Home /News /life-style /

STOP MAKING THESE MISTAKES IF YOU WANT YOUR HAIR TO GROW THICKER AND LONGER LETS DISCUSS PRV

Hair fall: మీ జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరగాలంటే ఈ తప్పులు చేయడం ఆపేయండి.. అవేంటంటే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జుట్టు పొడుగుగా(long) పెరగాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సత్ఫలితాలిస్తాయంట. కొందరు మంచి జుట్టు (Hair) ఉన్నవారిని చూసిన ప్రతిసారి బాధపడుతుంటారు. అందుకోసం ఇంటి చిట్కాలు పాటిస్తూ.. రకరకాల ఉత్పత్తులు వాడేస్తుంటారు. అందుకే జుట్టు పొడువుగా ఒత్తుగా పెరగాలంటే కొన్ని తప్పులు చేయడం ఆపేయాలి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    సగటు జీవిలో జుట్టు (hair) రాలిపోతుండటాన్ని (loss) చూసి తట్టుకోలేడు. ఇక అమ్మాయిలైతే (girls) మరేమరి. కేశాలు వారి అందాన్ని రెట్టింపు చేస్తాయని చెప్పడలో అతిశయోక్తి లేదు. అందుకే జుట్టు మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. మహిళల కురులు  (women hairs) మగవారికీ ఇష్టమే. కేశాలు ఎంత బాగా ఉంటే అంత అందంగా  (beauty) కనిపిస్తారు. జుట్టు ఎంత బాగుంటే అన్ని రకాల హెయిర్​ స్టైల్స్​ను ఫాలో అవుతారు. అయితే జుట్టు ఆడవారిలోనే కాదు మగవారికీ అందాన్ని చేకూరుస్తాయి. కాకపోతే మగవారు బట్టతల వస్తుందని తెలిసే సరికి పట్టించుకోవడం మొదలెడతారు. ఇక సెలెబ్రెటీలైతే సరే సరి వారి కోసం పర్సనల్ హెయిర్​ స్పెషలిస్టులను పెట్టుకుంటారు. అయితే మనలో చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం (hair fall) జరుగుతుంది. జుట్టు (hair) రాలిపోతుంటే విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది. అలాంటి జుట్టు పొడుగుగా (long) పెరగాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సత్ఫలితాలిస్తాయంట. కొందరు మంచి జుట్టు  (Hair) ఉన్నవారిని చూసిన ప్రతిసారి బాధపడుతుంటారు. అందుకోసం ఇంటి చిట్కాలు పాటిస్తూ.. రకరకాల ఉత్పత్తులు వాడేస్తుంటారు. అందుకే జుట్టు పొడువుగా ఒత్తుగా పెరగాలంటే కొన్ని తప్పులు చేయడం ఆపేయాలి. అవేంటో ఒకసారి చూద్దాం.. చాలామంది బాగా కాగిన నీటితో తలస్నానం (bath) చేయాలని భావిస్తారు. అయితే ఇలా వేడి నీటితో స్నానం చేయాలని అనిపిస్తే.. కాస్త కంట్రోల్ చేసుకోవడం మంచిది. వేడి నీటితో తలస్నానం చేయడం వల్ల మీ కుదుళ్ల పై ఒత్తిడి పెరగడంతో పాటు, చర్మం (skin)లోని తేమ మొత్తం తొలగిపోతుంది. అలాగే మీ జుట్టును రాలిపోయేలా (hair loss) చేస్తుంది. అలా కాకుండా.. గోరు వెచ్చని నీటి (lukewarm water)తో తలస్నానం చేస్తే తల పొడిబారి పోకుండా ఉంటుంది. కేవలం చలికాలం మాత్రమే కాదు.. ఏ కాలంలోనైనా గోరు వెచ్చని నీరే తలస్నానానికి మంచిది. వారానికి రెండు సార్లు తలకు నూనె (oil) పెట్టుకోవడం మంచిదంటే.. అదేదో పాతకాలం మాట అని భావిస్తారు. కానీ అలా చేయడం నిజంగానే మంచిది. తరచూ జుట్టుకు నూనె (oil) పెట్టుకోవడం వల్ల.. దానికి సరైన స్థాయిలో తేమ అందుతుంది. అలాగే పోషకాలు కూడా లభిస్తాయి. తలకు నూనె పెట్టుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా (healthy) పెరగడం (increase) మాత్రమే కాదు.. కుదుళ్లపై ఒత్తిడి (stress) కూడా తగ్గుతుంది. అలాగే వెంట్రుకలు తెల్లబడి పోవడం మొదలైన సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. అలాగే గోరు వెచ్చని నీటితో మసాజ్ చేసుకుంటే తలనొప్పి కూడా తగ్గిపోతుంది. (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Bathtub photo, Beauty tips, Cold water, Life Style, Water

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు