• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • SOCIETY LEARNS TO ACCEPT INTER CASTE AND INTER FAITH MARRIAGES HERE THE DETAILS SRD SWPB

Inter Caste Marriage : కులాంతర వివాహాలపై మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు..?

Inter Caste Marriage : కులాంతర వివాహాలపై మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు..?

ప్రతీకాత్మక చిత్రం

భారతదేశంలో చాలా సంప్రదాయ కుటుంబాలలో కులాంతర వివాహాలను ప్రోత్సహించరు. కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలకి సమాజంలో ఎంతో వ్యతిరేకత ఉంది. వారు ఎంతో విమర్శని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ వివాహాలు చేసుకున్న వారిని చులకనగా చూస్తారు.

  • Share this:
    ప్రశ్న : కులాంతర వివాహాలపై మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు..?

    సమాధానం :

    భారతదేశంలో చాలా సంప్రదాయ కుటుంబాలలో కులాంతర వివాహాలను ప్రోత్సహించరు. కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలకి సమాజంలో ఎంతో వ్యతిరేకత ఉంది. వారు ఎంతో విమర్శని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ వివాహాలు చేసుకున్న వారిని చులకనగా చూస్తారు. అసలు ప్రేమ వివాహాలే మన దగ్గర తక్కువ అనుకుంటే, కుల, మత పట్టింపులు లేని వివాహాలు ఇంకా అరుదు. ఈ వివాహాలు చేసుకుందామనుకున్న, చేసుకున్న జంటలు ఇంట్లో వారితో కూడా ఎన్నో విషయాల గురించి పోరాడవలసి ఉంటుంది. ఎక్కడో నూటికో, కోటికో ఒక్కరికి ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు ఈ పిల్లల ఇష్టాలని పరిగణనలోకి తీసుకుని వారికి ఇష్టమైన వ్యక్తిని వివాహం చేసుకోవడానికి సమ్మతిస్తారు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు ఒప్పుకున్నా కూడా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు వ్యతిరేకంగా ఉంటారు. ఈ పోరాటాల్లో ఈ యువతీ యువకులు అలిసిపోతారు. అయినా కూడా ఆ అలసట పైకి కనిపించకుండా వారి నిర్ణయం పట్ల గౌరవంతో విశ్వాసంతో నిలబడవలసి ఉంటుంది. పూర్తిగా వేరే సాంప్రదాయానికి చెందిన వ్యక్తిని పెళ్ళి చేసుకోవడం వలన విశాల దృక్పధం అలవాటవుతుంది. ఏ విషయాన్నైనా కొత్త కోణంలో చూడడం, అర్ధం చేసుకోవడం తెలుస్తాయి.

    కొంత మంది అసలు మొదట్లో కులాంతర, మతాంతర వివాహాలు చేసుకోవాలన్న ఉద్దేశ్యం లో ఉండరు కూడా. కానీ ఇష్టపడిన వ్యక్తులు వేరే కులానికో మతానికో చెందిన వారని ఇష్టాలు మార్చుకోలేరు కదా. కొన్ని ఫ్యామిలీస్ లో వీరికి ఎలాంటి సపోర్ట్ ఇవ్వకపోతే వీరే దారికొస్తారులే అనుకుని ఈ పిల్లలకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వరు. వారితో మాట్లాడడం, వారిని కలవడం అన్నీ మానేస్తారు. కానీ మనస్సులు కలిస్తే వారి ఏం చేస్తారు. పెళ్లి ద్వారా రెండు కులాలు కలుస్తున్నాయంటే అదొక సామాజిక వేడుక కావాలి. అంతరాలను అంతం చేసే ఆ ముందడుగును స్వాగతించాలంటూ ఇటీవల సుప్రీం కోర్టు తీర్పునించింది. ఇకనైనా ఈ సామాజిక రుగ్మతలను దాటి ఎదిగిన బిడ్డల స్వేచ్ఛని గౌరవిస్తారో లేదో చూడాలి.
    Published by:Sridhar Reddy
    First published: