• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • SUMMER FOOD FOR DOGS CHICKEN CAULIFLOWER BROWN RICE AND OTHER RECIPES WILL BE GIVEN HERE IS FULL DETAILS AK GH

Summer food for Dogs: వేసవిలో మీ కుక్కలకు ఎలాంటి ఆహారం అందించాలో మీకు తెలుసా?

Summer food for Dogs: వేసవిలో మీ కుక్కలకు ఎలాంటి ఆహారం అందించాలో మీకు తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

Summer Food For Dogs: ఎప్పుడైనా మీ కుక్కలు, ఇతర పెంపుడు జంతువుల గురించి ఆలోచించారా? వాటికి వేసవిలో ఎలాంటి ఆహారాన్ని అందించాలన్న ఆలోచన మీకు వస్తే రోజు వారీ మీల్స్ లో పెద్దగా మార్పులు చేయకుండా ఇంట్లో చేసిన కొన్ని రకాల పదార్థాలను వాటికి పెట్టడం ద్వారా ఎండాకాలంలో వాటి ఆరోగ్యం పాడవ్వకుండా కాపాడుకోవచ్చు.

  • Share this:
వేసవి వచ్చేసింది. సీజన్ ప్రకారం మనం మన ఆహార పద్ధతుల్లో మార్పులు చేర్పులు చేసుకుంటుంటాం. ఎండాకాలం రాగానే ఫ్రై కూరలు తగ్గించి పులుసులు ఎక్కువగా చేసుకోవడం, కొన్ని రకాల కూరగాయలు ఎక్కువగా వాడడం, మామిడి కాయలు ఎక్కువగా ఉపయోగించడం వంటివి చేస్తుంటాం. వీటితో పాటు పండ్లు ఎక్కువగా తింటూ, నీళ్లు ఎక్కువగా తాగుతూ డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకుంటాం. కానీ ఎప్పుడైనా మీ కుక్కలు, ఇతర పెంపుడు జంతువుల గురించి ఆలోచించారా? వాటికి వేసవిలో ఎలాంటి ఆహారాన్ని అందించాలన్న ఆలోచన మీకు వస్తే రోజు వారీ మీల్స్ లో పెద్దగా మార్పులు చేయకుండా ఇంట్లో చేసిన కొన్ని రకాల పదార్థాలను వాటికి పెట్టడం ద్వారా ఎండాకాలంలో వాటి ఆరోగ్యం పాడవ్వకుండా కాపాడుకోవచ్చు.

సాధారణంగా మనకంటే కుక్కలు, కొన్ని ఇతర జంతువుల్లో శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. అందుకే వేసవి నెలల్లో అవి మరీ వేడిగా ఫీలవ్వకుండా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. శరీర ఉష్ణోగ్రత పెరిగితే వాటి వెంట్రుకలు ప్యాచెస్ గా ఊడిపోవడం జరుగుతుంది. డీహైడ్రేషన్ కి గురవుతాయి తద్వారా వాటికి ఊపిరి పీల్చుకోవడం కూడా ఇబ్బంది కావచ్చు. ఇలా కాకుండా ఉండేందుకు ఎండాకాలంలో మటన్, బీఫ్, గుడ్లలోని పచ్చ సొన వంటివన్నీ దూరంగా ఉంచాలి. మామిడి పండ్లు, తర్బూజా వంటివి కూడా దూరంగా ఉంచాలి. వీటికి బదులుగా చికెన్, ఎగ్ వైట్స్, పెరుగు, కీర దోస, కాలిఫ్లవర్, బ్రౌన్ రైస్ వంటివి ఎక్కువగా అందించాలి.

దీని గురించి మరింత వివరిస్తూ హార్లేస్ కార్నర్ ఫౌండర్ ఇష్మీత్ సింగ్ చందియోక్ వేసవిలో ఇంట్లోనే చేసుకొని కుక్కలకు అందించగలిగే కొన్ని రెసిపీల గురించి వివరించారు. అందులో కొన్నింటిని మీరూ చూడండి.
ఎముకలు బాగా కడిగి వాటిని పుదీనా వేసి ఎక్కువ నీళ్లలో ఉడికించుకోవాలి. నాలుగైదు విజిల్స్ వచ్చేవరకు అలాగే ఉంచాలి. ఇలా తయారైన ఎముకలను చాలా రకాలుగా సర్వ్ చేయవచ్చు.

1. వేసవిలో చల్లని సూప్ రూపంలో కుక్కలకు అందించండి.
2. ఈ బ్రాత్ ని ఐస్ ట్రేలో పోసి డీప్ ఫ్రిజ్ లో వేసి కుక్క వాక్ కి వెళ్లి వచ్చిన తర్వాత చల్లగా అందించవచ్చు.
లివర్ ని మెత్తగా ఉడికించి గుజ్జుగా చేసుకోవాలి. అందులో పెరుగు వేసి స్మూత్ గా తయారుచేసుకోవాలి. తర్వాత దీన్ని బ్లెండ్ చేసుకొని నాలుగైదు భాగాలుగా చేసుకొని ఫ్రీజర్ లో పెట్టుకోవాలి. ఒక్కోసారి ఒక్కో భాగాన్ని కుక్కకు అందించవచ్చు. ఇందులో కావాలంటే మీరు అరటి పండ్లు, గుజ్జు చేసిన చిలగడ దుంప వంటివి వేసి ఐస్ క్రీంలాగా కుక్కలకు అందించవచ్చు.
First published: