హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Health Tips: గొంతు నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలు పాటిస్తే చిటికెలో మాయం

Health Tips: గొంతు నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలు పాటిస్తే చిటికెలో మాయం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Health Tips: గొంతు నొప్పి సమస్య నుండి ఉపశమనం పొందేందుకు తేనె, నల్ల మిరియాలు వాడాలి. తేనెలో యాంటీ బయోటిక్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. గొంతు నొప్పితో పాటు ఇన్ఫెక్షన్ నుంచి ఇది కాపాడుతుంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  దసరా (Dussehra)  వెళ్లిపోయింది. మరికొన్ని రోజుల్లో దీపావళి  (Diwali)రాబోతోంది. అంటే చలికాలం మొదలవుతోంది. ఈ సీజన్ మారే సమయంలో  జలుబు, దగ్గు వంటి సమస్యలు వేధిస్తాయి. వీటితో పాటు  గొంతునొప్పి (Sore Throat ) అందరినీ వేధిస్తుంది. గొంతులో ఇన్ఫెక్షన్, మంట సరిగ్గా మాట్లాడలేకపోవడం వంటి ఇబ్బందులు వస్తాయి. దీనివల్ల జ్వరం, జలుబు. తలనొప్పివంటివి కూడా వస్తాయి. గొంతు నొప్పి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవి తగ్గడానికి పాటించవలసిన చిట్కాలు తెలుసుకుందాం.

  గుండె, బీపీ రోగులకు ఖర్జూరం ఒక వరం.. దీనివల్ల ఎన్ని ప్రయోజనాలంటే..

  గొంతు నొప్పి వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ (Infection), మంట చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. ఇలాంటి గొంతు నొప్పిని పోగొట్టేందుకు ఇంట్లో ఉండే పలు సహజసిద్దమైన ఔషధాలతో కషాయాన్ని (Infusion) తయారు చేసుకుని సేవిస్తే సరిపోతుంది. గొంతు నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది. గొంతు నొప్పిని తగ్గించే కషాయాలు తయారీ  విధానం గురించి తెలుసుకుందాం.

  Relationship Tips: మీరు గెలవాలనుకుంటున్నారా? ఈ 7 అలవాట్లను పాటిస్తే విజయం మీదే!

  గొంతు నొప్పి సమస్య నుండి ఉపశమనం పొందేందుకు తేనె, నల్ల మిరియాలు వాడాలి. తేనెలో యాంటీ బయోటిక్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. గొంతు నొప్పితో పాటు ఇన్ఫెక్షన్ నుంచి ఇది కాపాడుతుంది. తేనెలాగే నల్ల మిరియాలు కూడా గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఒక చెంచా తేనెలో చిటికెడు నల్ల మిరియాల పొడిని మిక్స్ చేసి రోజుకు రెండు, మూడు సార్లు తినండి. అల్లంలో (Ginger) ఎన్నో ఔషధగుణాలున్నాయి. గొంతు నొప్పి నుంచి తక్షణ విముక్తి కోసం అల్లం వాడటం మంచిది. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో అల్లం ముక్కలు వేసి బాగా మరిగించాలి. ఇలా మరిగించిన నీటిని వడగట్టి ఒక గ్లాసు తీసుకోని ఒక స్పూన్ తేనె (Honey) కలిపి తాగాలి. ఇలా చేయడంతో గొంతు నొప్పి త్వరగా నయమవుతుంది.

  మిరియాలు (Pepper), బాదంపప్పును (Almonds) కలిపి పొడి చేసుకొని ఈ మిశ్రమాన్ని నీటిలో కలిపి సేవించడం వల్ల గొంతునొప్పి తగ్గుతుంది. మిరియాల పొడిలో కొంచెం నెయ్యి కలిపి సేవిస్తే గొంతు నొప్పి నుంచి విముక్తి కలుగుతుంది. గొంతు నొప్పి ఉన్నప్పుడు ఇలాంటి కషాయాలను తాగండి. గొంతు నొప్పి నుంచి తొందరగా విముక్తి కలుగుతుంది. మీకు గొంతు నొప్పి చాలా ఇబ్బందిని కలిగిస్తుంటే సంబంధిత డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.

  (Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. వీటిని అమలుచేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.)

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Health, Health Tips, Life Style, Lifestyle

  ఉత్తమ కథలు