Health Tips : సోషల్ మీడియా వాడే అమ్మాయిలకి ఈ సమస్యలు తప్పవు..

ప్రతీకాత్మక చిత్రం

తగ్గిన ఇంటర్నెట్ ఛార్జీల పుణ్యమా అని ప్రతీఒక్కరూ సోషల్ మీడియాని తెగ వాడేస్తున్నారు. అయితే, దీనివల్ల లాభాలతో పాటు ఎన్నో సమస్యలున్నాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో సోషల్ ప్రభావం అధికంగా ఉంటుందని.. దీని వల్ల కలిగే అనర్థాలు అధికమని చెబుతున్నారు.

  • Share this:
ఉదయం లేచింది మొదలు పడుకునేసరికి ప్రతీ పని సోషల్ మీడియాలో పెట్టడం ఈ మధ్య కామన్ అయిపోయింది. సెల్ఫీలు తీయడం పోస్ట్ చేయడం వచ్చిన లైక్స్, కామెంట్స్‌తో కాలం గడిపేయడం నేటి యూత్‌కి ఇదే పనిగా మారింది. అయితే, ఇది హద్దులో ఉంటే పర్లేదు. కానీ, అదేపనిగా ఉంటే అనర్థాలు తప్పవంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆడపిల్లలు రోజురోజుకీ సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయి లేని పోని రోగాలు కొని తెచ్చుకుంటున్నారని చెబుతున్నారు.
సెల్ఫీలు దిగడం సోషల్ మీడియాలో పెట్టడం ఒకరినీ చూసి మరొకరు.. పక్కవారికి ఎక్కువ కామెంట్స్, లైక్స్ వచ్చాయంటూ బాధపడడం.. దీనివల్ల ఒత్తిడి, అశాంతి, ఒంటరితనం, డిప్రెషన్ వంటి అనారోగ్య సమస్యలన్నీ చుట్టుముడతాయి.

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఆడపిల్లలు, మగపిల్లల మీద ఎంత ప్రభావాన్నిచూపుతుందన్న విషయంపై ఓ అధ్యయనం జరిగింది. ఇందులో స్పష్టమైన విషయమేంటంటే.. మగపిల్లలతో పోలిస్తే ఆడడపిల్లలమీదే దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని తేలింది.


సోషల్ మీడియా వాడే ఆడపిల్లలు భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కాబట్టి.. ఇప్పటికైనా సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించడం మేలని సూచిస్తున్నారు.
First published: