హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Psychological Problems: కొందరు వ్యక్తులు ఎమోషనల్‌గా చాలా వీక్‌గా ఉంటారు..ఎందుకిలా..?

Psychological Problems: కొందరు వ్యక్తులు ఎమోషనల్‌గా చాలా వీక్‌గా ఉంటారు..ఎందుకిలా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఒక వ్యక్తి ఇతరులతో ఎమోషనల్‌గా కనెక్ట్ కాకపోవడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో అంశాలు కారణం కావచ్చు. అవేంటి, ఈ పరిస్థితిని ఎలా గుర్తించాలి, సమస్యకు పరిష్కారం ఏంటో చూద్దాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Psychological Problems: కొందరు ఎంత మంది మధ్య ఉన్నా ఒంటరిగా ఫీలవుతుంటారు. ఎమోషనల్‌గా(Emotional) అసలు కనెక్ట్ కాలేరు. అది స్నేహితులు, కుటుంబ సభ్యులతోనైనా కావచ్చు. జరుగుతున్న విషయాలపై ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుంటారు. నలుగురిలో కలవడానికి కూడా ఇష్టపడరు. ఒక వ్యక్తి ఎమోషనల్‌గా కనెక్ట్ కాకపోవడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో అంశాలు కారణం కావచ్చు. అవేంటి, ఈ పరిస్థితిని ఎలా గుర్తించాలి, సమస్యకు పరిష్కారం ఏంటో చూద్దాం.

* చిన్నతనంలో నిర్లక్ష్యానికి గురికావడం

సాధారణంగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో అనుబంధం ఉన్న వ్యక్తుల్లో చిన్న వయసు నుంచే ఎమోషనల్ ఫీలింగ్స్ ఏర్పడతాయి. దీని బట్టి వ్యక్తుల ప్రవర్తన, వ్యహారశైలి ఉంటుంది. ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేనివారు చిన్నతనంలో నిర్లక్ష్యానికి గురై ఉండవచ్చు. అయిన వారి నుంచి అవసరమైన ప్రేమ, ఆప్యాయత, ఎమోషనల్ సపోర్ట్ పొందలేకపోతే, ఆ తర్వాత సంబంధాల పట్ల వారు ఆసక్తి చూపకపోవచ్చు.

* మానసిక సమస్యలు

డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి వంటి మానసిక సమస్యల వల్ల కూడా చాలా మంది ఇతరులతో ఎమోషనల్‌గా కనెక్ట్ లేకపోవచ్చని నిపుణులు అంటున్నారు. ఈ సమస్యల కారణంగా బాగా ఇష్టమైనవారితో కూడా ఎమోషనల్ రిలేషన్‌షిప్ కొనసాగించడానికి చాలా మంది ఆసక్తిచూపరు. పనిలో సమస్యలు, వర్క్‌లోడ్ కారణంగా కూడా కొందరు ఇతరులతో మాట్లాడటానికి ఆసక్తి చూపకపోవచ్చు.

ఏదైనా గొడవ లేదా మరణం ద్వారా బాగా ఇష్టమైన వ్యక్తిని కోల్పోతే, కొంత మందిలో అది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎవరితో మాట్లాడకపోవడం, ఒంటరిగా ఉండడం, జీవితం పట్ల నిరాశతో ఉంటారు. ఇలాంటి వారు ఇతరులతో మాట్లాడటానికి కూడా ఇష్టపడరు.

** ఇతరులతో ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేని వారిలో ప్రధానంగా కనిపించే సంకేతాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే..

Harvard Study: పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ కాలం ఎందుకు జీవిస్తారు?హార్వర్డ్ రిసెర్చ్ సమాధానాలు ఇవే..

* సానుభూతి లేకపోవడం

ఎమోషనల్‌గా ఫీల్ అవ్వలేనివారు ఇతరులను అసలు పట్టించుకోరు. వారిలో ఇతరుల పట్ల సానుభూతి కూడా అంతగా ఉండకపోవచ్చు. అయినవారు ఇబ్బందుల్లో ఉన్నా, తమకేం సంబంధం లేనట్లు వ్యవహరిస్తుంటారు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరుల భావాలను పరిగణనలోకి తీసుకోరు. తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు. అందుకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటారు.

* రక్షణాత్మక ధోరణి

ఎమోషన‌ల్‌గా కనెక్ట్ కాలేనివారి వ్యవహారశైలి తరచూ రక్షణాత్మకంగా ఉంటుంది. ఇతరులను అసలు నమ్మకపోవచ్చు. వారు ఎదుర్కొంటున్న సమస్యలకు కారణాలను ఇతరులకు ఆపాదిస్తుంటారు. ప్రతి విషయంలో తమను తాము సమర్థించుకోవడానికి మొగ్గు చూపుతారు. ఇతరులను అసలు లెక్కచేయరు.

* కమిట్మెంట్ లేకపోవడం

ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేని వ్యక్తికి నిబద్ధతగా వ్యవహరించడం సవాల్ లాంటిది. వారు ఎవరితోనూ క్లోజ్‌గా మూవ్ కావడానికి ఇష్టపడరు. దీంతో పెళ్లి సంబంధాలను సైతం వాయిదా వేయవచ్చు. ఏ పని పట్ల ఆసక్తి చూపరు. కుటుంబం లేదా స్నేహితులతో ఏదైనా ప్లాన్ చేయడానికి కూడా ఇష్టపడరు. ఇలాంటి వారు తరచూ తమ కార్యక్రమాలను వాయిదా వేయడానికి మొగ్గుచూపుతుంటారు.

* పరిష్కారం ఏంటి?

భావోద్వేగంగా స్థిరంగా లేనివారు వివిధ మార్గాల ద్వారా తిరిగి సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చు. మానసిక వైద్యులను సంప్రదించి వారి సూచనల ప్రకారం నడుచుకుంటే అది సాధ్యమవుతుంది. అంతేకాకుండా బాగా ఇష్టమైన వ్యక్తులతో ఎక్కువ సమయం గడపడం, మనసుకు నచ్చిన పనులు చేయడం ద్వారా కూడా తిరిగి సాధారణ జీవితాన్ని పొందవచ్చు.

First published:

Tags: Lifestyle

ఉత్తమ కథలు