Rice water benefits: రైస్‌ వాటర్‌తో ఇది కలిపి తీసుకుంటే అద్భుత ప్రయోజనాలు!

ప్రతీకాత్మక చిత్రం

Health benefits with rice water: బియ్యం నీటిలో ఖనిజాలు ఉంటాయి. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్‌లను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది.

  • Share this:
మన పెద్దలు అన్నం గంజిలో కాస్త ఉప్పు, మజ్జిగ వేసి తినిపించేవారు. ఇది శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ముఖ్యమైన ఆహార పదార్థాల్లో బియ్యం ఒకటి. రక్తంలో చక్కెర, గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ (digestive system) , ఇతర ప్రయోజనాలకు ఇది ముఖ్యం. అదేవిధంగా బియ్యం కడిగిన నీటి (Rice water) వల్ల కలిగే ఉపయోగాలు ఇటీవల కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలిసాయి.

బియ్యం నానబెట్టిన నీటిని నీటిని ఆ తర్వాత ఏం చేస్తాం అని పారబోస్తారు. ఎందుకంటే ఈ నీరు మంచిది కాదని ఒక అపోహ. కానీ, ఇది పోషకాల మిశ్రమం. చర్మం, జుట్టు సంరక్షణలో (hair protection) ముందు వరుసలో నిలుస్తుంది. ఇది పేగు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

బియ్యం నీటి ప్రయోజనాలు..

  • మెరిసే, ఆరోగ్యకరమైన జుట్టు..
    క్లీవ్‌ల్యాండ్‌ క్లీనిక్‌ ప్రకారం బియ్యం నీరు ఇనోసిటాల్‌కు చెందిన గొప్ప మూలం. ఇది జుట్టు అందాన్ని పెంచే యాంటీ ఆక్సిడెంట్స్‌తోపాటు జింక్, మెగ్నీషియం, విటమిన్‌ బీ,ఇ పోషకాలు ఉంటాయి. ఇది మీ జుట్టు కుదుళ్లకు కూడా చాలా ప్రయోజనాలు కలిగిస్తుంది.


ఇది కూడా చదవండి:  ఈ డ్రింక్స్‌తో ఈజీగా వెయిట్‌ తగ్గొచ్చు!



  • జీర్ణక్రియ..
    బియ్యం నీటిలో ఫైబర్‌ కంటెంట్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన పేగు కదలికను ప్రోత్సహిస్తుంది. జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది.




  • శక్తిపెంపు..
    దీర్ఘకాలిక అలసట ఉన్నవారికి ఉడుకుతున్న రైస్‌ నుంచి ఒక గ్లాస్‌ రైస్‌ వాటర్‌ తీసుకుంటే మీకు శక్తినివ్వడానికి సహాయపడుతుంది. పనిలో లేదా పాఠశాలలో స్నేహితులతో మరింత చురుగ్గా ఉండాల్సిన సమయంలో ఈ నీరు తాగితే.. ఆరోగ్యకరమైన, కెఫిన్‌ లేని శక్తినిస్తుంది.

  • వృద్ధాప్యాన్ని నిరోధించే గుణం..
    బియ్యం నీటిలో అమైనో యాసిడ్స్, న్యూట్రియేంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉంటాయి. ఇది మీ చర్మాన్ని పొడిగా చేసి యాంటీ ఏజింగ్‌ పదార్థాలు కూడా కలిగి ఉంది. బియ్యం నీటిని ఉపయోగించడం వల్ల చర్మ కాంతిని కాపాడుతుంది.


ఇది కూడా చదవండి: ‘స్క్విడ్‌ గేమ్‌’లోని ఈ కాస్ట్యూమ్స్‌ కోసం తెగ వెతుకుతున్నారట!



  • హైడ్రేషన్‌..
    బియ్యం నీటిలో ఖనిజాలు ఉంటాయి. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్‌లను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. వాతావరణ పరిస్థితుల్లో ప్రయోజనకరమైన, అవసరమైన పోషకాలను కోల్పోకుండా హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సహాయపడుతుంది. అతిసారంతో బాధపడుతున్నవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే వారి శరీరంలో నీరు తక్కువగా ఉంటుంది. ఇది సమతుల్యం చేసి, అలసటను తగ్గిస్తుంది.

Published by:Renuka Godugu
First published: