Health benefits: 'నైట్‌షేడ్‌' వెజిటేబుల్స్‌తో అద్భుతమైన ఆరోగ్యం!

ప్రతీకాత్మక చిత్రం

Health benefits with night shed vegetables: నైట్‌షేడ్‌ కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు (anti oxidants) ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో టాక్సిన్స్‌కు కారణమవుతాయి.

  • Share this:
ఈ నైట్‌షేడ్‌ వెజిటేబుల్స్‌ ఎక్కువగా తినడం వల్ల కీళ్లనొప్పులు వస్తాయని అపోహలు అందరిలో ఉన్నాయి. కానీ, ఇది తప్పని వైద్యులు అంటున్నారు. దీనికి లాటిన్‌ పేరు 'సోలనేసియే'. నైట్‌షేడ్‌ వెజిటేబుల్స్‌ అంటే ఏంటి? వాటి ప్రయోజనాలు ఏంటో చూద్దాం.

టమాట (Tomato) , వంకాయ, బెల్‌ పెప్పర్స్, బంగాళదుంపలు వంటి కూరగాయలు. నైట్‌షెడ్‌ కూరగాయల్లో ఆల్కలాయిడ్‌ అనే నైట్రోజన్‌ (Nytrozen) ఉంటుంది. ఇది ఒక సమ్మేళనం. ఈ సమ్మేళనం నైట్‌షేడ్‌ కూరగాయల ఆకులు, కాండంలో కనిపిస్తుంది.

చాలా నైట్‌షేడ్‌ కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు (anti oxidants) ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో టాక్సిన్స్‌కు కారణమవుతాయి. ఇది ఆక్సీకరణకు కారణమవుతుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్లే వంకాయను ఊదా రంగుగా మారుస్తాయి.

టమాటాల్లో లైకోపీన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ ఉంటుంది. ఇది కేన్సర్ (cancer) , గుండె జబ్బు, మధమేహం అభివృద్ధి చెందే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇతర కూరగాయల మాదిరిగానే నైట్‌షేడ్‌ కూరగాయలు శరీరానికి అవసరమైన ఖనిజాలు, విటమిన్లను అందిస్తాయి.

ఇది కూడా చదవండి:  అనుకుంటే.. 40 ఏళ్లకూ బరువు తగ్గడం సాధ్యమే!

ప్రమాదకరమైన కూరగాయలు..
ఈ నైట్‌షేడ్‌ కూరగాయల చుట్టూ అనేక అపోహలు తిరుగుతున్నాయి. ఇది హానికరం, విషపూరితం కావడం వల్ల శరీరంలో కీళ్లనొప్పులు వంటి వ్యాధులు వస్తాయని అనుకుంటారు. బంగాళదుపంల్లో ఉండే ఆల్కలాయిడ్‌ ‘సోలనైన్‌’ సూర్యరశ్మి తాకినపుడు వాటికి ఆకుపచ్చగా మారుస్తుంది.

అందుకే బంగాళదుంపలు పచ్చగా ఉంటే తినవద్దు అంటున్నారు. ఇవి నిజమా? కాదా? అని పరిశీలిస్తే..తప్పేమో అనిపిస్తుంది. కూరగాయల్లో ఎలాంటి టాక్సిన్స్‌ ఉండవు. అయితే, వీటిని ఎక్కువగా ఆహారంలో చేర్చుకోకపోవడమే మంచిది. అయితే, వంకాయ, టమాటాల్లో ఆల్కలాయిడ్స్‌ తక్కువ స్థాయిలో ఉండవచ్చు. అయితే, ఇవి శరీరానికి హానికరం కాదు.

ఇది కూడా చదవండి:  పండగపూట..ప్రత్యేకపూలతో ఫ్యాషన్‌ జడ!

నైట్‌షేడ్‌ కూరగాయలు తినవచ్చా? లేదా?..
నైట్‌షేడ్‌ కూరగాయలు కొందరిలో అలర్జీని కలిగిస్తాయి. కాబట్టి, నైట్‌షేడ్‌ వెజిటేబుల్స్‌ తినడానికి ముందు మీ శరీరం ఏదైనా నైట్‌షూడ్‌ కూరగాయలపై స్పందిస్తుందా? లేదా? అని పరీక్షించాలి.

నైట్‌షేడ్‌ వెజిటేబుల్స్‌ అలర్జీల వల్ల కలిగే కొన్ని సాధారణ లక్షణాలు వాపు, దద్దుర్లు, కళ్లు దురద, వికారం, తలనొప్పి, శ్వాస ఆడకపోవడం, ఛాతి బిగుతు, చర్మశోథ. కాబట్టి పేషంట్లు, గర్భిణులు, సర్జరీ చేసుకున్నవాళ్లు నైట్‌షేడ్‌ వెజిటేబుల్స్‌ తినకూడదు. డాక్టర్లను సంప్రదించిన తర్వాతే తినడం ఉత్తమం.
Published by:Renuka Godugu
First published: