Summer Tips : సమ్మర్‌ డీహైడ్రేషన్ నుంచి తప్పించే డ్రింక్..

ప్రతీకాత్మక చిత్రం

సమ్మర్‌లో త్వరగా అలసిపోతారు. ఇలాంటి సమయంలో ఎక్కువ కేర్ తీసుకోవాలి. లేకపోతే కళ్లు తిరగడం, వడదెబ్బ తగలడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటప్పుడు ఇప్పుడు చెప్పే నీటిని తీసుకోండి. ఫలితముంటుంది.

  • Share this:
ఎండలు పెరిగిపోయాయి. బయటికి వెళ్లాలంటేనే భయంగా ఉంటుంది. అలా అని ఇంట్లోనే ఉండలేం. కాబట్టి.. బయటికి వెళ్లే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. దీనివల్ల సమస్య ఎదురుకాదు. ముందుగా వాటర్ తీసుకోండి. ఇందులో కీరా ముక్కలని సన్నగా తరిమి వేయండి. ఇందులోనే పుదీనా ఆకులు వేయండి. కాస్తా ఉప్పు వేసుకోండి. రుచికోసం నిమ్మరసం కలుపుకోవచ్చు. ఈ నీటిని తాగి వెళ్లడం కానీ, బయటికి వెళ్లినప్పుడు తాగడం చేస్తుండండి. కీరా ముక్కలు తాగుతున్నప్పుడే తీసుకోండి. దీనివల్ల శరరంలో నీటిశాతం తగ్గకుండా ఉంటుంది. డీహైడ్రేషన్ కాకుండా ఉంటారు.

ఈ ఎండాకాలం మొత్తం ఈ డ్రింక్‌ని తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ రాకుండా ఉంటుంది. వీటిని తాగడం వల్ల కేవలం దాహార్తి తీరడమే కాకుండా పొట్టనిండిన భావన ఉంటుంది. బరువు కూడా తగ్గుతారని చెబుతున్నారు నిపుణులు. శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపించడంలో ఈ నీరు చాలా బాగా పనిచేస్తుంది.

మామూలుగానే ఎండాకాలం మొత్తం ఎంత నీరుతాగితే అంత లాభం.. ఈ సీజన్‌లో ఈ నీటిని తాగడం వల్ల ఉపయోగముంటుంది.

ఇవి కూడా చదవండి..

Beauty Tips : ఇలా చేస్తే మోకాలి, మోచేతులపై ఉండే నలుపుదనం పోతుంది..
First published: