SKIN CARE TIPS FOR MEN TO TAKE CARE HARD SKIN IN MONSOON PVN
Skin Care Tips For Men : మెరిసిపోయే చర్మం కోసం..వర్షాకాలంలో పురుషులు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
ప్రతీకాత్మక చిత్రం
Skin Care Tips For Men : సాధారణంగా బిజీ లైఫ్ స్టైల్ కారణంగా పురుషులకు(Mens చర్మ సంరక్షణ కోసం సమయం దొరకడం కష్టమవుతుంది. అయితే వర్షాకాలంలో పురుషుల చర్మం పాడవుతుంది.
Skin Care Tips For Men : సాధారణంగా బిజీ లైఫ్ స్టైల్ కారణంగా పురుషులకు(Mens చర్మ సంరక్షణ కోసం సమయం దొరకడం కష్టమవుతుంది. అయితే వర్షాకాలంలో పురుషుల చర్మం పాడవుతుంది. వర్షాకాలంలో చర్మం పాడవకుండా ఉండాలంటే ప్రత్యేక స్కిన్ కేర్(Skin Care) ను పురుషులు అనుసరించాలి. కొన్ని సులభమైన పద్ధతుల సహాయంతో వర్షాకాలంలో మీ చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవచ్చు.
వర్షాకాలంలో చాలా మంది పురుషులు తమ స్కిన్ పై ఆయిల్ లేకుండా ఉంచడానికి, మొటిమలు రాకుండా,ఉన్న మొటిమలను వదిలించుకోవడానికి ఖరీదైన సౌందర్య ఉత్పత్తులను ఉపయోగించడానికి ఇష్టపడతారు. అయితే చాలా ఉత్పత్తులు పురుషుల కఠినమైన చర్మంపై పెద్దగా ప్రభావం చూపవు. అదే సమయంలో వాటిలో ఉండే గట్టి రసాయనాలు కూడా చర్మాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి పురుషుల కోసం కొన్ని సులభమైన చర్మ సంరక్షణ చిట్కాలను తెలుసోవడం ద్వారా వీటిని ప్రయత్నించి మీరు వర్షాకాలంలో కూడా శుభ్రమైన మరియు మెరిసే చర్మాన్ని పొందవచ్చు.
ఇవి చేయండి
వర్షాకాలంలో ఉత్తమ చర్మ సంరక్షణ కోసం... ప్రతిరోజూ సన్‌స్క్రీన్ లోషన్, హైడ్రేటింగ్ ఫేషియల్, మాయిశ్చరైజర్ ఉపయోగించండి. ఇది కాకుండా, మీరు చర్మం యొక్క పొడిని తొలగించడానికి వేడి నూనెతో కూడా మసాజ్ చేయవచ్చు. మరోవైపు, ముఖాన్ని శుభ్రపరచడానికి స్క్రబ్బర్‌ను ఉపయోగించడం మర్చిపోవద్దు.
గడ్డం ట్రిమ్
ఈ రోజుల్లో పెద్ద గడ్డం, మీసాలు పెట్టుకోవడం మగవాళ్లలో ట్రెండ్. అయితే ఈ సీజన్లో దుమ్ము, మట్టి, కాలుష్య ప్రభావం మీ గడ్డం, మీసాల వెంట్రుకలపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి వర్షాకాలంలో గడ్డం, మీసాల వెంట్రుకలు తక్కువగా ఉంచండి. అలాగే, వాటిని ఎప్పటికప్పుడు ట్రిమ్ చేస్తూ ఉండండి.
బెస్ట్ స్కిన్స్ ప్రొడక్ట్ ని ఎంచుకోండి
సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని స్కిన్ ప్రొడక్ట్ లను ఎంచుకోవాలి. ఇది చర్మానికి సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది. తేలికపాటి క్లెన్సర్, సిలికాన్ ఆధారిత సన్‌స్క్రీన్, నీటి ఆధారిత మాయిశ్చరైజర్ ఉపయోగించడం వర్షాకాలంలో చర్మ సంరక్షణకు బెస్ట్ ఆప్షన్.
వర్షాకాలంలో తరచుగా చెమట పట్టడం వల్ల పురుషుల చర్మం జిడ్డుగా మారడం ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో, చర్మం రకం ప్రకారం తేలికపాటి క్లెన్సర్ తో ముఖాన్ని శుభ్రం చేయడం మర్చిపోవద్దు. అలాగే, ముఖం యొక్క అదనపు ఆయిల్ ని తగ్గించడానికి, మీరు వోట్మీల్ స్క్రబ్ లేదా బొప్పాయి ఫేస్ మాస్క్‌ని కూడా ప్రయత్నించవచ్చు.
చర్మం రకం అండ్ ఇంట్లో తయారుచేసిన ఫేస్ మాస్క్
వర్షాకాలంలో ఉత్తమ చర్మ సంరక్షణ కోసం చర్మ రకాన్ని గుర్తుంచుకోవడం మర్చిపోవద్దు. మీకు జిడ్డుగల చర్మం ఉన్నట్లయితే, ఓట్ మీల్ పేస్ట్- కాఫీతో కలబంద జెల్ ఫేస్ మాస్క్ మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మరోవైపు, పొడి చర్మంపై ఆపిల్ సైడర్ వెనిగర్, సాధారణ చర్మంపై నిమ్మరసం, పసుపు ఫేస్ మాస్క్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.