హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Hungry at Midnight: రాత్రి వేళ ఆకలి సమస్యతో బాధపడుతున్నారా? నిద్ర రావడం లేదా? అయితే ఈ చిట్కాలు పాటించండి

Hungry at Midnight: రాత్రి వేళ ఆకలి సమస్యతో బాధపడుతున్నారా? నిద్ర రావడం లేదా? అయితే ఈ చిట్కాలు పాటించండి

మెగ్నీషియం అధికంగా ఉండే బాదంపప్పును క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోండి. మెలటోనిన్ అనే హార్మోనును ఉత్పత్తి చేయడంలో సాయపడి నిద్రను మీ దరికి చేరుస్తుంది. అంతేకాదు ఇందులో ఉండే ట్రిఫ్టోఫాన్ నిద్రను ప్రేరేపిస్తుంది.

మెగ్నీషియం అధికంగా ఉండే బాదంపప్పును క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోండి. మెలటోనిన్ అనే హార్మోనును ఉత్పత్తి చేయడంలో సాయపడి నిద్రను మీ దరికి చేరుస్తుంది. అంతేకాదు ఇందులో ఉండే ట్రిఫ్టోఫాన్ నిద్రను ప్రేరేపిస్తుంది.

బిజీ లైఫ్​ కారణంగా వేళకు ఎవరూ సరిగా తినడం లేదు. ఒకవేళ తిన్నా కూడా ఏదో అరకోర తినేసి పనిచేస్తున్నారు. పని పట్ల నిబద్దత కావచ్చు.. ఒత్తిడీ కావచ్చు. ఇక వేళకు తినకుండానే నిద్ర (Sleep)కు ఉపక్రమిస్తున్నారు ఇప్పటి జనం. దీంతో అర్ధరాత్రి వేళ ఆకలి (Hungry at Night) సమస్యతో బాధపడుతున్నారు.

ఇంకా చదవండి ...

  బిజీ లైఫ్​ కారణంగా వేళకు ఎవరూ సరిగా తినడం లేదు. ఒకవేళ తిన్నా కూడా ఏదో అరకోర తినేసి పనిచేస్తున్నారు. పని పట్ల నిబద్దత కావచ్చు.. ఒత్తిడీ కావచ్చు. ఇక వేళకు తినకుండానే నిద్ర (Sleep)కు ఉపక్రమిస్తున్నారు ఇప్పటి జనం. దీంతో అర్ధరాత్రి వేళ ఆకలి (Hungry at Night) సమస్యతో బాధపడుతున్నారు. మరోవైపు చాలామంది బరువు (weight)ని కరెక్టుగా ఉంచుకునేందుకు, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు డైటింగ్ అనే పేరుతో కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటూ ఉంటున్నారు.  అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది డైటింగ్ పేరుతో పొట్ట మాడ్చుకోవడం లాంటివి చాలానే చూస్తూ ఉన్నారు.  చాలామంది ఎంత ఆకలి వేసినప్పటికీ  కేవలం కొంత ఆహారాన్ని మాత్రమే తీసుకుంటూ వుంటారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో అయితే మరింత మితం గా ఆహారం (food) తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. దీంతో నిద్ర సమస్యలూ తలెత్తుతున్నాయి. కొన్ని చిట్కాలు (Tips) పాటిస్తే ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు.

  చక్కెర పదార్థాలు వద్దు..

  రాత్రిళ్లు ఏం తినాలి అనేది చాలా మందికి అర్థం కాదు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం (healthy food) రాత్రిళ్లు భుజించాలి. ఉప్పు, చక్కెర(sugar) పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా మీ నిద్రకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. రాత్రిళ్లు మీ కండరాలు, ఇతర టిష్యూలు రిపేర్ చేసుకునే మోడ్‌లోకి జారుకుంటాయి. అలాగే శరీరం(body) కూడా పలు క్రియలను నిద్రలో జరుపుకునేందుకు ఆసక్తి చూపుతుంది. నిద్ర సరిగ్గా పట్టేందుకు ముఖ్యంగా కొన్ని రకాల విటమిన్లు ఆహారంలో పుష్కలంగా ఉండేలా జాగ్రత్తపడాలి. విటమిన్ బి6, ట్రైటోఫాన్, అలాగే కొన్ని ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఆహారంలో ఉండేలా జాగ్రత్త పడాలి.

  తక్కువ క్యాలరీల ఆహారం..

  డైటింగ్ చేస్తూ రాత్రి సమయం (Night time)లో ఆహారం తక్కువగా తీసుకుంటూ అర్ధరాత్రి ఆకలి బాధ తో ఇబ్బందులు పడుతున్న వారు.. త్వరగా జీర్ణం అయిపోయి.. తక్కువ క్యాలరీలు (low calories) ఉండే ఆహారం తీసుకోవడం బెటర్​. ఆ కాలంలో దొరికే పండ్లు తినడం వల్ల కడుపు నిండటంతో పాటు హాయిగా నిద్ర పడుతుంది. అంతేకాకుండా నూనెలో వేయించని  మరమరాలను తినడం (eat) కూడా మంచిది అని అంటున్నారు. అంతేకాకుండా జొన్నలు రాగులు కొర్రలతో చేసిన చిప్స్ తింటే  అటు పోషకాలు అందడంతో పాటు త్వరగా జీర్ణమై పోయి హాయిగా నిద్ర పడుతుంది అంటున్నారు నిపుణులు.

  మితంగా వద్దు..

  అయితే ఇక పగటి సమయంలో ఎలా ఆహారం తీసుకున్నప్పటికీ రాత్రి పడుకునే సమయం (Before sleep)లో మాత్రం చాలా మంది మితంగా ఆహారం తీసుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎంత ఆకలి వేసినప్పటికీ  తక్కువ మొత్తంలో మాత్రమే ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు.  ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు రాత్రి  తీసుకున్న ఆహారం కాస్త సరిపోక అర్ధరాత్రి సమయంలో ఆకలి వేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆకలి తో సరిగ్గా నిద్ర కూడా పట్టదు. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతూ వుంటారు చాలామంది. ఈ టిప్స్​ పాటిస్తే హాయిగా పడుకోవచ్చు. ఆకలి సమస్యను తీర్చుకోవచ్చు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: First Night, Health Tips, Hungry people, Sleep, Sleep tips

  ఉత్తమ కథలు