హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Dental Problems: దంత సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ సింపుల్ వంటింటి చిట్కాలను పాటించండి..

Dental Problems: దంత సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ సింపుల్ వంటింటి చిట్కాలను పాటించండి..

మీ నోరు శుభ్రంగా ఉండాలంటే దంతాలు పరిశుభ్రంగా (Dental hygiene) ఉండటం అత్యవసరం. లేదంటే పళ్లు పుచ్చిపోవటం, నోరు వాసన రావటం, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవటం వంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి. మీ దంతాలు ఆరోగ్యంగా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క (ప్రతీకాత్మక చిత్రం)

మీ నోరు శుభ్రంగా ఉండాలంటే దంతాలు పరిశుభ్రంగా (Dental hygiene) ఉండటం అత్యవసరం. లేదంటే పళ్లు పుచ్చిపోవటం, నోరు వాసన రావటం, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవటం వంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి. మీ దంతాలు ఆరోగ్యంగా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క (ప్రతీకాత్మక చిత్రం)

Dental Problems: దంత సమస్య( Dental problem) అనేది చాలామందిని వేధిస్తుంటుంది. ఇది కొన్ని సందర్భాల్లో రెండు నుంచి మూడు రోజుల వరకు కూడా ఉంటుంది. ఇలా పంటి నొప్పి ఎక్కువగా ఉన్న సందర్భంలో వైద్యులను(Doctors) సంప్రదించాలి. అప్పటికప్పుడు దంత సమస్య విపరీతంగా బాధిస్తుంటే మాత్రం.. కింద తెలిపిన చిట్కాలను(Tips) వాడితే ఉపశమనం లభిస్తుంది.

ఇంకా చదవండి ...

  మారుతున్న జీవన శైలిలో చాలామంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. రెడీ మేడ్ గా తినడానికి ఏది దొరికితే దానిని లాగించేస్తున్నారు. దీంతో అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. శరీరంలో వివిధ రకాల వ్యాధులకు కారణం.. తినే ఆహారం విషయంలో అశ్రద్ధ వహించడమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే శరీరంలో ముఖ్యమైన భాగాలు దెబ్బతినడమే కాకుండా.. పంటి సమస్యలు( Dental problem) కూడా వేధిస్తుంటాయి. ఎక్కువగా చల్లటి పదర్ధాలు తీసుకున్నప్పడు జివ్వుమని.. పంటి నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఒక్కో సమయంలో దంతాలు పుచ్చి పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అలాంటి సమయంలో వైద్యులను తప్పనిసరిగా సంప్రదించాలి. అయితే వైద్యులు అందుబాటులో లేని సందర్భంలో పంటి నొప్పి ఎక్కువగా రాక ముందే.. చిన్న పాటి చిట్కాలను అనుసరించి ఆ నొప్పిని తగ్గించుకోవచ్చు. దానికి సంబంధించి ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం..

  అందులో మొదటగా పంటి సమస్య ఉన్నవాళ్లు ఉప్పు(Salt) నీటితో మౌత్ వాష్(Mouth Wash) చేసుకుంటే తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది పళ్ల మధ్య ఇరుక్కుపోయిన ఆహార పదర్థాలను బయటకు లాగేస్తుంది. దీంతో పాటు నోటిలో ఏమైనా చిన్నపాటి పుండ్లు ఉన్నా కూడా తగ్గిపోతాయి. ఇలా చేయడానికి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి ఆ నీటిని మౌత్ వాష్‌లా ఉపయోగించవచ్చు. మరో చిట్కాలో .. వెల్లుల్లి(Garlic)ని పేస్ట్ లా చేసి ఏ ప్రదేశంలో పంటి నొప్పి ఉందో అక్కడ పట్టించాలి.

  ఇది చదవండి: ఈ స్కీమ్ వాళ్లకు మంచి పెట్టుబడి మార్గం.. పథకం అర్హత, ప్రయోజనాలు ఇవే..

  ఈ పేస్ట్ కు కొద్దిగా ఉప్పు కూడా వేస్తే.. ఉపశమనం కలుగుతుంది. లేదంటే వెల్లుల్లి రెమ్మను నెమ్మదిగా నమిలినా కూడా సరిపోతుంది. ఈ వెల్లుల్లిలో అనేక రకాల ఔషద గుణాలుంటాయి. ఇది హానికరమైన బాక్టీరియాను చంపడంలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. లవంగాల నూనె(Clove Oil) ద్వారా కూడా పంటి నొప్పిని తగ్గించుకోవచ్చు. అదెలా అంటే.. కాటన్ బాల్ మీద కొద్దిగా లవంగ నూనె తీసుకుని దాన్ని నొప్పి ఉన్న ప్రదేశంలో ఉంచండి. లేదా ఒక చిన్న గ్లాసు నీటిలో కొన్ని చుక్కల లవంగం నూనె వేసి మౌత్ వాష్ లాగా కూడా ఉపయోగించవచ్చు.

  ఇది చదవండి: అక్టోబర్​ నుంచి అమల్లోకి నూతన వేతన కోడ్.. వారానికి 3 రోజుల సెలవు.. పనివేళల్లో భారీ మార్పులు..

  జామ ఆకుల (Guava leaves) గురించి అందరికీ తెలిసిందే. అందులో కూడా ఎన్నో ఔషధ గుణాలుంటాయి. దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వలన పుండ్లు త్వరగా తగ్గుతాయి. వీటి యాంటీ మైక్రోబియల్ యాక్టివిటీ ఓరల్ కేర్ లో కూడా హెల్ప్ చేస్తుంది. ఇలా చేయడానికి తాజా జామాకులు నమలండి లేదా కొన్ని జామాకులని కొద్దిగా దంచి వాటిని మరుగుతున్న నీటిలో వేసి మౌత్ వాష్ చేస్తే పంటి నొప్పి అనేది మాయం అయి పోతుంది. ఒకవేళ పంటి నొప్పి అనేది రెండు రోజుల కంటే ఎక్కువ ఉన్నా.. ఊపిరితీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్నా.. వాపుగా ఉన్నా.. పంటినొప్పితో పాటు జ్వరం ఉన్నప్పుడు.. చిగుళ్లు ఎర్రగా ఉన్నప్పుడు మాత్రం పై చిట్కాలను వాడకూడదు. అలాంటి సమయంలో దంత వైద్యులను(Dentist) సంప్రదించడం అనేది మంచిది.

  ఇది చదవండి: వృద్ధురాళ్లపై లైంగిక దాడి.. నిందితుల్లో ఒకరికి 22 ఏళ్లు.. మరొకరికి 32 ఏళ్లు..

  Published by:Veera Babu
  First published:

  Tags: Health, Health benefits

  ఉత్తమ కథలు