సుఖంగా నిద్ర పట్టాలంటే...అలసిపోయేలా శృంగారం చేయడమే పరిష్కారం...

శృంగారం చేయకపోవడం వల్ల శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ కారణంగా నిద్ర పట్టదు. దీంతో నిద్రలేమితో శరీరం ఒత్తిడికి లోనవుతుంది. అదే శృంగార ప్రక్రియను సరిగ్గా చేస్తే శరీరంలో ఆక్సిటోసిన్ విడుదలవుతుంది.

news18-telugu
Updated: October 23, 2019, 10:33 PM IST
సుఖంగా నిద్ర పట్టాలంటే...అలసిపోయేలా శృంగారం చేయడమే పరిష్కారం...
ప్రతీకాత్మక చిత్రం (News18 bangla)
  • Share this:
సుఖ నిద్ర కోసం ఎంతో మంది పరితపిస్తుంటారు. అంతే కాదు నిద్ర కోసం స్లీపింగ్ పిల్స్ తీసుకోవడం లాంటి ప్రమాదకరమైన అలవాట్లు సైతం చేసుకుంటారు. అయితే సుఖనిద్రకు చక్కటి పరిష్కారం శృంగారం మాత్రమే అని నిపుణులు సెలవిస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది శారీరక వ్యాయామానికి దూరంగా అవ్వడం వల్ల నిద్ర సరిగ్గా పట్టడం లేదని కంప్లైంట్స్ ఇస్తుంటారు. అయితే శృంగారం చేయడం ద్వారా ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా శృంగారం చేయకపోవడం వల్ల శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ కారణంగా నిద్ర పట్టదు. దీంతో నిద్రలేమితో శరీరం ఒత్తిడికి లోనవుతుంది. అదే శృంగార ప్రక్రియను సరిగ్గా చేస్తే శరీరంలో ఆక్సిటోసిన్ విడుదలవుతుంది. దాని ద్వారా శరీరం రిలాక్స్ అవుతుంది. దీంతో చక్కగా సుఖనిద్ర లభిస్తుంది. ఆక్సిటోసిన్ అటు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో రిల్సాక్సేషన్ అందించే హార్మోన్. అందుకే తరచూ సెక్స్ చేస్తే, ఆ రాత్రి మంచి నిద్ర పడుతుందని ప్రఖ్యాత సెక్స్ స్పెషలిస్ట్ డాక్టర్ లారీ మింట్జ్ సెలవిస్తున్నారు.

అంతే కాదు వయస్సు రీత్యా శృంగారం అనేది మంచి వ్యాయామమని కూడా డాక్టర్ లారీ చెబుతున్నారు. ముఖ్యంగా జిమ్ లో చేసే కసరత్తుల ఫలితంగా శరీరం అలసట పొంది, నిద్ర పట్టే అవకాశం ఉన్నప్పటికీ, వయస్సు పెరిగే కొద్దీ, జిమ్ లో కసరత్తుల ఫలితంగా కీళ్ల నొప్పులు, వచ్చే అవకాశం ఉందని తేల్చుతున్నారు. అలాగే ఎక్కువగా జాగింగ్, రన్నింగ్ చేసినా మోకాలు నొప్పులు వచ్చే అవకాశం ఉందని, అందుకే శృంగారం చేస్తే ఇతర సమస్యలు ఉండవని, అలాగే శరీరానికి ఉపయోగపడే హార్మోన్స్ విడుదలయ్యే అవకాశం ఉందని తేల్చారు.

First published: October 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>