ఇంట్లో శివలింగాలు ఉంటే మంచిదేనా..

ప్రతీకాత్మక చిత్రం

మనపెద్దలు చాలా విషయాల్లో కొన్ని నియమాలు పాటించాలంటారు. అదేవిధంగా.. చాలా చోట్ల ఇంట్లో శివలింగం ఉండడం అంత మంచిది కాదని చెబుతారు ఎందుకంటే..

  • Share this:
మనపెద్దలు చాలా విషయాల్లో కొన్ని నియమాలు పాటించాలంటారు. అదేవిధంగా.. చాలా చోట్ల ఇంట్లో శివలింగం ఉండడం అంత మంచిది కాదని చెబుతారు ఎందుకంటే.. శివలింగాలు ఉన్న చోట శుచిగా ఉంచాలి. ఖచ్చితంగా నియమాలు పాటించాలి. వేదమంత్రాలతో అభిషేకాలు ఖచ్చితంగా చేయాలి. కానీ, ఇంట్లో అంత శుచిగా ఉండడం కదరకపోవచ్చు. చాలా సందర్భాల్లో ఎన్నో నియమాలను పట్టించుకోం. ఇవన్నీ దుష్ప్రభావాలు చూపిస్తాయి.

కాబట్టి.. శివలింగాలు, సాలగ్రామాలు ఉంచితే నిత్యం రుద్రాధ్యాయ సహిత అభిషేకం విధిగా చేయాలి. ఇలాంటివి పాటించనప్పుడు.. లింగాలను, సాలగ్రామాలను ఇంట్లో ఉంచడం కంటే ఆలయాల్లో సమర్పించడం.. లేదా ఆలయాల్లోని ఏవైనా చెట్ల కింద ఉంచడం మంచిది.

ఇవికూడా చదవండి..

చిరుధాన్యాల్లో ఏవి తింటే ఏం లాభమో తెలుసుకోండి..
First published: