సీతాఫలంపై అపోహలు, నిజాలు... ఈ సీజన్‌లో ఎందుకు తినాలంటే...

Sitaphal Myths And Facts : చక్కటి రుచి... తినేకొద్దీ తినాలనిపించే పండ్లలో సీతాఫలం ప్రత్యేకమైనది. శీతాకాలం రాగానే మన నోరూరించే ఈ పండ్లకు సంబంధించి చాలా అపోహలున్నాయి. వాటిని పటాపంచలు చేసేద్దాం.

news18-telugu
Updated: November 4, 2019, 9:36 AM IST
సీతాఫలంపై అపోహలు, నిజాలు... ఈ సీజన్‌లో ఎందుకు తినాలంటే...
సీతాఫలంపై అపోహలు, నిజాలు... ఈ సీజన్‌లో ఎందుకు తినాలంటే...
  • Share this:
Health Benefits of Custard Apple : సీతాఫలంలో పుష్కలంగా పోషకాలుంటాయి. విటమిన్ సీ, ఏ, పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ మనకు ఎంతో ఆరోగ్యకరం. శీతాకాలంలో ఎక్కువగా లభించే సీతాఫలాల్ని మిస్సవకుండా తినాలి. మన రోజువారీ డైట్‌లో వాటిని చేర్చుకోవాలి. మిస్సవకుండా తినాలి. ఐతే... సీతాఫలం అనగానే చాలా మంది రకరకాల అపోహలు ప్రచారం చేస్తున్నారు. వాటిని తింటే జలుబు చేస్తుందని కొందరు, షుగర్ వ్యాధి వస్తుందని మరికొందరు... ఇలా ఎన్నో రకాల అపోహలు. ఇలాంటివి వింటే... అమ్మో... వద్దులే తినకపోతేనే బెటర్ అని అనుకునే ప్రమాదం ఉంటుంది. నిజానిజాలు తెలియనంతవరకూ ఈ భ్రమలు పోవు. కానీ... తినకపోతే ఎన్నో పోషకాల్ని మనం మిస్సవుతాం కాబట్టి... అపోహల సంగతి తెలుసుకోవాల్సిందే.

డయాబెటిస్ ఉంటే సీతాఫలం తినకూడదా : సీతాఫలం గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంతో తెలుసా... 54. అందువల్ల ఈ పండును షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా తినవచ్చు. ఎందుకంటే... ప్రపంచవ్యాప్తంగా ఉన్న రూల్ ప్రకారం గ్లైసెమిక్ ఇండెక్స్ (Glycemic Index - GI) 55 లేదా అంతకంటే తక్కువ ఉండే పండ్లను డయాబెటిస్ ఉన్నవారు తినవచ్చు. అందువల్ల డాక్టర్లే ఈ పండ్లను తినమని సజెస్ట్ చేస్తారు కూడా. అందువల్ల ఈ అపోహను పక్కన పెట్టేసి... పండ్లను తినేయడమే.

హార్ట్ పేషెంట్లు సీతాఫలం తినకూడదా : ఈ అపోహ ఎవరు క్రియేట్ చేశారో గానీ... వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలి. ఎందుకంటే... సీతాఫలం తింటే... మన రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగవుతుంది. ఇందులోని సీ విటమిన్, పొటాషియం, మాంగనీస్ వంటివి గుండెకు మేలు చేస్తాయి. అందువల్ల సీతాఫలం తింటే గుండెకు మంచిదే. హార్ట్ పేషెంట్లు కూడా సీతాఫలాన్ని చక్కగా తినేయొచ్చు.

సీతాఫలం తింటే విరేచనాలు అవుతాయా?: ఇది మరో భ్రమ. నిజానికి సీతాఫలం జీర్ణవ్యవస్థను సరిచేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. అలాగే విరేచనాల్ని తగ్గిస్తుంది. మరో గొప్ప విషయమేంటంటే... కడుపులో అల్సర్లు, ఏసీడీటీ వంటి వాటిని ఈ పండు తగ్గిస్తుంది. ఇందులోని విటమిన్ B కాంప్లెక్స్, ముఖ్యంగా విటమిన్ B6 అనేది మనకు ఎంతో మేలు చేస్తుంది. అధిక బరువు ఉన్నవారు కూడా సీతాఫలాన్ని సంతోషంగా తినవచ్చు.PCOD ఉన్న మహిళలు తినకూడదా ? : ఇదో పెద్ద భ్రమ. ఎన్నో ఏళ్లుగా చాలా మంది నమ్ముతున్నారు. PCOD అనేది పీరియడ్స్‌కి సంబంధించిన మహిళల సమస్య. కానీ సీతాఫలంలో ఉండే ఐరన్... మహిళలకు మేలు చేస్తుంది. ఇది మహిళల్లో సంతాన సాఫల్యతను పెంచుతుంది. అలసట, నీరసాన్ని తగ్గిస్తుంది. గాయాలు, దురదల్ని తగ్గిస్తుంది. కాబట్టి PCOD ఉన్న మహిళలు కూడా సీతాఫలాన్ని తినాలి.

సీతాఫలం అనేది ఓ అద్భుతమైన ఫలం. లక్కీగా మన దేశంలో ఎక్కువ మొత్తంలో ఈ పండ్లు లభిస్తున్నాయి. ఇంత మంచివాటిని తినడం మానేసి అడ్డమైన అపోహలు ప్రచారం చేసేవాళ్లతో ఇబ్బందే. అన్ని వయసులవారూ సీతాఫలం తినవచ్చు. ఇవి మన స్కిన్ టోన్‌ను మెరుగుపరుస్తాయి. జుట్టును పట్టుగా చేస్తాయి. కంటి చూపును పెంచుతాయి. మన బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఇందులో పెద్ద మొత్తంలో బయో యాక్టివ్ మాలిక్యూల్స్ ఉంటాయి. అవి అధికబరువు, డయాబెటిస్, కాన్సర్ వంటి వాటితో పోరాడతాయి. కాబట్టి... అన్నీ మర్చిపోయి హాయిగా సీతాఫలం తినండి అంటున్నారు డాక్టర్లు.

 

Anjali : అందాల బాల అంజలి క్యూట్ ఫొటోస్
ఇవి కూడా చదవండి :

డయాబెటిస్ బాధిస్తోందా?... మీ లైఫ్‌స్టైల్‌లో ఈ మార్పులు చెయ్యండి

Diabetes Diet : డయాబెటిస్ ఉన్నవారు శీతాకాలంలో తినగలిగే పండ్లు


Health Tips : ఫ్యాట్‌ని తగ్గించే ఫ్రూట్స్... తింటే ఎన్నో బెనిఫిట్స్...


Health Tips : ఎలాంటి కాన్సర్ నైనా తరిమికొట్టే అరుదైన నల్ల పుట్టగొడుగులు


Health Tips : రాత్రి త్వరగా భోజనం చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

First published: November 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>