చిరు జల్లులు పడుతుండగా.. చల్లని వాతావరణంలో.. వెచ్చవెచ్చగా ఓ కప్పు కాఫీ తాగితే....! ఆ మజాయే వేరు. తలనొప్పిగా ఉన్నా, అలసటగా ఉన్నా కాఫీ నీళ్లు కడుపులో పడేస్తే కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఇవి మాత్రమే కాదు.. మెదడు చురుగ్గా పనిచేయడానికి, కాలేయం ఆరోగ్యంగా ఉండేందుకు, కంటి చూపు, గుండె సంబంధిత వ్యాధులను దూరంగా ఉంచేందుకు ఇది దోహదపడుతుంది. కీళ్లనొప్పులు తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అతి ముఖ్యంగా పురుషులు ఎదుర్కొనే అంగ స్తంభన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. దానిలో ఉండే కెఫిన్ జననావయవాలకు రక్త సరఫరాను పెంచుతుంది. దీంతో పురుషాంగం ఉత్తేజంగా పనిచేసి, అంగ స్తంభన సమస్య పోతుంది. శృంగారంలో యాక్టివ్‌గా పాల్గొంటారు.
ఇవి మాత్రమే కాకుండా, ప్రపంచాన్ని భయపెడుతున్న మధుమేహ సమస్యకు కాఫీ అత్యుత్తమ విరుగుడు అని తాజాగా శాస్త్రవేత్తలు తెలిపారు. టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారు చక్కెర లేకుండా కాఫీ తాగడం అలవాటు చేసుకోవాలట. రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలు తగ్గించడంలో ఇది కీలకంగా పనిచేస్తుందని, ఫలితంగా మధుమేహం అదుపులో ఉంటుందని వెల్లడించారు. షుగర్‌ను కంట్రోల్ చేసే గుణాలు కాఫీలో మెండుగా ఉన్నాయని వివరించారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.