Stomach pain: కడుపునొప్పి సమస్యకు.. ఇలా చేస్తే చిటికెలో మాయం!
ప్రతీకాత్మక చిత్రం
వంటింట్లో ఉండే స్సైసెస్తో ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు. పంటి నొప్పి నుంచి కాళు నొప్పులను తగ్గించే మహత్తరమైన శక్తి మన భారతీయ కిచెన్‌కి మాత్రమే సొంతం.
కడుపునొప్పి (Stomach pain), పంటి నొప్పి, చెవినొప్పి బాధలు భరించలేనివి. అందుకే కనీసం ఇంటి చిట్కాలతో ఊరట కలిగించే ప్రయత్నం చేస్తాం. అందులో కొన్ని చిట్కాలు ఏంటో తెలుసుకుందాం. కడుపునొప్పి (Stomach pain) తో బాధపడుతున్నపుడు 10 గ్రాముల యాలకుల పొడిని నీటిలో కలిపి తాగాలి. లేకపోతే నీళ్లలో నానబెట్టిన ఇలాచీని గ్రైండ్ చేసి తీసుకున్న సరిపోతుంది.
కనీసం వారానికి ఒకసారైనా.. కాకరకాయ (Bitter guord) ను ఆహారంలో చేర్చుకుంటే మంచిదని పెద్దలు చెబుతారు.
ఏడు– ఎనిమిది వారాలకు ఒక సారైనా స్నానం చేసేటపుడు పసుపు పూసుకుంటే చర్మ సంబంధిత వ్యాధులు రావు. అంతేకాదు చర్మంపై ఉన్న అన్వాంటెడ్ హెయిర్ కూడా తగ్గిపోతుంది. ఈ కాలంలో నువ్వుల నూనెతో పసుపు కలిపి ఒంటికి పట్టించాలి.
కడుపునొప్పిగా ఉన్నపుడు ఇంగువని నీటిలో కలిపి బొడ్డు మీద ఉంచాలి. ఇలా చేస్తే నొప్పి నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు.
కళ్లకు కళ్లకలక వస్తే.. దూదిని ధనియాల నానబెట్టిన నీటిలో ముంచి కళ్లను తుడవాలి. కంటికి ఉపశమనంగా ఉంటుంది.
కళ్లు మంటలు, కంటి నుంచి నీరు కారితే,, తులసి ఆకుల రసాన్ని కంటి మీద రాసి చూడంటి.
కాలిన మచ్చలకు తేనె Honey రాస్తే,, కాలిన మచ్చలు పోతాయి. లేకపోతే కలబంద పెట్టిన మంచి ఫలితం ఉంటుంది.
కాళ్లు లేదా చేతులు బెణికితే ఉప్పును వేడి చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో కాపడం పెట్టాలి.
జలుబు, ముక్కు కారటం సమస్య ఎక్కువైతే.. కాస్త చింతపండు గుజ్జు, టమాటారసం, మిరియాల పొడి, ఒక మిర్చీ, కాసింత ఉప్పు వేసి తయారు చేసిన సూప్‌ను వేడివేడిగా తాగాలి. మంచి రిలీఫ్ ఉంటుంది.
దాల్చిన చెక్క పొడి, ఒక టేబుల్ స్పూన్ తేనెలో కలిపి,కాస్త మిరియాల పొడి, రెండు చుక్కల నిమ్మరసం కలిపి తీసుకున్నా.. జలుబు తగ్గుతుంది.
సాధారణంగా మనం కూరగాయలు తరిగేటపుడు చేతులు తెగుతాయి. అలాంటపుడు వెంటనే గాయానికి పసుపు Turmeric పూస్తే.. గాయం త్వరగా మానడమే కాదు, సెప్టిక్ అవ్వదు.
రాత్రి పడుకునే సమయంలో కొన్ని తులసీ ఆకులను నీటిలో నానబెట్టి ఆ నీటితో ఉదయం నోటిలో వేసుకుని గార్గిలింగ్ చేస్తే.. నొట్లో ఏమైనా పొక్కులు ఉంటే పోతాయి.
క్రమం తప్పకుండా సోయాబీన్ తింటే.. శరీరంలో కొలెస్ట్రాల్ నిల్వ ఉండవు.
సాధారణంగా గర్భిణీలకు Pregnant women ఏం తిన్నా వెంటనే వాంతులు అవుతాయి. అటువంటివారు పరగడుపున ఒక స్పూన్ తేనె, అంతే నిమ్మ రసం కలిపి తీసుకుంటే వాంతులు ఆగిపోతాయి. ఇది ఎవరు వాడినా మంచి ఫలితం ఉంటుంది. సమస్య ఎంతకీ తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించడం మేలు!
Published by:Renuka Godugu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.