హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Brown Spots: ముఖంపై గోధుమ రంగు మచ్చలతో బాధపడుతున్నారా.. ఈ చిట్కాలను వాడండి..

Brown Spots: ముఖంపై గోధుమ రంగు మచ్చలతో బాధపడుతున్నారా.. ఈ చిట్కాలను వాడండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Brown Spots: ముఖంపై చాలామందికి కొన్ని మచ్చలు ఏర్పడతాయి. వాటినే గోధుమ రంగు మచ్చలు అంటారు. వీటిని వదిలించుకోవడానికి ఎన్ని క్రీములను ఉయోగించినా కొంతమందికి తగ్గవు. ఈ బ్రౌన్ స్పాట్స్ లేదా ప్యాచ్ లు వదిలించుకోవలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..

ఇంకా చదవండి ...

  ఎవరైనా సరే తమకు తాము అందంగా ఉంటూ.. ఇతరులకు కూడా అందంగా కనిపించాలని కోరుకుంటారు. ముఖం అందంగా ఉంటే అందరిలో మనం ప్రత్యేకంగా ఉంటాం. అలాంటిది మన అందాన్ని హరించేలా ముఖంపై గోధుమ రంగు మచ్చలు వస్తే.. అనుభవించే వారి బాధ చెప్పలేం. ముఖంపై గోధుమ రంగు మచ్చలు ఇటీవల మరీ సర్వసాధారణమైపోయాయి. దీనికి చికిత్స చేయడం చాలా క్లిష్టంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ‘ముఖంపై వచ్చే మచ్చల చికిత్సలో ప్రాథమిక దశ కారణం తెలుసుకోవడం. కారణాన్ని గుర్తించకుండా చికిత్స చేయడం ఇబ్బందిగా ఉంటుంది’ అని ఓ వైద్య నిపుణుడు తెలిపారు. ఈ సమస్యను మన ఇంట్లోనే కొన్ని వస్తువులతో పరిష్కరించవచ్చు.

  Remove Lizards From Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..


  సరే, ఇప్పుడు మన ముఖంలో అగ్లీ కనిపించే బ్రౌన్ స్పాట్స్ వదిలించుకోవడానికి సహజ మార్గాలను చూద్దాం. ఆపిల్ సైడర్ వెనిగర్ మొదట నీటితో ఆపిల్ సైడర్ వెనిగర్ కలపాలి. తర్వాత ఒక చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్ ను గోధుమ రంగు మచ్చలపై అప్లై చేయండి. 10-15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. మీరు దీన్ని వారానికి 3-4 సార్లు చేస్తే, గోధుమ రంగు మచ్చలు పూర్తిగా మాయం అయిపోతాయి.

  Weight Loss Tips : త్వరగా బరువు తగ్గాలా.. అయితే ఈ 6 మర్పులు చేయండి..


  పత్తిని పాలల్లో నానబెట్టి, గోధుమ రంగు మచ్చల మీద ఉంచి 15 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత ఆ ప్రాంతాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. మీరు ఇలా వారానికి 2-3 సార్లు ఈ చికిత్స చేస్తే, మంచి మార్పును చూడవచ్చు.

  ఆముదం నూనెలో కొద్దిగా పత్తిని నానబెట్టి లేత గోధుమ రంగు మచ్చలపై మర్ధన చేయండి. 10-15 నిమిషాల తరువాత, ఆ ప్రాంతాన్ని నీటితో శుభ్రం చేసుకోండి. దీనిని కూడా వారానికి రెండు నుంచి మూడు సార్లు చేయాలి.

  మీరు బయటికి వెళ్తున్నారంటే.. ముఖానికి సన్‌స్క్రీన్ రాసుకోవడం తప్పనిసరి. ముఖంపై సూర్యరశ్మి నేరుగా పడకుండా జాగ్రత్త పడాలి. కళ్లకు చలువ అద్దాలు ధరించాలి. బయటికి వెళ్లడానికి 20-30 నిమిషాల ముందు సన్‌స్క్రీన్‌ను అప్లై చేసుకోవాలి. ముఖ్యంగా ఎండకు గురైయ్యే ప్రదేశాలలో ఉంటే ప్రతి రెండు గంటల తర్వాత మళ్లీ అప్లై చేసుకోవాలి.

  Daily Walking Tips: మీరు ఆరోగ్యంగా ఉండాలంటే నడకలో ఇలాంటి మార్పులు చేయండి.. వివరాలు తెలుసుకోండి..


  హైపర్‌ పిగ్మెంటేషన్ వల్ల కలిగే చర్మంలోని ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవటానికి సమయోచితంగా యాంటీ ఆక్సిడెంట్లను వాడాల్సి ఉంటుంది. విటమిన్ సీ, ఈ తోపాటు నియాసినమైడ్ లేదా గ్లూటాతియోన్ ప్రయత్నించడం ఉత్తమం.

  మంచి టమోటాలు పేస్ట్ చేసి, ఆ రసాన్ని బ్రౌన్ స్పాట్ గోధుమ రంగు మచ్చలపై అప్లై చేయాలి. తర్వాత మరియు 20-25 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ ప్రాంతాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఈ చికిత్స రోజూ చేస్తే, చర్మంపై గోధుమ రంగు మచ్చలు పోతాయి.

  చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే లేజర్‌ చికిత్సన ఆప్షన్‌ను ఎంచుకోవాలి. లేజర్ చికిత్స చాలా మొండిగా ఉండే వర్ణద్రవ్యం చికిత్సలో ప్రభావవంతంగా ఉంటుంది. లేజర్ తరంగదైర్ఘ్యాలు నలుపు / గోధుమ రంగు మచ్చల లోతుకు చేరుకోవడం ద్వారా నాశనం చేస్తాయి.

  పురుషుల కంటే మహిళల్లోనే అవి ఎక్కువగా ఉండటానికి గల కారణం ఏమిటి..? తాజా అధ్యయనంలో సంచలన విషయాలు..


  కలబందలో ఔ షధ గుణాలు ఎలాంటి చర్మ సమస్యలనైనా తగ్గించగలవు. బ్రౌన్ రంగులో ఉన్న మచ్చలు కూడా త్వరగా పోతాయి. కలబంద జెల్ ను చర్మానికి అప్లై చేసి 10-15 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

  వివిధ చర్మ సమస్యలకు చికిత్సలో పెరుగు ప్రభావవంతంగా పనిచేస్తుంది. పెరుగును గోధుమ రంగు మచ్చలపై రాసి 10-15 నిమిషాలు నానబెట్టి, తరువాత నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా రెండు మూడు వారాలు ఇలా చేస్తు అవి మాయం అయిపోతాయి.

  నిమ్మకాయ ద్వారా కూడా వాటిని తొలగించవచ్చు. 2 టీస్పూన్ల నిమ్మరసం గోధుమ రంగు మచ్చల మీద 10-15 నిమిషాలు అప్లై చేసి.. తరువాత సాధారణ నీటితో శుభ్రం చేయాలి. ఇలా వారానికి మూడు నుంచి నాలుగు సార్ల చేస్తు ఆ మచ్చలు అస్సలు కనిపించవు.

  Published by:Veera Babu
  First published:

  Tags: Health

  ఉత్తమ కథలు