Home /News /life-style /

SIDE EFFECTS AND DISADVANTAGES OF MORE CONSUMPTION OF COFFEE AK GH

Coffee Side effects: కాఫీ ఎక్కువగా తాగుతున్నారా? ఈ సమస్యలు ఖాయం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Coffee Side effects: కాఫీని ఎక్కువగా తాగడం, సమయపాలన లేకుండా తీసుకోవడం కూడా మంచిది కాదని అధ్యయనాలు చెబుతున్నాయి.

కాఫీ మీద ఎన్నో రకాల అపోహలు ఉన్నాయి. కొందరు కాఫీ ఆరోగ్యానికి మంచిది అని చెబితే మరికొందరు కాఫీ అలవాటు చేసుకోవద్దని చెబుతారు. అయితే కాఫీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఉన్నాయనేది ఎక్కువ మంది అభిప్రాయం. అందుకే, కొందరు ఉదయాన్నే కప్పు కాఫీ తాగందే వారి దినచర్యను ప్రారంభించరు. ఇది రోగ నిరోధక శక్తిని మెరుగుపర్చడానికి, రోజును గొప్పగా ప్రారంభించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, కాఫీని ఎక్కువగా తాగడం, సమయపాలన లేకుండా తీసుకోవడం కూడా మంచిది కాదని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని వల్ల ప్రయోజనాలకు బదులుగా దుష్ప్రభావాలే ఎక్కువగా ఉన్నాయని తేలింది.

బ్రిటీష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురించిన ఒక కొత్త అధ్యయనంలో ఖాళీ కడుపుతో ఉదయాన్నే ఒక కప్పు బ్లాక్ కాఫీని తాగడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు ప్రమాదకరంగా పెరుగుతాయని పేర్కొంది. క్రమం తప్పకుండా ఇలా చేయడం మూలాన నిద్రలేమి, డయాబెటిస్తో పాటు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అందువల్ల, అల్పాహారం తీసుకున్న తర్వాతే మీ మొదటి కప్పు కాఫీ తీసుకోవటం మంచిదని పరిశోధకులు సిఫార్సు చేస్తున్నారు. అధికంగా కాఫీ తాగడం వల్ల కలిగే ఐదు దుష్ప్రభావాలు ఇలా ఉన్నాయి.

నిద్ర సమస్యలు
నిద్రపోయే ముందు కాఫీ తాగకూడదని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. నిద్ర రాకుండా చేయడానికి కాఫీ బాగా పనిచేస్తుందన్న విషయం తెలిసిందే. అయితే, దీన్ని నిద్రపోయే ముందు తీసుకుంటే మీ నిద్ర ఆలస్యమవడమే కాకుండా, నిద్రలేమిని ఎదుర్కొంటారు. దీన్ని నివారించడానికి మీ చివరి కప్పు కాఫీని నిద్రపోవడానికి రెండు- నుంచి మూడు గంటల ముందు మాత్రమే తీసుకోవాలని వారు అభిప్రాయపడుతున్నారు.

ఆందోళన
కాఫీ ఆడ్రినలిన్ విడుదలను ప్రేరేపిస్తుంది. అయితే ఎక్కువ కాఫీ తీసుకోవడం అనేది మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుంది. మీకు ఇప్పటికే కెఫిన్ సెన్నిటివిటీ ఉన్న వారై అధిక మొత్తంలో కాఫీ తీసుకుంటే అది క్రమంగా ఆందోళన లేదా భయానికి దారితీస్తుంది. అందువల్ల మీకు మైకము, నాడీ లేదా చేతులు వణుకుతున్నట్లు అనిపిస్తే అది ఎక్కువ కాఫీ తీసుకుంటున్న దానికి సంకేతంగా చెప్పవచ్చు. అందువల్ల ఎక్కువ మొత్తంలో కాఫీని సేవించకపోవడమే మంచిది.

జీర్ణ సమస్యలు
అధిక మొత్తంలో కాఫీ తీసుకోవడం మీ శరీరంలో ప్రేగు కదలికలను ప్రేరేపిస్తుంది. మీరు గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ (GERD) వంటి సమస్యలతో బాధపడుతున్నప్పటికీ, ఎక్కువ మొత్తంలో కాఫీ తీసుకుండే అది మరిన్ని సమస్యలకు దారి తీస్తుంది. దీని వల్ల అజీర్ణం, విరేచనాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మీరు జీర్ణ సమస్యతో బాధపడుతుంటే మీ కాఫీ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు లేదా కాఫీకి బదులుగా టీని ఎంచుకోవచ్చు.

డిపెండెన్సీ
కొన్ని డ్రగ్స్ తీసుకోవడం వల్ల మెదడులో కెమికల్ రియాక్షన్ జరిగి అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాని కాఫీలో ఉండే కెఫిన్ వినియోగం మాత్రం ఇలాంటి వ్యసనానికి దారితీయదు. అయినప్పటికీ, కాఫీ అధికంగా తీసుకోవడం కాలక్రమేణా మానసిక మరియు శారీరక సమస్యలకు కారణమవుతుంది. అయితే, కాఫీని అకస్మాత్తుగా మానేస్తే తలనొప్పి, చికాకు, బద్ధకం లేదా అలసట వంటి సమస్యలు రావొచ్చు. అందువల్ల కాఫీని వ్యసనంగా చేసుకోకూడదు.

హై బీపీ మరియు హార్ట్ రేటు
కాఫీ నిద్ర నుంచి మేల్కొలిపే ఔషధంగా పనిచేస్తుందనే విషయం తెలిసిందే. అయితే, ఎక్కువ మోతాదులో కాఫీ తీసుకోవడం ద్వారా సెన్సిటివిటీ ఉన్నవారిలో బ్లడ్ ప్రెజర్తో పాటు హార్డ్ రేటు పెరుగుతుంది. ఇది క్రమంగా గుండె సమస్యలకు దారితీయడమే కాకుండా హృదయ సంబంధ వ్యాధుల తీవ్రతను పెంచుతుంది. ఇటువంటి దుష్ప్రభావాలకు లోనవ్వకుండా ఉండాలంటే తక్కువ మోతాదులో కాఫీ తీసుకోవడం మంచిది.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Coffee

తదుపరి వార్తలు