Home /News /life-style /

SIDE AFFECTS OF USING TOWEL ON FACE PVN

Skin care tips : టవల్ తో మొఖం తుడుచుకుంటున్నారా?అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Skin care tips:మొఖం కడుక్కున్న(Face Wash) తర్వాత చాలామంది మొఖం తుడుచుకోడానికి తువ్వాలు(Towel) ఉపయోగిస్తారు. టవల్‌తో ముఖాన్ని తుడుచుకునే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం.

    Skin care tips:మొఖం కడుక్కున్న(Face Wash) తర్వాత చాలామంది మొఖం తుడుచుకోడానికి తువ్వాలు(Towel) ఉపయోగిస్తారు. టవల్‌తో ముఖాన్ని తుడుచుకునే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. చాలా సార్లు ముఖం కడుక్కున్న తర్వాత టవల్ తో నోటిని తుడుచుకోవడం అలవాటు చేసుకుంటారు. దీని వల్ల చాలా దుష్ప్రభావాలు ముఖంపైనే కనిపిస్తాయి. టవల్స్ వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి మీకు తెలుసా? ? ముఖంపై టవల్స్ ఉపయోగించడం వల్ల చర్మానికి చాలా హానికరం అని మీకు తెలుసా? తువ్వాళ్ల వల్ల కలిగే కొన్ని నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

    పొడి చర్మ సమస్యలు
    ముఖ చర్మం సాధారణంగా చాలా సున్నితంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, ముఖంపై టవల్‌ను పదేపదే ఉపయోగించడం వల్ల మొఖం(Face)లోని సహజ ఆయిల్ తగ్గడమే కాకుండా ముఖం యొక్క తేమను కూడా తగ్గిస్తుంది. దీని కారణంగా చర్మం పొడిబారడం, నిర్జీవంగా అనిపించడం ప్రారంభమవుతుంది

    మొటిమ సమస్య
    కొంతమంది టవల్స్‌ను చాలా రోజుల పాటు ఉతకకుండా వాడుతుంటారు. అటువంటి పరిస్థితిలో టవల్స్ యొక్క క్రిములు కూడా మొఖం మీద వస్తాయి. దీని వల్ల మొఖంపై మొటిమలు, చర్మ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. మరోవైపు, మొఖం తుడవడానికి టిష్యూ పేపర్ లేదా కాటన్ ఉపయోగించడం మంచిది.

    Nail Extensions : గోర్లు పెంచుకుంటున్నారా?అర్జెంట్ గా ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి

    సౌందర్య ఉత్పత్తులు
    మొఖానికి టవల్ ఉపయోగించడం వల్ల ముఖం డల్ గా, డ్రైగా కనిపిస్తుంది. దీని కారణంగా మాయిశ్చరైజర్లు , లోషన్ల వాడకం ముఖంపై మెరుపును తీసుకురావడానికి సహాయపడదు. తడి ముఖంపై లోషన్ లు అప్లై చేయడానికి టవల్ ను ఉపయోగించకుండా ఉండండి.

    Relationship Tips : ప్రేమికులు,పెళ్లైన వాళ్లు ఇలా చేస్తే..ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది

    ముడతలు
    ముఖ చర్మం చాలా మృదువుగా, ఫ్లెక్సిబుల్‌(Flexible)గా ఉంటుంది, అయితే టవల్‌ని ఉపయోగించడం వల్ల మొఖం చర్మం పొడిగా,గరుకుగా మారుతుంది. అదే సమయంలో చర్మం కూడా సాగిపోవడం ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు ముఖంపై ముడతలు, సన్నని గీతల సమస్యను ఎదుర్కొనవచ్చు.



    శుభ్రపరచడం
    మొఖం మీద టవల్ ని తక్కువసార్లు ఉపయోగించడానికి ప్రయత్నించండి. అయితే, ప్రతిరోజూ శుభ్రమైన నీటితో తువ్వాలను కడగడం మర్చిపోవద్దు. ఇది టవల్‌లో ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. అలాగే మొఖాన్ని తుడవడానికి ఎల్లప్పుడూ మృదువైన ఫాబ్రిక్ తువ్వాలను ఉపయోగించండి.
    Published by:Venkaiah Naidu
    First published:

    Tags: Skin care

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు