STUDY FINDS WOMEN ARE BETTER AT MASTURBATION THAN MEN BS
‘ఆ’ విషయంలో పురుషుల కంటే మహిళలే బెటర్..
ప్రతీకాత్మక చిత్రం
హస్త ప్రయోగం.. సెక్స్ కోరికల్ని తీర్చుకొనేందుకు పురుషులు, స్త్రీలు స్వయం తృప్తి పొందేందుకు ఉపయోగపడే ఆయుధం. అయితే, హస్త ప్రయోగం చేసుకోవడం వల్ల స్త్రీలు అంతగా సుఖం పొందలేరని, పురుషులే ఎక్కువ ఆనందాన్ని పొందుతారన్న అపోహ ఉంది.
హస్త ప్రయోగం.. సెక్స్ కోరికల్ని తీర్చుకొనేందుకు పురుషులు, స్త్రీలు స్వయం తృప్తి పొందేందుకు ఉపయోగపడే ఆయుధం. అయితే, హస్త ప్రయోగం చేసుకోవడం వల్ల స్త్రీలు అంతగా సుఖం పొందలేరని, పురుషులే ఎక్కువ ఆనందాన్ని పొందుతారన్న అపోహ ఉంది. కానీ, ఇది నిజం కాదట. దాని గురించి మహిళలు ఎక్కువగా మాట్లాడుకోకపోయినా వారు పొందే సుఖం అమితమైనదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనికి సంబంధించి వారు ఒక పరిశోధన చేపట్టగా.. మహిళలే హస్త ప్రయోగం బెటర్‌గా చేసుకోగలరని తేలిందట. ట్రోజన్ అనే కండోమ్ బ్రాండ్ 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న 1500 మందిపై సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది హస్త ప్రయోగం వల్ల ఎక్కువ ఆనందాన్ని పొందినట్లు వెల్లడించారు. వైబ్రేటర్లు, సెక్స్ టాయ్స్ వంటిని వాడుతూ వాళ్లు తమ కోరికల్ని తీర్చుకుంటున్నారని తేలింది.
అలా హస్త ప్రయోగం చేసుకోవడం వల్ల ఆత్రుత, ఒత్తిడి తగ్గిందని సర్వేలో పాల్గొన్నవారు వెల్లడించారట. పైగా, నిద్ర పోయేందుకు బాగా ఉపయోగపడిందని చెప్పారట. అంతేకాదు.. సురక్షితమైన శృంగారం అని కూడా వాదిస్తున్నారట. ఇక, మహిళలు హస్త ప్రయోగం చేసుకోవడం వల్ల ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయులు సమతుల్యంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.