పుల్లటి బొప్పాయి... ప్రత్యేకతలేంటి... చక్కటి వీడియో...

మన ప్రపంచంలో రకరకాల పండ్లు, కాయలూ ఉంటాయి. వాటిలో మనకు తెలిసినవి కొన్నే కావచ్చు. ఈ పుల్లటి బొప్పాయి విశేషాల్ని వీడియో ద్వారా తెలుసుకుందాం.

news18-telugu
Updated: January 20, 2020, 12:15 PM IST
పుల్లటి బొప్పాయి... ప్రత్యేకతలేంటి... చక్కటి వీడియో...
పుల్లటి బొప్పాయి... ప్రత్యేకతలేంటి... చక్కటి వీడియో... (credit - YT - Dianxi Xiaoge)
  • Share this:
Sour Papaya : సాధారణంగా బొప్పాయి తియ్యగా... గుజ్జుగుజ్జుగా ఉంటుంది కదా. ఇప్పుడు మనం చూడబోయేది పుల్లటి బొప్పాయి. మామూలు బొప్పాయి ఒక్కోటీ అరకేజీ నుంచీ రెండు కేజీల దాకా బరువు ఉంటాయి కదా... ఇవి చాలా చిన్నగా ఉంటాయి. ఒక్కోటీ మాగ్జిమం పావు కేజీ కూడా ఉండవు. చైనాలో కాసే ఈ పుల్లటి బొబ్బాయిలను అక్కడి ప్రజలు రోజూ తింటారు. మన దగ్గర పుల్లటి మామిడి పండును ఎలాగైతే.. ముక్కలు చేసి తింటామో... అలా వాళ్లు పుల్లటి బొబ్బాయిని ముక్కలు చేసి... దానికి కాస్త చక్కెర కలిపి... ఎండబెట్టి... డ్రై ఫ్రూట్స్‌లా తింటారు. అలాగే ఫ్రైలు, ఇతర వంటల్లో వాడుతారు. ఈ పుల్ల బొప్పాయిలు ఎంతో టేస్ట్, ఫ్లేవర్ కూడా ఉంటాయి. వాటిని తింటూ ఉంటే... కొబ్బరిలా కరకరలాడుతూ... నోరూరిస్తాయని చైనీయులు చెబుతుంటారు. చైనాలోని యున్నాన్‌లో ఈ పండ్ల పెంపకం ఎక్కువగా సాగుతోంది. అక్కడి ప్రజలకు నిమ్మకాయలు ఎంత ఇష్టమో... పుల్ల బొప్పాయిలు కూడా అంతే ఇష్టం. కింది వీడియోని చివరి వరకూ చూస్తే... పుల్ల బొప్పాయిల విశేషాలు, వాడకం వివరాలు తెలుస్తాయి.First published: January 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు