ఆఫీస్‌లో కునుకు తీస్తే... ఆరోగ్యానికి మంచిదే... మరి బాసులకో...????

Sleep on the Job : ఆఫీస్‌లో నిద్రపోతున్నారా? పని చేస్తుంటే నిద్ర వచ్చేస్తోందా... అలాంటప్పుడు కాసేపు కునుకు తియ్యడమే మంచిదట. ఎందుకో తెలుసుకోండి మరి.

Krishna Kumar N | news18-telugu
Updated: February 17, 2019, 11:46 AM IST
ఆఫీస్‌లో కునుకు తీస్తే... ఆరోగ్యానికి మంచిదే... మరి బాసులకో...????
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: February 17, 2019, 11:46 AM IST
ఈ రోజుల్లో మనమంతా బిజీ బిజీగా గడుపుతున్నాం. క్షణం తీరికలేని పరిస్థితులు. ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా... అందరమూ బిజీగానే ఉంటున్నాం. ఎంత బిజీ అంటే కంటినిండా నిద్రకూడా నిద్రపోలేకపోతున్నారు చాలా మంది. నిద్రపోవాల్సిన సమయంలో నిద్రపోకపోతే, ఆ నిద్ర... ఇతర సమయాల్లో వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. అంటే శరీరం విశ్రాంతిని కోరుకుంటుందన్నమాట. చాలా మందికి ఆఫీస్‌లోనో, ఇతర పనులు చేసేటప్పుడో నిద్ర మైకం ముంచుకొస్తుంది. కొందరికి మధ్యాహ్నం భోజనం తర్వాత మత్తుగా అనిపిస్తుంది. అలాంటప్పుడు బలవంతంగా ఆ నిద్రను ఆపుకోవడం కంటే... ఓ పావు గంటో, అరగంటో నిద్రపోవడం మంచిదంటున్నారు పరిశోధకులు. అది ఆరోగ్యకరమే కాదు... చేసే పనిలో వేగాన్ని కూడా పెంచుతుందట.

1. అలసట వల్ల పనిలో వేగం తగ్గుతుంది : నిద్ర వస్తున్నా ఆపేసుకొని పని చేస్తే ఏమవుతుంది... పనిలో వేగం తగ్గుతుంది. పనిని సక్రమంగా చెయ్యలేం. ఒకటి చెయ్యబోయి, మరొకటి చేస్తాం. మైకం కమ్మేస్తుందన్నమాట. అందువల్ల ఆ నిద్రేదో నిద్రపోతే, ఇక ఆ తర్వాత యమ స్పీడుగా పనిచేస్తామని పరిశోధకులు తేల్చారు. తమ పరిశోధన వివరాల్ని నేచర్ న్యూరోసైన్స్‌‌లో రాశారు. మధ్యాహ్నం వేళ అరగంట నిద్రపోయేవాళ్లు ఆ తర్వాత వేగంగా పనిచేస్తున్నారట. అదే గంటపాటు నిద్రపోయినవాళ్లైతే... ఇదివరకటి కంటే ఎక్కువ వేగంతో పనిచేస్తున్నారని తేలింది.

Productivity, Sleep, Wellness, Health Work, nap at work, sleep at work, benefits of nap at work place, ఆఫీస్ లో నిద్ర, మధ్యా్హ్నం వేళ నిద్ర, కునుకు తీస్తే మంచిదే
ప్రతీకాత్మక చిత్రం


2. కునుకు తీస్తే ఒత్తిళ్లు మాయం : మధ్యాహ్నం వేళ కాసేపు నిద్రపోతే... రిలాక్స్ ఫీల్ కలుగుతుందట. ఎక్కువ సేపు అక్కర్లేదు. జస్ట్ అలా కాసేపు (పావుగంట) కళ్లు మూస్తే చాలు... మానసికంగా ఎంతో స్ట్రెస్ రిలీఫ్ కలుగుతుందట. ఒత్తిళ్ల మధ్య మనం ప్రశాంతంగా పనిచెయ్యలేం. అదే నిద్రపోయి లేస్తే... పనిలో దూసుకుపోతామంటున్నారు సైంటిస్టులు. ఒత్తిడి తగ్గితే, పని చెయ్యాలనే మూడ్ పెరుగుతుందట.3. కునుకు వల్ల పెరిగే ఏకాగ్రత : చాలా రోడ్డు ప్రమాదాలకు కారణమేంటి... నిద్రమత్తులో చేసే డ్రైవింగే. నిద్ర వస్తే నిద్రపోవాల్సిందే. దాన్ని ఆపితే, అన్నీ అనర్థాలే అంటున్నారు డాక్టర్లు. ముఖ్యంగా పనిపై శ్రద్ధ తగ్గి, ఏకాగ్రత కోల్పోతామని చెబుతున్నారు. మధ్యాహ్నం వేళ నిద్రపోయేవాళ్లు పనిలో తక్కువ తప్పులు చేస్తారట. కనీసం 20 నిమిషాలు నిద్రపోయినా మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు.

4. కునుకుతో మెమరీ పెరుగుతుంది : చాలా మంది చిన్న చిన్న అంశాలు కూడా మర్చిపోతుంటారు. కారణం వాళ్లు సరిగా నిద్రపోకపోవడం వల్లే. చక్కటి నిద్ర మెమరీ పవర్‌ను పెంచుతుంది. అంతేకాదు... అన్ని విషయాలూ తెలుసుకునే చొరవ కలిగిస్తుంది. నిద్ర సరిపోని వాళ్లు దేనికీ ఆసక్తి చూపరు. ప్రతీదీ లైట్ తీసుకోవడానికి ఇష్టపడతారని పరిశోధనల్లో తేలింది. 45-60 నిమిషాలు మధ్యాహ్నం వేళ కునుకు తీస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని జర్మనీలోని సార్లాండ్ యూనివర్శిటీ పరిశోధకులు తేల్చారు.

Productivity, Sleep, Wellness, Health Work, nap at work, sleep at work, benefits of nap at work place, ఆఫీస్ లో నిద్ర, మధ్యా్హ్నం వేళ నిద్ర, కునుకు తీస్తే మంచిదే
ప్రతీకాత్మక చిత్రం
Loading...
5. కునుకుతో సృజనాత్మకత పెరుగుతుంది : నిద్ర చాలకపోతే... మైండ్ సరిగా ఆలోచించలేదు. అందువల్ల క్రియేటివ్ ఆలోచనలు తగ్గిపోతాయి. కునుకు వల్ల కుడి మెదడు చురుగ్గా తయారవుతుంది. తద్వారా సృజనాత్మక పెరుగుతుంది. అదే సమయంలో ఎడమ మెదడు ఎనలిటిక్స్ (విశ్లేషణలు) బాగా చేస్తుంది. హార్వార్డ్ మెడికల్ స్కూల్, యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధనల్లో ఈ విషయాలు బయటపడ్డాయి. ఆలోచనా పరిధి పెరగాలంటే... మధ్యాహ్నం వేళ కునుకు తియ్యాల్సిందే అంటున్నారు పరిశోధకులు.

అంతా బాగానే వుంది కానీ... అలా పడుకుంటే బాసులు ఊరుకుంటారా... అన్నదే అసలు ప్రశ్న. కచ్చితంగా ఊరుకోరు. ఎందుకంటే ఇలాంటి పరిశోధనలు, వాటి ఫలితాలపై వాళ్లకు పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు. వాళ్లను ఒప్పించుకోవాలి. పరిశోధనల ఫలితాలను వాళ్లకు వివరించాలి. తద్వారా మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకొని... పనిలో వేగాన్ని పెంచుకోవాలి. అప్పుడు అందరికీ మేలే.

ఇవి కూడా చదవండి -


#HealthTips: పల్లీలు తింటే హార్ట్ ఎటాక్ రాదట..


సెక్స్ సామర్థ్యాన్ని పెంచే హిమాలయన్ వయాగ్రా...‘యర్సాగుంబా’ పడక సుఖానికి ప్రకృతి వైద్యం...


#HealthTips: బ్లడ్ క్యాన్సర్‌ని తగ్గించే విటమిన్ సి ఇంజెక్షన్

First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...