దేవుళ్ళ విగ్రహాలు, ఫొటోలకి గంధం అందుకే పూస్తారు..

భారత సాంప్రదాయంలో చందనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతీ శుభాకార్యాల్లోనూ చందనాన్ని పూస్తారు. ముఖ్యంగా ప్రముఖ ఆలయాల్లో దేవుడికి చందనోత్సవం అంటూ ఓ రోజునే కేటాయిస్తారు. అసలు అలా ఎందుకు చేస్తారంటే..

Amala Ravula | news18-telugu
Updated: June 27, 2019, 10:45 AM IST
దేవుళ్ళ విగ్రహాలు, ఫొటోలకి గంధం అందుకే పూస్తారు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చందనం అనగానే సుగంధపరిమళంలానే అనుకుంటారు చాలామంది. కానీ, ఈ చందనానికి చాలా గొప్పతనం ఉంది. ఎవరినైనా గౌరవించటానికి చందనాన్ని వాడతారు. వేడుకల్లో ఎక్కువగా వచ్చినవారికి పూస్తుంటారు. అయితే, ఈ చందనం వెనుక ఓ కథే ఉంది. దేవాదిదేవతలు ఇష్టంగా రాసుకుంటారు. విష్ణుమూర్తికి చందనం తయారు చేయటానికి ఓ పెద్ద వ్యవస్థే ఉందని చెబుతారు. తుంబురుని గానాన్ని, వీణా వాదనని మెచ్చిన విష్ణువు అతడిని సత్కరించి హారము, బంగారు వస్త్రాలు, చందనం ఇచ్చాడట.. అయితే.. ఇచ్చిన కానుకల్లో తుంబురునికి ఈ చందనమే నచ్చిందట. ఇది చూసిన నారదునికీ అసూయ కూడా కలిగిందట.

అంతేకాదు, శ్రీకృష్ణుడు, లక్ష్మీదేవి, సింహాచల వరాహ లక్ష్మి నృసింహ స్వామి వారు, వేంకటేశ్వరస్వామి ఇలా చందనాన్ని ఎంతో ఇష్టంగా పూసుకుంటారట... అందుకే చాలా ఆలయాల్లో అధికారులు చందనోత్సవాలు నిర్వహిస్తుంటారు.


దేవతలు ఇష్టపడే ఈ గంధాన్ని చందనోత్సవం, చందన అభిషేకం చేస్తూ దేవుళ్లకి గంధం రాస్తుంటాం..తిరిగి దేవుడినుంచి తొలగించి ఆ చందనాన్ని తీసుకుని ఆనందంగా రాసుకుంటాం.. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి..
Published by: Amala Ravula
First published: June 27, 2019, 10:44 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading