని తాగితే ఎండల్లో కోల్పోయిన శక్తిని తిరిగి పొందినవారవుతాం. కాబట్టి.. ఈ ఎండాకాలంలో రోజూ.. కనీసం బయటికివెళ్లినప్పుడైనా దీన్ని తాగుతుండడం వల్ల మంచి ఫలితాలుంటాయి.

First published: