Walk Prevent From Diabetes:నేటి రోజుల్లో అన్ని వయసుల వారు మధుమేహం( Diabetes)బారిన పడుతున్నారు. దీనిని నివారించడానికి ప్రజలు వారి జీవనశైలి, ఆహారాన్ని మెరుగుపరచుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇటీవల ఓ అధ్యయనం మధుమేహాన్ని నివారించడానికి ఉత్తమమైన మార్గాన్ని వెల్లడించింది. భోజనం చేసిన తర్వాత 2 నిమిషాలు నడవడం(Walk)వల్ల టైప్ 2 డయాబెటిస్(Type 2 Diabetes)రిస్క్ తగ్గుతుంది. నిపుణులు కూడా ఈ విషయాన్ని నిజమని అంగీకరిస్తున్నారు. నడక వల్ల మన శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజూ నడవడం వల్ల డయాబెటిస్‌తో సహా అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తిన్న తర్వాత నడవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదాన్ని ఎలా తగ్గించవచ్చో తెలుసుకుందాం.
బ్లడ్ లో షుగర్ లెవల్ అదుపులో ఉంటుంది
హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం భోజనం తర్వాత కేవలం 2-5 నిమిషాలు నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని,టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. ఐర్లాండ్‌లోని లిమెరిక్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు అనేక అధ్యయనాలను విశ్లేషించిన తర్వాత ఈ వాస్తవాన్ని ముందుకు తెచ్చారు. అధ్యయనం ప్రకారం, తిన్న తర్వాత 60 నుండి 90 నిమిషాలలోపు నడవాలి. ఈ సమయంలో రక్తంలో షుగర్ లెవల్ అత్యధికంగా ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ కొన్ని నిమిషాల నడకలో, రక్తంలో చక్కెర స్థాయి సాధారణ స్థితికి వస్తుంది. దీంతో ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
Relationship Tips : రిలేషన్ షిప్ లో పర్శనల్ స్పేస్ ఎందుకు ముఖ్యమైనది
నడక వల్ల కలిగే ఇతర ప్రయోజనాలను తెలుసుకోండి
2-5 నిమిషాలు నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి, అయితే ఇది ఇన్సులిన్, రక్తపోటుకు పెద్దగా తేడా లేదు. ఇందుకోసం కనీసం 30 నిమిషాల పాటు నడవాలి. మీ సామర్థ్యం ఎక్కువగా ఉంటే మీరు 60 నిమిషాలు నడవవచ్చు. రాత్రి భోజనం తర్వాత ఇలా చేయడం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. ఈ సమయంలో, సెరోటోనిన్ హార్మోన్ కూడా విడుదల అవుతుంది, ఇది మంచి నిద్రకు దారితీస్తుంది. నడక.. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది, సానుకూల ఆలోచనలను తెస్తుంది, ఆకలిని కోల్పోయే సమస్యను కూడా తొలగిస్తుంది. ఇది శరీర కండరాలను బలపరుస్తుంది, మానసిక ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.