సింగిల్‌గా ఉంటున్న అబ్బాయిలూ.. ఈ ప్రాబ్లమ్స్ తప్పవు మీకు..
అదేపనిగా సోషల్ మీడియా వాడితే అనర్థాలు తప్పవంటున్నారు నిపుణులు. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా ఎఫెక్ట్ తప్పదు.. అమ్మాయిల విషయంలో మరీ ఎక్కువగా ఉంటుందని తేల్చిన నిపుణులు.
పెళ్ళి చేసుకోని పురుష పుంగవులు 60ఏళ్లకు మించి బతకడం లేదు.. మరీ.. ముఖ్యంగా మధ్యవయసులోని వారు ఒంటరిగా ఉండొద్దు..
సాధారణంగా పెళ్ళిళ్లపై చాలా జోకులు పేలుతుంటాయి.. వాటిని చాలా చాలామంది తెగ ఎంజాయ్ చేస్తుంటారు.. పైగా అవన్నీ అనుభవపూర్వకంగా చెబుతున్నామంటూ మరింత వినోదాన్ని యాడ్ చేస్తారు..
అయితే.. అవి కాస్తా జోకుల వరకే వదిలేస్తే బెటరంటున్నారు పరిశోధకులు. నిజజీవితంలో ఈ ఫార్మూలాని అన్వయిస్తే అంతేసంగతులంటూ హెచ్చరిస్తున్నారు.
పెళ్ళి చేసుకోని పురుష పుంగవులు 60ఏళ్లకు మించి బతకడం లేదని తేల్చి చెప్పారు. మరీ.. ముఖ్యంగా మధ్యవయసులోని వారు ఒంటరిగా ఉండొద్దని చెబుతున్నారు.
దీనికి కారణం లేకపోలేదు.. పురుషులకి 40ఏళ్ళు పడగానే ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గుతుంది. ఆ సమయంలో వారిని పక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకునే వారు లేకపోతే.. ఒంటరితనం పెరుగుతుంది.. ఈ ప్రభావం వారి ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఈ కారణంగా ఏవేవో జబ్బులు దాడి చేసి వారి ఆయుష్షుని అర్ధాయుష్షుగా మార్చుతాయని చెబుతున్నారు.
అదే మహిళల విషయం వచ్చేసరికి.. వారికి మొదట్నుంచీ ఆరోగ్యంపై శ్రద్ధ ఉంటుందని.. ఒకవేళ ఏదైనా అనారోగ్యం వచ్చినా.. వారికివారు దాన్నుంచి భయటపడే నేర్పరితనం కలిగిఉంటారని తెలిపారు..
సో.. సోలో లైఫే సో బెటరంటున్న పురుషుల్లారా.. మేల్కొని ఇప్పటికైనా మీ జీవితభాగస్వామిని జీవితంలోకి ఆహ్వానించండి..
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.