• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • STEPS TO MORE EFFECTIVE PARENTING BOOSTING YOUR CHILD SELF ESTEEM SA

Parenting Tips: పిల్లల ముందే అలా చేస్తే ఎలా!

Parenting Tips: పిల్లల ముందే అలా చేస్తే ఎలా!

Parenting

దేశ భవిష్యత్ నేటి బాలలపై అధారపడి ఉంది. వారి భవిష్యత్‌ను తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. కానీ చాలా మంది గాడి తప్పుతున్నారు. ముఖ్యంగా మీ పిల్లవాడు ఇతరులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నాడా

  • Share this:




    దేశ భవిష్యత్ నేటి బాలలపై అధారపడి ఉంది. వారి భవిష్యత్‌ను తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. కానీ చాలా మంది గాడి తప్పుతున్నారు. ముఖ్యంగా మీ పిల్లవాడు ఇతరులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నాడా ..? అలా అయితే వారిని ప్రశాంతంగా కూర్చొబెట్టి వివరించడానికి ప్రయత్నం చేయాలి. సానుకూల క్రమశిక్షణ వారితో తల్లిదండ్రులు చేసే సంభాషణతో మొదలవుతుంది. ఈ విషయం చాలా అధ్యయనాలలో తేలింది. వారితో మాట్లాడేటప్పుడు భాష కూడా ముఖ్యమైనది. వారి చేసే పనులకు మీకు కోపం రావచ్చు కానీ ఆ కోపాన్ని ప్రదర్శించకుండా సున్నితంగా వారికి అర్ధమయే విధంగా చెప్పాలి. అలాగే పిల్లల ముందు భార్యభార్తలు గొడవలకు దిగకూడదు.



    మిచిగాన్ విశ్వవిద్యాలయ పరిశోధకులకు పిల్లలను ఏలా డిల్ చేయాలనే దానిపై తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. తల్లిదండ్రులు పిల్లలపై ఎక్కువగా కోపపడుతూ ఉండడం వల్ల వారి ఇతరులతో ఎక్కువగా గడపడానికి ఇష్టపడుతారని పరిశోధకులు తెలిపారు. వారిని కొట్టడం వల్ల పిల్లలలో ఆశించిన స్థాయిలో మార్పుల రాదని వెల్లడించారు. పిల్లలతో సంభాషణ మృదువుగా ఉండాలని.. అప్పుడు వారు మానసికంగా దృడంగా ఉంటారని తెలిపారు. వారికి సూచనలు చేయడం అనేది సున్నితమైన భాషతత్వంతో కూడుకుని ఉండాలని తెలిపారు.

    పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండండి. రోజూ లాగా లేకుండా ప్రవర్తనలో మార్పు వస్తే... ఏదో జరిగినట్లే. అది మీకు చెప్పాలంటే వారితో మీరు సుతిమెత్తగా మాట్లాడుతూ... దగ్గరకు తీసుకొని... అడగాల్సి ఉంటుంది. వాళ్లు ఏదైనా తప్పు చేస్తే... మీరు దాన్ని సున్నితంగా మందలిస్తూ సరిదిద్దాలే తప్ప... కోపం తెచ్చుకొని కొట్టినా, తిట్టినా వాళ్లలో భయం మరింత పెరిగి... అది మానసికంగా విపరీత పరిణామాలకు దారితీస్తుంది.
    Published by:Rekulapally Saichand
    First published: