Home /News /life-style /

STUDY FINDS DOGS HAVE THE SAME RISK OF DIABETES AS THEIR OWNERS NS

Type 2 Diabetes: కుక్కలకు మధుమేహం ఉంటే.. వాటి యజమానులకు కూడా డేంజర్.. తాజా అధ్యాయనంలో షాకింగ్ విషయాలు

కరోనా తగ్గుముఖం పట్టి మనిషి జీవితం సాధారణంగా మారుతున్న క్రమంలో ‘ఒమిక్రాన్’ వేరియంట్ భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఈ వేరియంట్తో అన్ని దేశాలు మరోసారి ఆంక్షల బాట పడుతున్నాయి. ఇతర దేశాల నుంచి వచ్చే వారి విషయంలో కరోనా మార్గదర్శకాలను కట్టదిట్టంగా అమలు చేస్తున్నాయి.

కరోనా తగ్గుముఖం పట్టి మనిషి జీవితం సాధారణంగా మారుతున్న క్రమంలో ‘ఒమిక్రాన్’ వేరియంట్ భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఈ వేరియంట్తో అన్ని దేశాలు మరోసారి ఆంక్షల బాట పడుతున్నాయి. ఇతర దేశాల నుంచి వచ్చే వారి విషయంలో కరోనా మార్గదర్శకాలను కట్టదిట్టంగా అమలు చేస్తున్నాయి.

ఒక నూత‌న ప‌రిశోధ‌న ప్ర‌కారం మధుమేహ వ్యాధి (Diabetes) వ‌ల్ల కుక్క‌‌ల్లోనూ (Dogs) వాటిని పెంచుతున్న య‌జ‌మానుల్లోనూ ఒకే ర‌క‌మైన ప్ర‌మాదం పొంచి ఉన్న‌ట్లు తెలుస్తోంది. బ్రిటీష్ మెడిక‌ల్ జ‌ర్న‌ల్ లో దీనిపై ప‌రిశోధ‌నా ప‌త్రం ప్ర‌చురించారు.

ఇంకా చదవండి ...
  ఇటీవ‌ల జ‌రిగిన ఒక అధ్య‌యనం ప్ర‌కారం కుక్క‌ల్లో(Dog), పిల్లుల్లో(Cat) మ‌ధుమేహ వ్యాధి ప్ర‌భ‌ల‌డం ఎక్కువ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. స్వీడ‌న్‌లో నిర్వ‌హించిన ఒక నూత‌న ప‌రిశోధ‌న ప్ర‌కారం మధుమేహ వ్యాధి (Diabates) వ‌ల్ల కుక్క‌‌ల్లోనూ వాటిని పెంచుతున్న య‌జ‌మానుల్లోనూ ఒకే ర‌క‌మైన ప్ర‌మాదం పొంచి ఉన్న‌ట్లు తెలుస్తోంది. బ్రిటీష్ మెడిక‌ల్ జ‌ర్న‌ల్ లో దీనిపై ప‌రిశోధ‌నా ప‌త్రం ప్ర‌చురించారు. ఈ ప‌రిశోధ‌నను స్వీడ‌న్‌లోని ఉబ్స‌‌లా యూనివ‌ర్సిటీకి చెందిన బీట్రైస్ కెన్న‌డీ, ఆమె బృందం క‌లిసి చేప‌ట్టారు. ఈ బృందం స్వీడ‌న్‌లోని అతిపెద్ద పెంపుడు జంతువుల ఇన్స్యూరెన్సు కంపెనీ (Insurance Company)ని ప‌రిశీలించారు. అక్క‌డ సేక‌రించిన ఇన్స్యూరెన్సు డాటాను అధ్య‌య‌నం చేసి, ఈ ప‌రిశోధ‌న‌ను నిర్వ‌హించారు. ఇది కూడా ముందుగా సెలెక్ట్ చేసుకున్న వారిని కాకుండా యాదృచ్ఛికంగా ఎంచుకున్న వ్యాధిగ్ర‌స్థుల‌ ఆరోగ్య రికార్డుల‌ను బ‌ట్టి ఈ ప‌రిశోధ‌న కొన‌సాగించారు. యాదృచ్ఛికంగా బ‌య‌ట‌కు తీసిన రికార్డుల‌కు జాతీయ గుర్తింపు సంఖ్య‌ను కేటాయించి దాని ద్వారా స్ట‌డీ చేశారు.

  ఈ బృందం 2,08,908 మంది య‌జ‌మానుల్ని వారి శున‌కాల జంట‌ల డాటాను ప‌రిశీలించారు. ఇందులో తెలిసింది ఏమంటే, ఆరోగ్య‌క‌ర‌మైన శున‌కాల‌ను పెంచుకుంటున్న య‌జ‌మానుల కంటే మ‌ధుమేహ‌మున్న శున‌కాల‌ను పెంచుకుంటున్నయ‌జ‌మానుల‌కు టైప్ 2 డ‌యాబెటీస్ (Type 2 Diabetes) రావ‌డానికి 38 శాతం అవ‌కాశ‌ముంది. ఇదే క్ర‌మంలో 1,23,566 మంది య‌జ‌మానులను, పిల్లుల జంట‌ల‌నూ ప‌రిశోధ‌న‌కు సేక‌రించారు. వాటి తార‌త‌మ్యాన్నీ గ‌మ‌నించారు. అయితే శున‌కాల కంటే పిల్లులూ వాటి య‌జ‌మానుల‌కు మ‌ధ్య ఈ డ‌యాబెటీస్ రిస్కు అంత‌గా లేన‌ట్లు గుర్తించారు.
  Type 2 Diabetes: ఈ వంటింటి చిట్కాల‌తో మధుమేహానికి చెక్.. 30 నిమిషాల్లోనే ఫలితం..

  మ‌ధుమేహం సోకిన శున‌కాలకు, వాటి య‌జ‌మానుల‌కు మ‌ధ్య ఉన్న‌ సంబంధం అనేది వ్య‌క్తిగ‌త‌, సామాజిక ఆర్థిక ప‌రిస్థితుల‌ను బ‌ట్టి వివ‌రించ‌డం క‌ష్టమ‌ని చెప్పొచ్చు. ప్ర‌చురించిన రిపోర్టు చెబుతున్నదాని ప్ర‌కారం, శున‌కాలో్ల‌, పిల్లుల్లో మ‌ధుమేహ ప్ర‌భావం నానాటికీ పెరిగిపోతున్న‌ట్లు తెలుస్తోంది. అంతేగాక‌, రెండు జంతువుల్లోనూ ఆహార‌పు అల‌వాటైన‌ డైట్ (Diet)‌, వాటివ‌ల్ల ఏర్ప‌డే ఒబేసిటీ (Obesity) అనేవి టైప్ 2 మ‌ధుమేహం క‌లిగించే ప్ర‌మాదాన్ని మ‌రింత పెంచే అవ‌కాశ‌మున్న‌ట్లు తెలుస్తోంది.
  దీనికి సంబంధించిన వివ‌రాల‌ను మ‌రింత వివ‌రించారు బిట్రైస్‌. దీని కంటే ముందే జ‌రిగిన కొన్ని ప‌రిశోధ‌న‌ల‌ను బ‌ట్టీ, శున‌కాల‌కు వాటి య‌జ‌మానుల‌కు మ‌ధ్య ఈ అధిక బ‌రువైన ఒబెసిటీ ఒకేసారి అభివృద్ది చెందే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది.
  More Proteins Than Eggs: గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్లు కావాలా ? అయితే ఈ కూరగాయలను తినండి

  ఇలాంటి అథ్య‌య‌నాల నేప‌ధ్యంలో బిట్రైస్‌తో పాటు ఆమె బృందం కూడా న‌మ్ముతున్న‌ది ఏమంటే, ఇద్ద‌రి శారీర‌క కార్య‌క‌లాపాల స్థాయిల‌ను బ‌ట్టి కూడా మ‌ధుమేహం కూడా ఇద్ద‌రి మ‌ధ్య ఒకేసారి అభివృద్ధి అయ్యే ఆవ‌కాశ‌మున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. అయితే ఇక్క‌డ ఒక విష‌యాన్ని గ‌మ‌నించాలి. పిల్లులు, వాటి య‌జ‌మానులు క‌లిసి వ్యాధుల ప్ర‌మాదాల‌ను పంచుకునే అవ‌కాశం త‌క్కువ‌గా ఉండ‌టానికి ముఖ్య‌మైన కార‌ణం ఒక‌టి క‌నిపిస్తోంది. ఈ ప్ర‌మాదం వీరి మ‌ధ్య త‌గ్గ‌డానికి గ‌ల కార‌ణం ఏమంటే, వాటి వైవిధ్యమైన క‌‌ద‌లికల‌ అల‌వాట్లని చెప్పొచ్చు. పిల్లులు సాధార‌ణంగా వాటి య‌జ‌మానుల నుంచి స్వ‌తంత్రంగా ఉండ‌టానికి ఇష్టప‌డ‌తాయి.

  ముఖ్యంగా అవి అటూ ఇటూ తిరిగాల‌ని అనుకుంటే అవి వాటి స్వేచ్ఛ‌కే ప్రాధాన్య‌త‌ను ఇస్తాయి అంటారు ప‌రిశోధ‌కులు. దీని విష‌య‌మై బీట్రైస్ మ‌రిన్ని విష‌యాల‌ను ప్ర‌స్తావిస్తూ, శున‌కాలు, వాటి య‌జ‌మానులు ర‌సాయ‌నాల‌, కాలుష్య ప‌దార్థాల ప్ర‌భావానికి లోన‌యిన‌పుడు ఇద్ద‌రిపైనా వాటి ప్రాభ‌ల్యం ఉంటుందంటారు. అది ఎంత స్థాయిలో ఉంటుంది అనే దానిపై మ‌రింత లోతుగా అధ్య‌య‌నం చేయాల్సిన అవ‌స‌రాన్ని గుర్తిస్తారు.

  రిపోర్టు ప్ర‌కారం అయితే శున‌కాల‌కు, య‌జ‌మానుల‌కు మ‌ధ్య దాగున్న ఈ గుప్త కార‌కాన్ని క‌చ్ఛితంగా చెప్ప‌లేదు. ఎందుకంటే, ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఈ అధ్య‌య‌నం ఇంకా ప‌రిశీల‌నాంశంగానే ప‌రిగ‌ణించ‌బ‌డింది. అయితే ఈ అధ్య‌య‌నం అనేది శున‌కాలకు, వాటి య‌జ‌మానులకు మ‌ద్య టైప్ 2 మ‌ధుమేహం రావ‌డానికి గ‌ల సంబంధాన్ని తెలియ‌జేస్తోంది. దీన్ని అర్థం చేసుకోగ‌లిగిన‌పుడు వారి కుటుంబ ఆరోగ్య ల‌క్ష‌ణాల‌లో మార్పులు రావ‌డానికి గ‌ల కార‌ణాల‌ను తెలుసుకోవ‌చ్చు.

  బిట్రైస్ అభిప్రాయం ప్ర‌కారం శున‌కాల్లో ఉన్న మ‌ధుమేహం అనేది ఏదో ముఖ్య‌మైన విషయాన్ని తెలుసుకోవ‌డానికి ఒక గుర్తుగా క‌నిపిస్తోంది. ఆమె దీనిపై మ‌రింత వివ‌ర‌ణ ఇస్తున్నారు. శున‌కాల‌కు, వాటి య‌జ‌మానుల‌కు మ‌ద్య ఒక సంబంధం ఉంద‌నేది నిర్వివాదాంశం. ఇలాంటిదే ఒక బంధం అనేది టైప్ 2 డ‌యాబెటీస్ ప్ర‌భ‌ల‌డంలోనూ క‌నిపిస్తోంది. దీనితో పాటు ఇత‌ర ఆరోగ్య ల‌క్ష‌ణాల‌ను, వాటి ద్వారా ఏర్ప‌డే ప్ర‌మాదాల‌ను అర్థం చేసుకోవ‌డానికి ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది.
  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Diabetes, Dog, Health

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు