హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

వేసవిలో ఫ్యాన్ కింద ఉంటున్నారా? పెయిన్ కిల్లర్స్ తింటున్నారా ? అయితే జాగ్రత్త

వేసవిలో ఫ్యాన్ కింద ఉంటున్నారా? పెయిన్ కిల్లర్స్ తింటున్నారా ? అయితే జాగ్రత్త

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో జనం ఎండ దెబ్బకు అల్లాడుతున్నారు. బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. అయితే ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నందున జనం ఇప్పుడు అనారోగ్యం బారిన పడుతున్నారు. తిమ్మిర్లు,అలసట, వడదెబ్బలు, వేడి స్ట్రోక్‌లు బారిన పడుతున్నారు. హైదరాబాద్‌లో ఆస్పత్రులకు వేడి సంబంధిత వ్యాధులకు సంబంధించి వస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. దీనిపై డాక్టర్లు కూడా స్పందించారు. అయితే వేసవిలో కొన్ని పనులు చేయడం వలన కూడా పలువురు రోగాల బారిన పడతారని చెబుతున్నారు.

ఎక్కువసేపు ఫ్యాన్‌ కింద కూర్చోవడంతో పాటు పెయిన్‌ కిల్లర్స్‌ తీసుకోవడం వల్ల కూడా సమ్మర్‌లో హీట్ స్టోక్ బారిన పడతారని హెచ్చరిస్తున్నారు. కేర్ హాస్పిటల్స్ జనరల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ జి. నవోదయ మాట్లాడుతూ వేడిగాలి వీస్తున్న ఫ్యాన్ కింద కూర్చోవడం వల్ల కూడా వేడి సంబంధిత అనారోగాలు వస్తాయని చెబుతున్నారు. అటువంటి సందర్భంలో, రోగి తనకు తెలియకుండానే డీహైడ్రేషన్‌కు గురవుతాడని తెలిపారు. దీంతో పాటు పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం కూడా డీహైడ్రేషన్ కు కారణమవుతాయని ఆమె పేర్కొన్నారు.

ఆసుపత్రిలో ఇంకా హీట్ స్ట్రోక్ లేదా వడదెబ్బ కేసులు ఇంకా రిపోర్ట్ కాలేదన్నారు. అయితే రోగులు అధిక వేడి కారణంగా తిమ్మిరి, అలసటకు గురవుతున్నారని మాత్రం గుర్తించామని డాక్టర్ నవోదయ చెప్పారు. మరో హాస్పిటల్ గ్లెనెగల్స్ గ్లోబల్ హాస్పిటల్ క్రిటికల్ కేర్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్,హెచ్‌ఓడి డాక్టర్ మనీంద్ర మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఏప్రిల్, మేలో ఎండలు బాగా పెరుగుతాయి. ఉష్ణోగ్రతలు బాగా పెరిగగడంతో ఈ రెండు నెలల్లో ఆసుపత్రిలో హీట్ స్ట్రోక్స్, కిడ్నీలో రాళ్లు ఎక్కువగా వస్తాయని చెప్పారు. అయినప్పటికీ, అధిక ఉష్ణోగ్రత కంటే, ఎక్స్‌పోజర్ వ్యవధి మరియు పని చేసే రకం పెద్ద కారకాలు అని ఆయన చెప్పారు.

ఆసుపత్రిలో ఇటీవల ఓ డయాబెటిక్ వృద్ధ రోగి చేరారని డాక్టర్ తెలిపారు. 102-103 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉష్ణోగ్రత సెన్సోరియం (మెదడు పనితీరులో సాధారణ మార్పులు) ఆ రోగి ఆస్పత్రికి వచ్చారు. అయితే రోగికి చికిత్స అందిస్తున్న తమలో కాస్త గందరగోళ పరిస్థితి ఏర్పడిందన్నారు. అయితే రోగి అనారోగ్యానికి కారణం తెలుసుకుంటే... వేడి అలసటే కారణమని నిర్ధారించామన్నారు. డయాబెటిక్ రోగులకు వేడి సంబంధిత వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉందని డాక్టర్ మనీంద్ర తెలిపారు. ‘షుగర్ లెవల్స్‌ను సరిగ్గా నియంత్రించకపోతే, వారి రక్తం మందంగా మారుతుంది మరియు నిర్జలీకరణ అవకాశాలను పెంచుతుంది’ఆయన చెప్పారు.

జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్స్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ జె. అనీష్ ఆనంద్ మాట్లాడుతూ, ఆసుపత్రులు ఇప్పుడే హీట్ స్ట్రోక్ కేసులను స్వీకరించడం ప్రారంభించాయని చెప్పారు. పలువురిలో వేడి వల్ల.. చర్మం పొడిబారడం, తలనొప్పి, అలసట, మైకము, ఆస్తమా, సన్ బర్న్స్ వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. ఏప్రిల్ నెల రానే వచ్చింది. ఎండలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అందుకే డాక్టర్లు కూడా వేసవిలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు.

First published:

Tags: Health care, Health problems, Summer, Summer tips

ఉత్తమ కథలు