Home /News /life-style /

SUFFERING FROM SLEEP DEPRIVATION THEN IF YOU DO THIS EVERY DAY U CAN SLEEP COMFORTABLY PRV

Sleep tips: నిద్ర లేమితో బాధపడుతున్నారా? అయితే హాయిగా నిద్రపోవాలంటే రోజూ ఇలా చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నిత్యం బిజీబీజీ. చాలా మంది జీవన విధానం వల్ల తీవ్రమైన ఒత్తిడి (pressure)కి గురి అవుతుంటారు. దీని ప్రభావం వారి ఆరోగ్యంపై (Health) పడుతుంది. నిద్ర కూడా కరువు (Sleeping problems) అవుతుంది. నిద్ర లేకపోవడం (No sleep) వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. ఈ చిట్కాలు పాటిస్తే చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది.

ఇంకా చదవండి ...
    కరోనా (corona) నేపథ్యంలో జీవితాలు తలకిందులయ్యాయి. కష్టాలు వచ్చి నట్టింట్లోనే చేరాయి. వారికి ప్రశాంతత (peace) కరువైంది. మరోవైపు చాలామంది ఉద్యోగాలూ ఊడిపోయాయి. చేతిలో చిల్లి గవ్వలేదు. మిగతా వారు ఆర్థికంగా కుదేలయ్యారు. ఎన్నో మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు.  రోజులో ఒక్కసారి నిద్ర కూడా సరిగా పట్టనివారున్నారు. అయితే వీటన్నింటి కారణంగా సగటు మధ్య తరగతి జీవుడిపై చాలా ఒత్తిళ్లు ఉంటాయి, నిత్యం బిజీబీజీ. చాలా మంది జీవన విధానం వల్ల తీవ్రమైన ఒత్తిడి (pressure)కి గురి అవుతుంటారు. దీని ప్రభావం వారి ఆరోగ్యంపై (Health) పడుతుంది. నిద్ర కూడా కరువు (Sleeping problems) అవుతుంది. నిద్ర లేకపోవడం (No sleep) వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. ఏకాగ్రత లోపించడం వల్ల ఏ పని పూర్తి చేయలేకపోతుంటాం అని చాలా మంది కంప్లెయింట్స్ చేస్తుంటారు. ఈ చిట్కాలు (Tips for Sleep) పాటిస్తే చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది..

    ఏం చేయాలంటే..

    మనిషి ఆరోగ్యకరం (healthy) గా జీవించడానికి, రోజుకు కనీసం 7 నుంచి 9 గంటల నిద్ర (Sleep) అవసరం. అలాగే మనం పడుకున్న తరువాత గాఢ నిద్ర (sleep)లో ఎంతసేపు ఉన్నాం అనేది చూసుకోవాలి. ఇటువంటి గాఢ నిద్ర పట్టాలంటే మన ఆహారంలో కొన్ని పదార్ధాలు (Items) తప్పని సరిగా తీసుకోవాలి. మన అందరికి విరివిగా దొరికే పండ్ల (Fruits)లో అరటి పండ్లు (banana) కూడా ఒకటి. వీటిలో మెగ్నీషియం, పొటాషియం వంటివి మన కండరాలు రిలాక్స్ (Relax) కావడానికి ఉపయోగపడతాయి. అరటిలో ఉండే కార్బోహైడ్రేట్ రక్తంలోని గ్లూకోజ్ తగ్గకుండా చేసి నిద్ర త్వరగా రావడానికి సహాయపడతాయి.

    ప్రతి రోజు ఆహారంలో బాదం పప్పు,  వాల్నట్స్ ఉండేలా చూసుకోండి. డ్రై ఫ్ఫ్రూట్ (Dry fruits) లలో ఉండే మెగ్నీషియం, మాంగనీస్, భాస్వరం, రాగి ఇవన్నీ అధిక కొవ్వును తగ్గిస్థాయి. అలాగే నిద్రకి అవసరమయ్యే మెలటోనిన్ (melatonin) అనే రసాయనం విడుదలకు సహకరిస్తాయి. నిద్రకు ఉపక్రమించే ముందు ఒక గ్లాసు పాలు (Milk) తాగడం ఎంతో మంచిది. పాలల్లో ఉండే అమినో ఆసిడ్లు, ట్రైఫ్టోనీన్ వంటివి శరీరంలో సెరటోనిన్ విడుదల చేస్తాయి. ఇది నిద్రని ఉపక్రమించే ఒక రసాయనం. అందుకే నిద్రపోయే ముందు ఒక గ్లాస్ స్వచ్చమైన పాలు తాగితే నిద్ర (Sleep) త్వరగా వస్తుంది.

    రోగ నిరోధక శక్తిపై ప్రభావం..

    ఈ కాలంలో చాలామంది నిద్ర లేమి సమస్యతో బాధ పడుతున్నారు. కంటికి సరిపడా నిద్ర అనేది లేకపోవడం ఒక పెద్దరోగం. ఎందుకంటే సరైన నిద్ర లేకపోవడం వలన శరీరంలోని అవయవాలు సరిగా పనిచేయవు. ఫలితంగా మన దేహం రోగాలకు (Diseases) నిలయం అవుతుంది. దీని వలన అనేక దీర్ఘకాలిక రోగాలు కలుగుతాయి. మరి రోగాల బారిన పడకుండా ఉండాలంటే మన శరీరంలో పటిష్టమైన రోగనిరోధక వ్యవస్ద ఉండాలి. మంచి ప్రశాంతమైన నిద్ర మన రోగనిరోధక శక్తిని పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Food, Health Tips, Life Style, MILK, Sleep, Sleep tips

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు