Vastu Tips: ఇంట్లో మట్టికుండ.. ఇలా పెడితే ఆర్థిక సమస్యలు దూరం

ఇంట్లో మట్టి కుండలలో నీటిని నిల్వ చేయడం చాలామందికి ఇష్టం ఉండదు. కాని వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో మట్టి కుండలో నీటిని నిల్వ చేసుకుంటే ఎన్నో లాభాలున్నాయి.

news18-telugu
Updated: November 10, 2019, 11:03 AM IST
Vastu Tips: ఇంట్లో మట్టికుండ.. ఇలా పెడితే ఆర్థిక సమస్యలు దూరం
Vastu Tips: ఇంట్లో మట్టికుండ.. ఇలా పెడితే ఆర్థిక సమస్యలు దూరం
  • Share this:
సాధారణంగా మనం ఇంట్లో మంచినీళ్లు బిందెల్లో, బాటిల్స్‌లో పెట్టుకుందాం. ఒకప్పుడు జనం ఇత్తడి, రాగి బిందెల్లో తాగే నీరు నిల్వ చేసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఏ ఇంట్లో చూసిన వాటర్ బబుల్స్‌కే ట్యాప్‌లు అమర్చి నీటిని తాగేస్తున్నారు. కానీ మట్టికుండలో నీరు తాగేవాళ్లు ఇప్పుడు ఎక్కడా కనిపించరు. మండువేసవిలో మట్టికుండలో నీటిని నిల్వ చేసి తాగుతుంటారు. కానీ ఇంట్లో మట్టికుండ ఉంచితే ఆర్థిక సమస్యలు దూరమవుతాయని వాస్తుశాస్త్రం చెబుతోంది.

తాగునీటిని మట్టి కుండలో భద్రపరుచుకోవడం వల్ల ఆర్థిక సమస్యల దూరమవుతాయి. నేటి వాస్తు శాస్త్రం యొక్క విభాగంలో, భారతీయ గృహాలలో ఒక మట్టి కుండ నుండి త్రాగునీటి యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుతాము. గ్రామల్లో ప్రజలు ఇప్పటికీ చాలామంది మట్టి కుండ లేదా మట్టితో చేసిన పాత్రలను నీటిని నిల్వ చేయడానికి, వంటలకు ఉపయోగిస్తున్నారు. కానీ సిటీల్లో మాత్రం ఇవి పెద్గగా కనిపించవు. ఈ రోజుల్లో, పిల్లలు కూడా మట్టి కుండల నుండి నీరు త్రాగడానికి ఇష్టపడరు. ఇంట్లో మట్టి కుండలలో నీటిని నిల్వ చేయడం చాలామందికి ఇష్టం ఉండదు. కాని వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో మట్టి కుండలో నీటిని నిల్వ చేసుకుంటే ఎన్నో లాభాలున్నాయి.

వాస్తు ప్రకారం, మీ ఇంట్లో మట్టికుండలో నిండుగా నీరు ఉంచితే మీ ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయని వాస్తుశాస్త్రం చెబుతోంది. మీరు ఎప్పటికీ ధనవంతుల నుంచి కిందకు తగ్గరని అంటుంది. అయితే పెద్ద కుండ కాకపోయినా చిన్న మట్టికుండనైనా సరే మీ ఇంట్లో ఉత్తర దిశన ఉండేలా పెట్టుకుండి. అయితే కుండ మాత్రం ఎప్పుడూ ఖాళీగా ఉండకుండా చూసుకోవండి.
First published: November 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading