రొమ్ము కాన్సర్‌కి ఆస్పిరిన్‌, సోయాతో చెక్... ఇలా చెయ్యండి...

Prostate Cancer : కాన్సర్ ఓ ప్రమాదకర వ్యాధి. అందులో మహిళలకు ఎక్కువగా వస్తున్న రొమ్ము కాన్సర్‌ని నివారించేందుకు రెండు తేలికైన పద్ధతుల్ని పరిశోధకులు కనిపెట్టారు.

news18-telugu
Updated: February 4, 2020, 8:13 AM IST
రొమ్ము కాన్సర్‌కి ఆస్పిరిన్‌, సోయాతో చెక్... ఇలా చెయ్యండి...
రొమ్ము కాన్సర్‌కి ఆస్పిరిన్‌, సోయాతో చెక్... ఇలా చెయ్యండి...
  • Share this:
Prostate Cancer : మీరు ఆస్పిరిన్ (Aspirin Tablet) టాబ్లెట్ గురించి వినే ఉంటారు. ఆ టాబ్లెట్లతో రొమ్ము కాన్సర్ తగ్గుతుందంటే నమ్మగలరా? ఈమధ్య యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా (UNC) తన కాన్సర్ జర్నల్‌లో ఈ విషయాన్ని చెప్పింది. ఆస్పిరిన్ టాబ్లెట్లు వాడటం ద్వారా... రొమ్ము కాన్సర్‌ను 20 శాతం వరకూ అడ్డుకోవచ్చని చెప్పింది. మెనోపాజ్ దశలో ఉన్న మహిళలు ఈ టాబ్లెట్లను వాడితే మంచిదని డాక్టర్లు అంటున్నారు. మామూలుగా ఆస్పిరిన్ అనేది నొప్పులు తగ్గేందుకు, రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు, గుండెపోటును తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఐతే... ఈ టాబ్లెట్లే... రొమ్ము కాన్సర్‌కి కారణమయ్యే మిథలైజేషన్ విధానాన్ని అడ్డుకుంటున్నాయని UNC పరిశోధనలో తేలింది. మహిళల్లో జన్యువుల లోపంతో బ్రాకా-1, బ్రాకా-2 అనే రొమ్ము కాన్సర్లు వస్తాయి. వీటిని అడ్డుకునేందుకు ఆస్పిరిన్ టాబ్లెట్లు ఉపయోగపడుతుండటం గొప్ప విషయమే. కాన్సర్ లేని మహిళలు కూడా వీటిని వాడితే మంచిదే అంటున్నారు డాక్టర్లు. రూపాయికి ఒక టాబ్లెట్ వచ్చే ఆస్పిరిన్‌ను మెనోపాజ్ దశలో మహిళలు రోజుకు ఒకటి వాడొచ్చంటున్నారు. ఏసీడీటీ సమస్య లేకపోతే... రోజూ భోజనం తర్వాత ఈ టాబ్లెట్ వేసుకోవాలని సూచిస్తున్నారు. రొమ్ము కాన్సర్ వస్తే... దాన్ని తగ్గించుకోవడానికి లక్షలు ఖర్చవుతుంది. ఒక్కోసారి తగ్గకపోగా... ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంటుంది. దాని కంటే ఈ టాబ్లెట్లను వాడటం ద్వారా కాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చంటున్నారు డాక్టర్లు.

సోయా ఆహార ఉత్పత్తుల్లో కూడా రొమ్ము కాన్సర్‌ను అడ్డుకునే శక్తి ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. సోయాలో ఉండే జెన్‌స్టెయిన్‌ అనే సమ్మేళనం, కాన్సర్‌ కణతుల ఎదుగుదలను నిరోధించే BRCA1 జన్యువును కాపాడుతోందని అమెరికా అరిజోనా యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఇప్పుడీ రెండు అంశాల ద్వారా రొమ్ము కేన్సర్‌ను నిరోధించే అధునాతన ట్రీట్‌మెంట్లపై పరిశోధకులు దృష్టిసారిస్తున్నారు.

First published: February 4, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు