దేవుళ్ళకి పెట్టే నైవేద్యంలో చక్కెర వేయొచ్చా..

ప్రతీకాత్మక చిత్రం

చాలామంది దేవుడికి పెట్టే నైవేద్యం, ప్రసాదంలో చక్కెర వేస్తుంటారు. ఇలా వేస్తే మంచిదని కొంతమంది అసలు వేయకూడదని కొంతమంది అంటుంటారు. మరి పండితులు ఏం చెబుతున్నారంటే..

  • Share this:
దేవుడికి నైవేద్యంగా చాలా సందర్భాల్లో తీపివంటకాలు చేసిపెడతాం. సమయం లేనప్పుడు పప్పు చక్కెర, చక్కెర, పాలల్లో చక్కెర, అన్నంలో చక్కెర వేసి పెడుతుంటారు. ఇది చాలా మనం చూస్తూనే ఉంటాం. అయితే, కొంతమంది అలా చేయడం వల్ల దోషం అని చెబుతుంటారు. నిజానికీ ఇలా చేయడం దోషం కాదని వేదపండితులు చెబుతున్నారు.

నైవేద్యం, నివేద అంటే మనం ఏ ఆహారం తీసుకుంటామో.. అదే దేవుడికి సమర్పించడం.. భగవంతుడు మేము ఆహారంగా తీసుకోవడానికి మాకు ఈ పదార్థాలు ఇచ్చాం.. అందుకే ఆ గుర్తుగా ఈ ఆహారాన్ని నీకు ముందుగా సమర్పిస్తున్నామని చెప్పడమే.

ఇలా ఆహారాన్ని అందించడమంటే ఆ దేవుడికి కృతజ్ఞతాభివందం చేయడమే. కాబట్టి.. చక్కెరను వేయడం వల్ల ఎలాంటి దోషం లేదని చెబుతున్నారు పండితులు.
First published: