వర్షాకాలంలో చర్మాన్ని ఇలా కాపాడుకోండి..

వానలు పడుతున్నప్పుడు బూట్లు, సాక్సులు ధరించకపోవడం మంచింది. వాటితో ఇన్ ఫెక్షన్ వచ్చే ప్రమాదముంది.

Shiva Kumar Addula | news18
Updated: August 17, 2019, 6:27 AM IST
వర్షాకాలంలో చర్మాన్ని ఇలా కాపాడుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
 • News18
 • Last Updated: August 17, 2019, 6:27 AM IST
 • Share this:
వర్షాకాలం మొదలైంది. రుతుపవనాల జోరుతో యావత్ దేశం పులకరించిపోతోంది. చిరుజల్లులను అందరూ ఆస్వాదిస్తున్నారు. ఐతే ఈ వర్షాలు, చల్లని వాతావరణం చర్మ సంబంధ సమస్యలను తీసుకొస్తుంది. గాల్లో తేమ పెరగడం వలన చర్మ, శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయి. ఇన్ ఫెక్షన్లతో చర్మ సౌందర్యం దెబ్బతింటుంది.అందుకే ఇంట్లోనే ఉండే వారైనా, ఆఫీసు పనులకు బయటకు వెళ్లే వారైనా ఈ సీజన్ లో అప్రమత్తంగా ఉండాలి. వానా కాలంలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండకూడదంటే కొన్ని జాగ్రత్తలు అవసరం.

వానాకాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు :


  1. వర్షా కాలంలో మేకప్ ఎక్కువగా వేసుకోకూడదు. ఒక వేళ వేసుకున్నా నీటితో కడిగితే పోయేలా జాగ్రత్త పడాలి.

  2. వానలు పడుతున్నప్పుడు బూట్లు, సాక్సులు ధరించకపోవడం మంచింది.  వాటితో ఇన్ ఫెక్షన్ వచ్చే ప్రమాదముంది.3. ఉదయం, సాయంత్రం చన్నీటితో ముఖాన్నిశుభ్రం చేసుకోవాలి. అలా చేస్తే ముఖంపై పేరుకుపోయిన జిడ్డు తొలగిపోతుంది.
  4. కఠినమైన ఫేస్ వాష్ కు బదులు తేలికపాటివి ఉపయోగిస్తే చర్మం మ్రుదువుగా ఉంటుంది.
  5. వారానికి కనీసం ఒక్క సారైనా టోనింగ్ చేయడం వలన చర్మం పేరుకుపోయిన మలినాలను నిర్మూలించవచ్చు.

  6. రోజుకు 8-10 గ్లాసుల నీళ్లు తాగడం వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. తాజాగా కనిపిస్తుంది.

  7. కేవలం వేసవిలో మాత్రమే కాదు వానా కాలంలోనూ సన్ స్క్రీన్ లోషన్ను ఉపయోగించడం మంచింది.

  8. బయటి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్లను గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

  9.  వానా కాలంలో నీటి కాలుష్యమయ్యే అవకాశాలు ఎక్కువ. కాచి చల్లార్చిన నీటిని తాగడం శ్రేయస్కరం.
First published: August 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading