హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Love Signs: మీరు ప్రేమలో పడ్డారని డౌట్‌గా ఉందా? ఈ టెస్ట్ చేసుకోండి.. మీకే తెలుస్తుంది..

Love Signs: మీరు ప్రేమలో పడ్డారని డౌట్‌గా ఉందా? ఈ టెస్ట్ చేసుకోండి.. మీకే తెలుస్తుంది..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొంపదీసి మనం లవ్ లో పడ్డామా? అని ఏదో ఒక దశలో ప్రతి ఒక్కరికీ డౌట్ వస్తుంది. మీకు కూడా అలాంటి అనుమానం వస్తే కచ్చితంగా దాన్ని చెక్ చేసుకోవాలి. అయితే, మనం ప్రేమలో పడ్డామా? లేదా అనేది కన్ ఫాం చేసుకోవడానికి ఇలా చేసి చూడండి.

  • Trending Desk
  • Last Updated :
  • Andhra Pradesh | telangana

‘ప్రేమలో పడితే అంతేనెహే కలరొచ్చేస్తారు’ ఇది ఓ పాపులర్‌ తెలుగు సినిమాలోని డైలాగ్‌. నిజమే ప్రేమలో పడితే చాలా మార్పులు కనిపిస్తాయి. అయితే ఆ మార్పులకు కారణం ప్రేమేనా? కాదా? అనే కన్ఫ్యూజన్‌లో చాలా మంది ఉంటారు. అయితే ఇలాంటి కన్ఫ్యూజన్‌లో ఉన్నవారు తాము ప్రేమలో ఉన్నామో లేదో తెలుసుకోవాలంటే కొన్ని ముఖ్య సంకేతాలు (Signs You're Love) గమనించాలి. అవేవో ఇప్పుడు చూద్దాం.

నిత్యం వారి గురించే మదిలో మెదిలే ఆలోచనలు

ఒక అబ్బాయికి ఓ అమ్మాయి ఇష్టాయిష్టాలు తెలుసుకోవాలనే కుతూహలం పెరిగితే అతడు ప్రేమలో పడినట్లే లెక్క. అమ్మాయిలకీ ఇది వర్తిస్తుంది. ప్రేమలో పడిన వ్యక్తికి మంచి చేయాలని ఎల్లప్పుడూ అనిపిస్తుంది. సర్‌ప్రైజ్ చేయడం, వారికిష్టమైన గిఫ్ట్స్‌ ఇవ్వడం, తోడుగా ఉంటూ వారిని నిత్యం కాపాడుకోవడం వంటివి లక్షణాలన్నీ ప్రేమను తెలిపే సంకేతాలే! ముఖ్యంగా మీరు వారితో లేకపోయినా వారి గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే, వారితో గడిపిన క్షణాలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటే, మీరు వారి ప్రేమలో పడ్డారని అనుకోవచ్చు. లవ్‌లో ఉంటే వారికి బాగా నచ్చిన పనులను మీరు కూడా నేర్చుకోవచ్చు.

వారిపట్ల పెరిగే అసూయ, ఓపిక

ప్రేమలో పడినప్పుడు అసూయ దానంతటదే మనలో పెరిగిపోతుంది. మనకిష్టమైనవారు వేరే వ్యక్తితో నవ్వుతూ మాట్లాడినా లేదా ఇంకేదైనా కారణంగానైనా మీలో వెంటనే అసూయ పెరిగితే అది ప్రేమ అవ్వొచ్చు. ప్రేమలో ఉన్నప్పుడు ప్రేమించిన వ్యక్తిపై తప్ప మాజీ లవర్లపై మీ ధ్యాసే మళ్లదు. అలాగే అన్ని విషయాల్లోనూ వారితో చాలా నిజాయితీగా ఉండాలని అనిపిస్తుంది. నిజానికి ఒక వ్యక్తిపై ప్రేమ ఉంటే వారు ఎలాంటి బట్టలు వేసుకున్నా, ఎలాంటి అల్లరి లేదా చెడ్డ పనులు చేసినా కోపం రాదు. వారి చిలిపి చేష్టలను భరించే ఓపిక సహజంగానే పెరుగుతుంది. ప్రేమించే వ్యక్తిని అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఒక్కోసారి వారికి కావాల్సిన ఏకాంత సమయం కూడా ఇవ్వాలనిపిస్తుంది.

Also Read: విడిపోయి మళ్లీ కలవాలనుకుంటున్నారా?ఈ 5 టిప్స్ ఉపయోగపడతాయ్!


వారిని చూస్తే చాలు పెరిగే ఎగ్జైట్‌మెంట్

ఇద్దరు వ్యక్తులు సరదాగా నవ్వుకుంటూ, అప్పుడప్పుడు గిల్లికజ్జాలు దిగితే వారి మధ్య ప్రేమ ఉందని చెప్పవచ్చు. ఒకరికొకరు ఏకాంతంగా ఉన్నప్పుడు చాలా సౌకర్యంగా ఉంటేనే వారి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అలానే ఒక రిలేషన్‌షిప్‌లో ఎమోషనల్‌, ఫిజికల్‌, సెక్స్‌వల్‌ పరంగా సేఫ్‌గా ఫీల్ అవుతూ ఉంటే అది ప్రేమ అవ్వొచ్చు. వారు మీతో ఉన్నప్పుడు మీరు చాలా హ్యాపీగా ఉంటూనే కాస్త నెర్వస్‌గా ఫీలైతే మీరు వారిని లవ్ చేస్తుండొచ్చు. నిజానికి మనసుకు నచ్చిన వారిని చూడగానే శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్లు అధిక స్థాయిలో రిలీజ్ అవుతాయి. అప్పుడు శరీరమంతా పులకించిపోతుంది. ఎవరినైనా చూసినప్పుడు మీరు కూడా ఇలానే ఎగ్జైట్ అవుతే.. వారంటే మీకు చెప్పలేనంత ఇష్టం అని అర్థం. ప్రేమలో ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొనపోయినా మామూలు కౌగిలింతలు, బాడీ టచ్‌లు ఒక మధురమైన అనుభూతిని కలిగిస్తాయి.

Also Read: Right Relationship: మీరు సరైన వ్యక్తితోనే రిలేషన్‌షిప్‌లో ఉన్నారా..? ఇలా టెస్ట్ చేసుకోండి..


సపోర్ట్ చేయకుండా ఉండలేరు

ఒక లవ్ రిలేషన్‌షిప్‌లో ఒకరికొకరు తప్పకుండా సపోర్ట్ చేసుకుంటారు. లైఫ్ గోల్స్ సాధించడంలో వెన్నంటే ఉండి సాధ్యమైనంత హెల్ప్ చేస్తారు. మీరు కూడా ఒక ఆపోజిట్ సెక్స్‌కి ఇలానే సపోర్ట్ చేస్తున్నట్లయితే అది ప్రేమే కావచ్చు. సపోర్ట్ చేయడమే కాదు వారి తప్పులను, బలహీనతలను కూడా అంగీకరించే స్థాయికి వచ్చినా వారిపై ప్రేమ ఉన్నట్లే! అలాగే ప్రేమించిన వారికి ఏదైనా చెడు జరిగితే మీరు బాగా బాధ పడటం, వారిని సంతోషపరిచేందుకు దేనికైనా తెగించడం సహజం. ఇద్దరూ కలిసి షాపింగ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడినా మీ మధ్య లవ్ ఉందని చెప్పవచ్చు.

Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Relationship

ఉత్తమ కథలు