Home /News /life-style /

SUMMER SANDAL FACE PACK FOR ITCHING AND BURNING PROBLEMS RNK

Beauty tips: ఈ వేసవిలో చల్లదనానిచ్చే చందనం ఫేస్ ప్యాక్.. రోజూ దీన్ని వేసుకుంటే ముఖం మెరిసిపోతుంది..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Sandal facepack: గంధపు దిమ్మెలు, గంధపు నూనెలో ఔషధ విలువలు ఉన్నాయి. ముఖ్యంగా అన్ని రకాల చర్మ సమస్యలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఇక్కడ మనం చందనంతో చేసిన ఫేస్ ప్యాక్స్ దాని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

స్కిన్ ఇన్ఫ్లమేషన్ (Skin inflammation) , ఇరిటేషన్ను సరిచేయడంలో చందనం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా చర్మంపై మంట (Skin burn) ప్రభావాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. గంధం సహజంగా బలమైన వాసన కలిగి ఉంటుంది. ఇది సువాసన మాత్రమే కాదు, దాని కూర్పు కూడా అద్భుతమైనది. ఇది చాలా సౌందర్య సాధనాల ఉత్పత్తులలో విస్తృతంగా ఉపయోగిస్తారు. బెరడు రంగును బట్టి చందనాన్ని ఎరుపు, పసుపు, తెలుపు అని మూడు రకాలుగా విభజించారు.

DIY చందనం ఫేస్ ప్యాక్స్:
జిడ్డు చర్మం కోసం: రోజ్ వాటర్ ,గంధపు మిశ్రమంతో మీరు ఒక నిమిషంలో తయారు చేయగల సులభమైన ఫేస్ ప్యాక్. ఒక గిన్నెలో గంధపు పొడితో కొద్దిగా రోజ్ వాటర్ కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకుని ముఖానికి పట్టించాలి. ఈ ప్యాక్ జిడ్డు చర్మానికి మంచిది.

డ్రై స్కిన్ కోసం: పొడి చర్మం ఉన్నవారు ఆరెంజ్ జ్యూస్‌లో పాలు లేదా ఆలివ్ ఆయిల్, గంధపు పొడి కలిపి ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవచ్చు.

ఇది కూడా చదవండి: కరకరలాడే రైస్ వడియాలు.. ఈజీగా చేసుకునే విధానం..


మొటిమలు తగ్గాలంటే: చర్మంపై వచ్చే మొటిమలు తగ్గాలంటే కొద్దిగా గంధపు పొడిని తీసుకుని అందులో పసుపు, నిమ్మరసం కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. ఇది చర్మాన్ని చల్లబరచడమే కాకుండా చర్మంలో మొటిమలకు కారణమయ్యే అదనపు బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది.

కాంతివంతమైన చర్మం కోసం: కొద్దిగా పెరుగు, పాలు, గంధపు పొడి కలిపి రాసుకుంటే పాలిపోయిన ముఖం కాంతివంతంగా మారుతుంది. ఈ మిశ్రమాన్ని మీ ముఖం ,మెడ ప్రాంతంలో అప్లై చేసి, 10 నిమిషాలు మసాజ్ చేసి, చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. పెరుగు ఒక అద్భుతమైన క్లెన్సర్. కాబట్టి పెరుగులో గంధపు పొడిని మిక్స్ చేసి ముఖానికి మాస్క్ వేసుకుంటే చర్మం మృదువుగా, తెల్లగా మారుతుంది.

యుత్ ఫుల్ స్కిన్ పొందడానికి: మీ చర్మం నిర్జీవంగా కనిపిస్తే, గుడ్డులోని తెల్లసొన, పెరుగు ,కొద్దిగా యాపిల్ జ్యూస్, గంధపు పొడిని మిక్స్ చేసి, మీ చర్మానికి అప్లై చేసి, ఆరిన తర్వాత కడిగేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే యవ్వన చర్మాన్ని పొందవచ్చు.


ఇది కూడా చదవండి: మధుమేహంతో బాధపడే మహిళలు.. 5 ఫుడ్స్ తప్పకుండా తీసుకోవాలి..


గంధపు పొడిలో టమోటాలు గ్రైండ్ చేసి, కావాలనుకుంటే కొద్దిగా ముల్తానీ మట్టే వేసి ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి.

గంధపు పొడిని ముల్తానీ మట్టే పొడిని కలిపి ఫేస్ ప్యాక్‌పై కూడా వేసుకోవచ్చు. 1/2 టీస్పూన్ ముల్తానీ మట్టీ, 1/2 టీస్పూన్ గంధపు పొడి వేసి, పెరుగు పోసి మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేసి 15 నిమిషాలు నానబెట్టి, చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి తద్వారా చర్మం కాంతివంతంగా ఉంటుంది.చందనం ప్రయోజనాలు:
* వేడిని తగ్గించేందుకు చందనం సహకరిస్తుంది. గంధపు చెక్కలో లభించే సహజ నూనెలు చర్మంపై సూర్యరశ్మి హానికరమైన కిరణాల ప్రభావాలను ఎదుర్కోవటానికి సహాయపడతాయి. అలాగే చర్మాన్ని చల్లబరుస్తుంది. వేసవిలో మీ చర్మాన్ని వేడెక్కకుండా కాపాడుతుంది. అదే సమయంలో సన్ టాన్ తగ్గించడంలో సహాయపడుతుంది.

* స్కిన్ ఇన్ఫ్లమేషన్, ఇరిటేషన్ ను సరిచేయడంలో గంధం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది మంటను తగ్గించడంలో సహాయపడుతుంది, కీటకాల కాటు వల్ల కలిగే ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి కూడా సహాయపడుతుంది.

* గంధం ఓపెన్ ఫోర్స్ అని పిలువబడే చర్మ రంధ్రాలను బిగుతుగా చేసి, మూసుకుపోయిన రంధ్రాలలోని దుమ్ము ,ధూళిని తొలగించి చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడానికి ఆస్ట్రింజెంట్‌గా పనిచేస్తుంది.

* చందనం క్రిమినాశక మందు. యాంటిసెప్టిక్స్ కూడా ఉన్నాయి, అందుకే ఇది చర్మం నుండి క్రిములను తొలగిస్తుంది. ఇది వైరస్లు ,బ్యాక్టీరియా వల్ల కలిగే మొటిమలు ,ఇతర అలెర్జీ సమస్యలను కూడా తొలగించడంలో సహాయపడుతుంది.

* చందనం చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఇవి మీ చర్మానికి మరింత ఆరోగ్యకరమైన మెరుపును అందించడానికి కూడా సహాయపడతాయి. ఇది చర్మ పునరుజ్జీవనాన్ని కూడా ప్రోత్సహిస్తుంది.
Published by:Renuka Godugu
First published:

Tags: Beauty tips, Face mask, Sandalwood, Summer, Tomatoes

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు