Health Tips : ఏసీలో ఎక్కువసేపు ఉంటున్నారా... అయితే డేంజరే

AC Temperature : ఉష్ణమండల ప్రాంతమైన ఇండియాలో భూతాపం వల్ల వేడి నానాటికీ పెరుగుతోంది. దానికి తోడు కట్టే ఇళ్లలోకి సహజసిద్ధంగా గాలి రాకుండా క్లోజ్‌డ్ డోర్స్ ఉంటున్నాయి. ఫలితంగా ప్రజలు ఏసీలను ఎక్కువగా వాడుతున్నారు. కానీ వాటి వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ తెలిస్తే, ఏసీ వాడాలంటేనే భయపడే పరిస్థితి వస్తుంది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 13, 2019, 11:00 AM IST
Health Tips : ఏసీలో ఎక్కువసేపు ఉంటున్నారా... అయితే డేంజరే
ఏసీ ఎక్కువగా వాడుతున్నారా?
Krishna Kumar N | news18-telugu
Updated: September 13, 2019, 11:00 AM IST
Side Effects of AC : ఎండాకాలంలో ఏసీ వాడటం కామన్. ఇతర కాలాల్లో కూడా చాలా మంది ఏసీ వాడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆఫీసులు, ప్రైవేట్ కంపెనీలు, సాఫ్ట్‌వేర్ హబ్‌లలో ఏసీలను ఎక్కువగా వాడుతున్నారు. 24 గంటలూ ఏసీలు ఆన్‌లోనే ఉంటాయి కొన్ని కంపెనీల్లో. ప్రజలు కూడా ఏసీలకు బాగా అలవాటుపడిపోతున్నారు. చివరకు బస్సుల్లో ప్రయాణిస్తూ కూడా... బయటి నుంచీ గాలి వచ్చే అవకాశం ఉన్నా... ఏసీ బస్సుల్నే ఎంచుకుంటున్నారు. అంతలా ఏసీలకు అలవాటుపడిపోతున్నారు. ఐతే... ఆ చల్లదనం సహజసిద్ధమైనది కాదు కదా... అందువల్ల అది చాలా సైడ్ ఎఫెక్ట్స్ తెస్తోందని పరిశోధనల్లో తేలింది. ఒక్క మాటలో చెప్పాలంటే... ఏసీల్లో ఉండటం వల్ల ప్రయోజనాల కంటే, నష్టాలే ఎక్కువ.

ఏసీల వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ :
- డ్రై ఐస్... ఈ రోజుల్లో ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య ఇది. కళ్లలో మంటలు, కళ్లకు దురదలు వంటివి ఎక్కువవుతున్నాయి. వీటికి ప్రధాన కారణం ఏసీలో ఎక్కువసేపు ఉండటమే. డ్రై ఐస్ సమస్య ఉన్నవారు ఏసీలకు దూరంగా ఉండాలి.

- ఏసీ ఆన్ చెయ్యగానే తలుపులు మూసేస్తాం. ఫలితంగా మన నుంచీ రిలీజ్ అయ్యే కార్బన్ డై ఆక్సైడ్‌ను మనమే పీల్చుతూ ఉంటాం. దీని వల్ల ఆక్సిజన్ తక్కువై తలనొప్పి వస్తుంది. దాన్ని లైట్ తీసుకుంటే... క్రమంగా అది మైగ్రేన్ తలనొప్పిగా మారుతుంది. ఒక్కసారి మైగ్రేన్ తలనొప్పి వస్తే, ఇక అది మళ్లీ మళ్లీ వచ్చే ప్రమాదం ఉంటుంది. మైగ్రేన్ తలనొప్పి వస్తే ఏమాత్రం తట్టుకోలేం. తల బద్దలైపోతున్నట్లే ఉంటుంది.- ఏసీ వల్ల బ్లడ్‌లో ఆక్సిజన్ తక్కువై బాడీ త్వరగా ఆలసిపోతుంది. లోబీపీ వచ్చేందుకు కూడా ఏసీ కారణమవుతుందని తెలుసా మీకు.

- ఏసీ చల్లదనం ఎంత పెంచితే... మనం అంతగా డీహైడ్రేషన్‌కి చేరుకుంటాం. అందువల్ల ఎక్కువ నీరు తాగాల్సిందే.

- ఏసీలో ఉండేవాళ్లు ఎక్కువగా నీళ్లు తాగకపోతే, వాళ్లకు కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం వస్తుంది.
Loading...
- ఏసీ వల్ల చర్మం పొడిబారిపోతుంది. ఇక అప్పుడు ఏవో ఒక క్రీములు వాడాల్సిన పరిస్థితి వస్తుంది.

- ముక్కు, గొంతు, కళ్లు దెబ్బతింటాయి. గొంతులో గరగరగా ఉంటుంది. ముక్కు దిబ్బడ వచ్చినట్లు అవుతుంది. దీనికి కారణం ఏసీ వల్ల వచ్చే వైరల్ అలర్జీలే.

- ఆస్తమా వంటి సమస్యలు. మనకు ఏ అనారోగ్యమూ లేనంతకాలం బాగానే ఉంటుంది. ఒక్కసారి ఆస్తమా లాంటి సమస్యలు వచ్చాయంటే... అవి ఓ పట్టాన పోవు. ఎన్ని మందులువాడినా తగ్గవు. ఏసీ వల్ల కూడా ఆస్తమా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి... వీలైనంతవరకూ ఏసీకి దూరంగా ఉండాల్సిందే.

- నీరసం, నిస్సత్తువ, ఏదో పోగొట్టుకున్నవారిలా తయారవుతాం. ఇలాంటి అనారోగ్య సమస్యలన్నింటికీ కారణం ఈ కృత్రిమ చల్లదనాన్ని ఇచ్చే ఏసీలే. కాబట్టి ఏసీలకు దూరంగా ఉండాలి.

- ఏసీల వల్ల మరో సమస్య అలర్జీలు. ఎలుకలు, పందికొక్కులూ... వివిధ ఆఫీసుల్లోని సెంట్రల్ ఏసీల్లో గూడు కట్టుకుంటాయి. అడ్డమైన వ్యర్థాల్నీ అక్కడికే తెచ్చి తింటాయి. ఫలితంగా ఏసీల్లో విషపూరితమైన వాతావరణం ఉంటుంది. మనం ఏసీ వెయ్యగానే... ఆ విష వ్యర్థాల గాలిలో కలిసి... మనల్ని చేరతాయి. ఆ తర్వాత మనకు రకరకాల వ్యాధులు వచ్చేందుకు కారణం అవుతాయి. అందువల్ల ఏసీలను నెలకోసారైనా క్లీన్ చెయ్యాలి.

అందువల్ల ఏసీలో ఎక్కువ సేపు ఉండకపోవడమే మంచిది. వీలైనప్పుడల్లా... బయటి వాతావరణంలో ఉండాలి. ఆఫీసులు, కంపెనీల్లో తలుపులు, కిటికీలూ తెరవాలి. సహజసిద్ధమైన గాలిని లోపలికి రానివ్వాలి.
First published: September 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...