Home /News /life-style /

SOME EXPERT APPROVED SKINCARE TIPS TO BEAT HUMIDITY UMG GH

Monsoon Skincare Tips: చర్మ సమస్యలు వేధిస్తున్నాయా..? ఈ టిప్స్‌తో ప్రాబ్లమ్స్‌కు చెక్ పెట్టండి..!

చర్మ సమస్యలు వేధిస్తున్నాయా..?

చర్మ సమస్యలు వేధిస్తున్నాయా..?

వర్షాకాలంలో చర్మ సంరక్షణ (Skincare)పై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. వైద్య నిపుణుల ప్రకారం, ఈ సీజన్‌లో కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే చర్మ సమస్యలు దరిచేరకుండా జాగ్రత్తపడవచ్చు. మరి ఆ టిప్స్ (Tips) ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

వర్షాకాలం (Monsoon) మొదలైందంటే ప్రతిచోటా పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణం కనులవిందు చేస్తుంది. అయితే ఇదే వర్షాకాలం ఆరోగ్య సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది. జ్వరం, దగ్గు వంటి సమస్యలతోపాటు చర్మ సంబంధిత సమస్యలకు కూడా వానకాలం దారితీస్తుంది. అందుకే ఈ కాలంలో చర్మ సంరక్షణ (Skincare)పై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. వైద్య నిపుణుల ప్రకారం, ఈ సీజన్‌లో కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే చర్మ సమస్యలు దరిచేరకుండా జాగ్రత్తపడవచ్చు. మరి ఆ టిప్స్ (Tips) ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

* వర్షాకాలంలో చర్మ సంరక్షణ

- ఈ కాలంలో చర్మం వాతావరణం నుంచి అవసరానికి మించి తేమను గ్రహిస్తుంది. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని, మీ చర్మ రకాన్ని బట్టి తేలికైన మాయిశ్చరైజర్‌ను వాడటం మంచిది.

- చాలా ఎక్కువగా చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసే సిరామైడ్ మాయిశ్చరైజర్లను ఉపయోగించకూడదు. అందుకు బదులుగా తేలికపాటి జెల్ ఆధారిత ప్రొడక్ట్స్ వాడాలి.

- ఈ కాలంలో చర్మ రంధ్రాలు మూసుకుపోయే అవకాశమెక్కువ. అందుకే తేమను తొలగించడానికి కొంచెం బలమైన ఫేస్‌వాష్ ఉపయోగిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

- గ్లైకోలిక్, సాలిసిలిక్ యాసిడ్ ఫేస్‌వాష్‌లు మొటిమల బారినపడే చర్మానికి బాగా పనిచేస్తాయి. గ్లుటాతియోన్ (Glutathione) గల ఫేస్‌వాష్ కాంబినేషన్ కూడా చర్మానికి మంచి చేస్తుంది.

ఇదీ చదవండి: గేమింగ్ లవర్స్ కు పెద్ద షాక్.. మరో గేమ్ ను బ్యాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ !


- ఈ సీజన్‌లో ఎండలు ఎక్కువగా బాధించవు కానీ చర్మాన్ని రక్షించుకోవాలంటే సన్‌స్క్రీన్లు తప్పక వాడాల్సిందే. పౌడర్ లేదా జెల్ ఆధారిత సన్‌స్క్రీన్లు ఈ కాలంలో చర్మాన్ని బాగా కాపాడతాయి. వర్షాకాలంలో వాటర్‌ప్రూఫ్, వాటర్ రెసిస్టెంట్ సన్‌స్క్రీన్‌ని వాడటం ఉత్తమం.

- ఈ కాలంలో ఎక్స్‌ఫోలియేటివ్ స్క్రబ్‌లు చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. చర్మ రకాన్ని బట్టి ఎక్స్‌ఫోలియెంట్లను వాడవచ్చు. వీటితో డెడ్ స్కిన్‌ను వదిలించుకోవచ్చు. పైచర్మం మిలమిలా మెరవడానికి ఎక్స్‌ఫోలియేటివ్ స్క్రబ్‌లు బాగా పనిచేస్తాయి.

- వర్షాకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే రకరకాల ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు, స్కిన్ అలెర్జీలు, తామర వంటి సమస్యలు తలెత్తుతాయి. బాగా చెమట పోసే శరీరభాగాల్లో చర్మ సమస్యలు వచ్చే అవకాశమెక్కువ. అందుకే ఈ శరీరభాగాలకు ప్రతిరోజూ రెండుసార్లు మంచి యాంటీ ఫంగల్ డస్టింగ్ పౌడర్‌ను రాసుకోవాలి. అలాగే చెమట ఎక్కువగా పట్టకుండా చాలా వదులుగా ఉండే దుస్తులు ధరించాలి.



* ఈ కాలంలో మేకప్ మంచిదేనా

- వర్షాకాలంలో మేకప్ ఎంత తక్కువగా వేసుకుంటే అంత మంచిది. హెవీ కన్సీలర్లు లేదా ప్రైమర్లను ఉపయోగిస్తే ఇబ్బందులు తప్పవు. ఈ కాలంలో ఏ మేకప్ ప్రొడక్ట్స్ అయినా సరే చాలా తేలికైనవి వాడటం ఉత్తమం.

- ఐలైనర్ల పట్ల కూడా జాగ్రత్త వహించాలి. ఈ కాలంలో ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు కాబట్టి వాటర్‌ప్రూఫ్‌ ఐలైనర్లు ఉపయోగిస్తే బెటర్. వాటర్‌ప్రూఫ్‌ ఐలైనర్లు అయినా ఈ కాలంలో వీటిని ఎక్కువసేపు కళ్లపై ఉంచుకోకుండా మైకెల్లార్ వాటర్ క్లెన్సర్లు, ప్యాడ్‌లను ఉపయోగించి తొలగించడం మంచిది.

- ఆస్ట్రింజెంట్‌ కెమికల్స్‌ గల హైడ్రేటింగ్ లేదా ఎక్స్‌ఫోలియేటివ్ టోనర్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

- యాంటీ ఏజింగ్ కోసం రెటినోల్ (Retinol) వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
Published by:Mahesh
First published:

Tags: Beauty, Beauty tips, Monsoon, Skin care

తదుపరి వార్తలు