Home /News /life-style /

Hair Care Tips: మీ హెయిర్ మొత్తం చిట్లిపోతుందా? ఈ సింపుల్ టిప్స్‌ పాటించండి..

Hair Care Tips: మీ హెయిర్ మొత్తం చిట్లిపోతుందా? ఈ సింపుల్ టిప్స్‌ పాటించండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తగినంత తేమ అందనప్పుడు జుట్టు చివరలు చిట్లిపోతాయి. స్ప్లిట్ ఎండ్‌లు కనిపించగానే చాలామంది తమ జట్టును తరచుగా ట్రిమ్ చేస్తుంటారు. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటంటే..

ఈ రోజుల్లో పెరుగుతున్న కాలుష్యం, ధూళి వంటి బాహ్య కారణాల వల్ల కురుల ఆరోగ్యం బాగా దెబ్బతింటోంది. దీనికితోడు వివిధ రకాల హెయిర్ ప్రొడక్ట్స్ వాడకం పెరగడం వల్ల జుట్టు పొడిబారి నిర్జీవంగా కనిపిస్తుంది. అలాగే చాలామంది హెయిర్ చివరలు పల్చబడి చిట్లిపోయే (Split Ends) సమస్యను ఎదుర్కొంటున్నారు. తగినంత తేమ అందనప్పుడు జుట్టు చివరలు చిట్లిపోతాయి. స్ప్లిట్ ఎండ్‌లు కనిపించగానే చాలామంది తమ జట్టును తరచుగా ట్రిమ్ చేస్తుంటారు. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని జుట్టు సంరక్షణ జాగ్రత్తలను పాటించాలని చర్మరోగ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే స్ప్లిట్ ఎండ్స్ సమస్యకు చెక్ పెట్టేందుకు కొన్ని సులభమైన చిట్కాలను తెలియజేస్తున్నారు. ఆ చిట్కాలు ఏవో తెలుసుకుందాం.

* మీ జుట్టు తడిగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తలను పాత కాటన్ టీ షర్టు లేదా కాటన్ టవల్ తో తుడుచుకోండి. మృదువైన కాటన్ దుస్తులు వల్ల తడి జుట్టుపై చాలా తక్కువ ప్రభావం పడుతుంది. తద్వారా జుట్టు అనేది పాడు కాదు.

* మీ జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వడానికి పెద్ద పంటి దువ్వెన ఉపయోగించండి. ఈ దువ్వెన పళ్ల మధ్య చాలా దూరం ఉండాలి. లేదంటే తడిగా ఉన్న మీ జట్టు ఆరోగ్యాన్ని నాశనం అవుతుంది. అలాగే ఎట్టి పరిస్థితులలోనూ బ్రష్‌లను ఉపయోగించవద్దు. ఎందుకంటే ఇది జుట్టుకు చాలా నష్టం కలిగిస్తుంది.

* తల స్నానం చేసిన తరువాత కండీషనర్ తప్పకుండా ఉపయోగించండి. కండీషనర్ జుట్టు రాలే సమస్యకు దారి తీయదు. అందువల్ల మీరు నిస్సందేహంగా కండిషనర్ అప్లై చేసుకోవచ్చు.

* మీరు వారానికోసారి హెయిర్ మాస్క్ కూడా ఉపయోగించవచ్చు. శుభ్రంగా వాష్ చేసిన జుట్టుకు హెయిర్ మాస్క్ అప్లై చేయవచ్చు. ఈ హెయిర్ మాస్క్ అప్లై చేశాక సుమారు 15-20 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత షవర్ క్యాప్ ధరించి మీరు ఈ హెయిర్ మాస్క్‌ను వాష్ చేసుకోవచ్చు.

* జుట్టును వేడి చేసే పరికరాలను ఉపయోగించకపోవడమే శ్రేయస్కరం. ఒకవేళ హెయిర్ డ్రైయర్స్, స్ట్రెయిట్నర్స్ వంటి హీటింగ్ పరికరాలను ఉపయోగించినా.. చాలా తక్కువ హీట్ తో ఉపయోగించండి. ఒకవేళ కచ్చితంగా వినియోగించాల్సి వస్తే.. మీరు ముందుగా హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రేని ఉపయోగించవచ్చు.
Published by:Krishna Adithya
First published:

Tags: Hair problem tips

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు