హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Vegetarian sources of protein: బర్డ్‌ఫ్లూ భయంతో చికెన్, గుడ్లకు గుడ్ బై చెప్పేశారా..? ఐతే వీటిని ఓ లుక్కేయండి..!

Vegetarian sources of protein: బర్డ్‌ఫ్లూ భయంతో చికెన్, గుడ్లకు గుడ్ బై చెప్పేశారా..? ఐతే వీటిని ఓ లుక్కేయండి..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశంలోని చాలా రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ వ్యాపించింది. దీంతో కాన్ని రాష్ట్రాలు కోళ్లు, గుడ్ల దిగుమతులను నిషేధించాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రజలు చికెన్, గుడ్లు తినడానికి భయపడుతున్నారు. అలా చికెన్, గుడ్లను మానేసిన వాళ్లు, ఈ ఆరు ఆహార పదార్థాలను ఓ లుక్కేయండి.

ఇంకా చదవండి ...

కరోనా వైరస్‌ మహమ్మారికి వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైందని ప్రజలు సంతోషపడేలోపే బర్డ్ ఫ్లూ వ్యాపిస్తోందనే వార్తలు వచ్చాయి. ఈ వ్యాధి పక్షులకు సోకుతుంది. ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా టైప్- A వైరస్ వల్ల బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకిన కోళ్లు, బాతులు, టర్కీ కోళ్లు, ఇతర పౌల్ట్రీ పక్షులు చనిపోతాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ వ్యాపించింది. దీంతో కాన్ని రాష్ట్రాలు కోళ్లు, గుడ్ల దిగుమతులను నిషేధించాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రజలు చికెన్, గుడ్లు తినడానికి భయపడుతున్నారు. బర్డ్ ఫ్లూ సోకిన పక్షి నుంచి విడుదలయ్యే స్రావాలను తాకితే, వైరస్ మనుషులకు వ్యాపించే అవకాశం ఉంది. బాగా ఉడికించిన కోడి మాంసం, గుడ్లను తినడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మాంసాహారం మానేయాలనుకునేవారు కొన్ని రకాల పదార్థాలను ఆహారంలో చేర్చుకుంటే ప్రోటీన్లు అందుతాయి.

Bird flu, Avian Influenza, Eggs, Chicken, Protein from vegetarian, Vegetarian sources of protein, Paneer, Soya bean, బర్డ్‌ఫ్లూ, ప్రోటీన్లు, పనీర్, గుడ్లు
సోయాబీన్

సోయా బీన్

సోయాబీన్ చికెన్ ఇతర మాంసాహారానికి మంచి ప్రత్యామ్నాయం. శరీరానికి అవసరమైన ప్రోటీన్లు దీని నుంచి అందుతాయి. అధిక మొత్తంలో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలకు సోయా నిలయంగా ఉంటుంది. సోయా నుంచి కొన్ని రకాల ఉత్పత్తులు చేసుకొని, ఆహారంలో తీసుకోవచ్చు. మిసో అనే పులియబెట్టిన సోయా బీన్ పేస్టును వంటల్లో ఫ్లేవర్ల కోసం వాడతారు. సోయా పాలతో చేసే టోఫుతో కూడా రుచికరమైన పదార్థాలు కొత్తగా తయారు చేసుకోవచ్చు. పనీర్‌ను ఇష్టపడనివారు సోయా టోఫును తీసుకోవచ్చు.

పప్పుధాన్యాలు, చిక్కుళ్లు

మన దేశంలోని చాలా ఇళ్లలో వివిధ రకాల పప్పులతో వంటలు చేసుకుంటారు. వీటిల్లో ప్రోటీన్, ఫోలేట్, ఫైబర్, ఐరన్, ఫాస్పరస్, పాలీ అన్ శాచురేటెడ్, మోనో శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. లినోలిక్, ఒలిక్ యాసిడ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటితో పాటు చిక్కుళ్లు కూడా కలిపి తీసుకునే సమతులాహారం వల్ల శరీరానికి అవసరమయ్యే అన్ని రకాల పోషకాలు అందుతాయి. ఊబకాయం, జీర్ణ సమస్యలను పప్పులు, చిక్కుళ్లు నిరోధిస్తాయి. గుడ్లు, చికెన్‌కు దూరంగా ఉండేవారు వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే ప్రోటీన్లు అందుతాయి.

 Bird flu, Avian Influenza, Eggs, Chicken, Protein from vegetarian, Vegetarian sources of protein, Paneer, Soya bean, బర్డ్‌ఫ్లూ, ప్రోటీన్లు, పనీర్, గుడ్లు
Photo by Louis Hansel @shotsoflouis on Unsplash

కొవ్వులు ఉండే నట్స్, సీడ్స్

జీడిపప్పు, బాదం, ఆక్రోట్లు, ఇతర గింజలు, విత్తనాల నుంచి ప్రోటీన్లతో పాటు విటమిన్ ఇ, బి6, నియాసిన్, ఫోలేట్ వంటివి శరీరానికి అందుతాయి. ఇవి మెగ్నీషియం, జింక్, ఐరన్, కాల్షియం, కాపర్, సెలీనియం, ఫాస్పరస్, పొటాషియం, డైటరీ ఫైబర్ వంటి ఖనిజాలకు మంచి వనరులుగా ఉంటాయి. వీటిల్లో మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా, శాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగా ఉంటాయి. కొన్ని రకాల నట్స్‌లో ఉండే అమైనో యాసిడ్ ఆర్జినైన్ రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి. చికెన్, గుడ్లు తిననివారు ఈ గింజలను ఆహారంలో భాగం చేసుకోవాలి.

paneer, great big story,gbs,lag,flavors,cheese,donkey cheese,serbia,culture,expensive,Zasavica Special Nature Reserve,Slobodan Simić, cheesemonger, cheesemaker, food,farmer,pasture,Food, Serbia,milk,donkey,Cheese
ప్రతీకాత్మకచిత్రం

పనీర్

దీన్ని కాటేజ్ చీజ్ అని కూడా అంటారు. పనీర్‌లో ప్రోటీన్లు ఎక్కువగా, కెలొరీలు చాలా తక్కువగా ఉంటాయి. పనీర్ నుంచి ఎన్నో రకాల సూక్ష్మ పోషకాలు శరీరానికి అందుతాయి. పాల ఉత్పత్తులతో చేసిన జున్ను, పనీర్ వంటి వాటికి శాకాహారంలో ప్రత్యేక స్థానం ఉంది. పనీర్ భుర్జీ, పనీర్ పరోటా, పనీర్ కోఫ్తా, పనీర్ బిర్యానీ వంటివి ఆహారంలో భాగం చేసుకునే శాకాహారులకు ప్రోటీన్ సమృద్ధిగా అందుతుంది.

క్వినోవా గింజలు

క్వినోవా గింజల్లో తొమ్మిది రకాల అమైనో యాసిడ్లు ఉంటాయి. వీటిల్లో గ్లూటెన్ ఉండదు. వీటి నుంచి జీవక్రియలకు అవసరమైన శక్తి, ప్రోటీన్లు శరీరానికి అందుతాయి. ఒక కప్పు ఉడికించిన క్వినోవా గింజల్లో సుమారు ఎనిమిది నుంచి పది గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. తృణ ధాన్యాలతో పోలిస్తే ఇవి మెరుగైనవని పోషకాహార నిపుణులు చెబుతారు. ఈ గింజలతో వివిధ రకాల వంటకాలు చేసుకోవచ్చు. క్వినోవా పులావ్, క్వినోవా బిర్యానీ, క్వినోవా ఉప్మా తయారు చేసుకొని తీసుకోవచ్చు.

Published by:Hasaan Kandula
First published:

Tags: Almonds Health Benefits, Ayurvedic health tips, Health benefits, Health food, Health Insurance, Health Tips

ఉత్తమ కథలు