ఇకపై తండ్రులు కూడా పిల్లలకు పాలు ఇవ్వొచ్చు... జపాన్ అద్భుత ఆవిష్కరణ...

పురుషులు ఉదరభాగంలో ధరిస్తే... చాలు, ఎంచక్కా పిల్లలకు పాలు పట్టించవచ్చు... తల్లులను కోల్పోయిన పిల్లలతో పాటు వేరే పనుల్లో బిజీగా ఉండే తల్లులకు ఎంతో ఉపయోగం...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 13, 2019, 12:46 PM IST
ఇకపై తండ్రులు కూడా పిల్లలకు పాలు ఇవ్వొచ్చు... జపాన్ అద్భుత ఆవిష్కరణ...
ఇకపై తండ్రులు కూడా పిల్లలకు పాలు ఇవ్వొచ్చు... జపాన్ అద్భుత ఆవిష్కరణ..
  • Share this:
మాతృత్వం మహిళలకు ఎంత గొప్ప వరమో... తల్లిపాలు బిడ్డలకు అంత ఆవశ్యకం. బిడ్డ మానసిక, శారీరక ఎదుగుదలకు తల్లిపాలు ఎంతో కీలకం. బిడ్డ స్నానం చేయించడం దగ్గర్నుంచి, ప్రతీపనిలో పాలు పంచుకునే తండ్రి... పాలిచ్చే విషయంలో మాత్రం భాగం పంచుకోలేడు. అయితే ఇకపై తండ్రులు కూడా పిల్లలకు ఎంచక్కా పాలు ఇవ్వొచ్చు. అలాగని పాలడబ్బాలో పోసి పట్టించడం కాదు... నిజంగానే చనుబాలు పట్టినట్టు పాలు పట్టించొచ్చు. అవును... వినడానికి కాస్త వింతగా, ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కొత్త కొత్త ఆవిష్కరణల్లో అదరగొట్టే జపాన్... తాజాగా తండ్రుల కోసం చనుపాలు పట్టించే ఓ అద్భుత పరికరాన్ని తయారుచేసింది. జపాన్‌కు చెందిన ‘దెంత్సూ’ అనే సంస్థ... తండ్రుల కోసం చనుపాలు పట్టే పరికరాన్ని తయారుచేసింది. ఈ పరికరాన్ని పురుషులు ఉదరభాగంలో ధరిస్తే... చాలు, ఎంచక్కా పిల్లలకు పాలు పట్టించవచ్చు. అచ్చం అమ్మ పాలు ఇచ్చినట్టుగా బిడ్డలను ఎదకు దగ్గరగా పెట్టుకుని, పాలు ఇవ్వొచ్చు. తల్లి పాలు తాగుతున్నట్టుగానే భ్రమించి, పిల్లలు బుద్దిగా పాలు తాగి బజ్జుంటారు. తల్లులను కోల్పోయిన పిల్లలతో పాటు తల్లులు వేరే పనుల్లో బిజీగా ఉన్నప్పుడు, ఆఫీసులకు వెళ్లే తల్లులకు కూడా ఈ గాడ్జెట్ ఎంతో ఉపయోగపడుతుందని తయారీదారులు చెబుతున్నారు.

ఈ గాడ్జెట్‌కు ‘ఫాదర్స్ నర్సింగ్ అసిస్టెంట్’ అనే పేరు పెట్టిన దెంత్సూ... ఇందులో సరిపడా పాలు నింపి, బ్యాగులా ధరిస్తే చాలని అంటోంది. ఇప్పటికే ఈ బ్రెస్ట్‌ఫీడింగ్ గాడ్జెట్ ఫర్ ఫాదర్‌ ప్రమోషన్ కోసం ప్రయోగాత్మకంగా కొందరు తండ్రులతో డెమో కూడా ఇప్పించింది. అయితే ఈ గాడ్జెట్ ధర ఎంత అనేది ఇంకా తెలియరాలేదు. అందుబాటులో ధరలో లభిస్తే మాత్రం... ఇక్కడి పురుషులకు కూడా ఎంతో ఉపయోగపడే గాడ్జెట్ ఇది.

First published: April 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు