Home /News /life-style /

STRUGGLING WITH EARLY SIGNS OF AGEING EXPERT REVEALS HOW TO COMBAT AGE SPOTS UMG GH

Age Spots: ఏజ్ స్పాట్స్ వేధిస్తున్నాయా..? అయితే ఈ టిప్స్‌తో సమస్యకు చెక్ పెట్టండి..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చర్మంపై ఏర్పడే ఫ్లాట్ మార్క్స్ లేదా మచ్చలను ఏజ్ స్పాట్స్ అంటారు. సాధారణంగా ఎండలో ఎక్కువగా తిరిగేవారిలో ఇవి కనిపిస్తుంటాయి. ఈ మచ్చలు నలుపు, టాన్ లేదా బ్రౌన్ వంటి విభిన్న షేడ్స్‌లో కనిపిస్తాయి. వీటిని లివర్ స్పాట్స్ లేదా సోలార్ లెంటిజినస్ అని కూడా అంటారు. ఇవి అం

ఇంకా చదవండి ...
చర్మంపై ఏర్పడే ఫ్లాట్ మార్క్స్ లేదా మచ్చలను ఏజ్ స్పాట్స్ అంటారు. సాధారణంగా ఎండలో ఎక్కువగా తిరిగేవారిలో ఇవి కనిపిస్తుంటాయి. ఈ మచ్చలు నలుపు, టాన్ లేదా బ్రౌన్ వంటి విభిన్న షేడ్స్‌లో కనిపిస్తాయి. వీటిని లివర్ స్పాట్స్ లేదా సోలార్ లెంటిజినస్ అని కూడా అంటారు. ఇవి అంత ప్రమాదకరం కాదు. కానీ ఇవి ఏర్పడితే అందవిహీనంగా కనిపిస్తారు. ఈ ఏజ్ స్పాట్స్ సాధారణంగా లేత చర్మపు రంగు ఉన్నవారిలో, అదికూడా 50 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా సంభవిస్తాయి. అయితే పిల్లలు, యువకులు కూడా ఎండలో ఎక్కువ సమయం గడిపితే ఇవి కనిపించవచ్చు

ఎండ ఎక్కువగా తగిలే శరీర భాగాలైన ముఖం, మెడ, చేతుల వెనుక, భుజాలు, పాదాల పైభాగంలో ఈ ఏజ్ స్పాట్స్ ఏర్పడే అవకాశం ఉంది. ఇటీవల ఈ సమస్య సర్వసాధారణమైంది. దీనికి చెక్ పెట్టడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

* ఏజ్ స్పాట్స్ నివారణ మార్గాలు
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఎండలో తిరగకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఈ సమయంలో సూర్య కిరణాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రతిరోజూ సన్‌స్క్రీన్‌ను ఎస్‌పీఎఫ్ 30 లేదా 50తో అప్లై చేయండి. సన్‌స్క్రీన్‌లో UVA, UVB ప్రొటెక్షన్ ఉండడం తప్పనిసరి. మీరు ఎండలో తిరగడానికి కనీసం 30 నిమిషాల ముందు సన్‌స్క్రీన్ అప్లై చేయడం ముఖ్యం. అలాగే, ప్రతి 2 గంటలకు మళ్లీ అలా చేయడానికి ప్రయత్నించండి.

ఒకవేళ మీరు ఎండలో ప్రయాణిస్తున్నప్పుడు, ఎక్కువ సమయం గడపకపోతే SPF 30 సన్‌స్క్రీన్ అప్లై చేయండి. అయితే పర్వతాలు, బీచ్ ఏరియాల్లో, పని ప్రదేశంలో ఎండలో 3-4 గంటలు గడుపుతుంటే, రక్షణగా SPF 50 సన్‌స్క్రీన్ ఉపయోగించడం ద్వారా మీ చర్మం పూర్తిగా ప్రొటెక్ట్ అవుతుంది.

** కొన్ని రకాల జ్యూస్‌లు కూడా కీలకపాత్ర పోషిస్తాయి. అవేంటంటే..

* నిమ్మరసం
నిమ్మరసం ఏజ్ స్పాట్స్ తగ్గించే ఉత్తమ పరిష్కారాల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఇందులో సిట్రిక్ యాసిడ్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నిమ్మరసాన్ని తరుచు తీసుకుంటే ఈ మచ్చలు తగ్గే అవకాశం ఉంది.

* యాపిల్ సిడార్ వెనిగర్
ఏజ్ స్పాట్స్ నివారణలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. సహజ ఆల్ఫా హైడ్రాక్సిల్ ఆమ్లాలు ఇందులో అధికంగా ఉంటాయి. దీన్ని తీసుకుంటే మృతకణాలు తొలగిపోయి చర్మం పునరుజ్జీవం అవుతుంది.

* అలోవెరా
దీని జ్యూస్ లేదా జెల్‌ను వయసు మచ్చల నివారణ చికిత్సలో ఉపయోగిస్తారు. డార్క్ స్పాట్స్, క్లియర్ మార్కులను సమర్థవంతంగా తగ్గించడంలో అలోవెరా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలోవెరాలో ఉండే క్రియాశీల సమ్మేళనాలు చర్మ కణాల వృద్ధాప్యాన్ని నియంత్రించడంతోపాటు కొత్త కణాల పెరుగుదలను ప్రేరేపిస్తాయి.

* దోసకాయ జ్యూస్
దోసకాయ జ్యూస్‌లో బ్లీచింగ్ ప్రభావం ఉంటుంది. ఇది ఏజ్ స్పాట్స్ నివారణలో బాగా పనిచేస్తుంది. దోసకాయలో సేంద్రీయ సమ్మేళనాలు, సహజ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. పిగ్మెంటేషన్ క్లియర్ స్పాట్స్ తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి.

మీ చర్మాన్ని సురక్షితంగా ఉంచడానికి ఎల్లప్పుడు సేంద్రియ & సహజమైన శరీర సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించండి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి.
Published by:Mahesh
First published:

Tags: Beauty, Beauty tips, Health, Health Tips

తదుపరి వార్తలు